
శ్రీజిత్ రవిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
పలక్కాడ్ : స్యూలు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన మలయాళ నటుడు, వ్యాపారవేత్త శ్రీజిత్ రవిని శుక్రవారం పోలీసులు పాలక్కాడ్ అడిషనల్ సెషన్ కోర్టులో హాజరు పరిచారు. కాగా అతడిపై పోలీసులు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికా లైంగిక నేరాల నిరోధక రక్షణ చట్టం (పోస్కో) ప్రకారం నేరం రుజువైతే ...కనీసం ఏడేళ్ల పాటు జైలు జీవితం గడపాల్సిందే. కేరళలో సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే కారులో ఉన్న ఓ వ్యక్తి నగ్నంగా తమవైపు చూస్తూ వెకిలి హావభావాలకు పాల్పడ్డాడని, తమ ఫొటోలను తీసుకున్నాడని పలువురు విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పథిరిపాలెంలోని ఓ ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి వాహనం నెంబర్ను విద్యార్థులు పోలీసులకు అందచేశారు. కారు యాజమాని గురించి ఆరా తీయగా, అది నటుడు శ్రీజిత్ రవిగా తేలింది. దీంతో అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను శ్రీజిత్ రవి కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తాను ఎలాంటి తప్పుడు చర్యలకు పాల్పడలేదని చెప్పుకొచ్చాడు. కాగా శ్రీజిత్ రవికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.