
సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అనగానే కోట్ల రూపాయల రెమ్యునరేషన్, లగ్జరీ లైఫ్.. ఇవే మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ తాను కూడా కారుకి ఈఎంఐ కడుతున్నానని సలార్ ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చాడు. ఎల్ 2 ఎంపూరన్ మూవీ ప్రెస్ మీట్ లో ఈ కామెంట్స్ చేశాడు. అలానే డైరెక్షన్ అనేది తన తెలివి తక్కువ నిర్ణయమని చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బాలీవుడ్ నిర్మాతల పరువు తీసేసిన హిందీ స్టార్ హీరో)
'నాకు డబ్బు సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ కారు ఈఎంఐ కడుతున్నాను. దర్శకత్వం చేయడం ఆర్థికంగా నేను తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయం. ఎందుకంటే ‘ఎల్-2: ఎంపురాన్’ కోసం రెండేళ్లు అయిపోయింది. ఆ టైంలో నటుడిగా ఎన్నో సినిమాలు పక్కనబెట్టేశా. అవి చేసుంటే బోలెడు డబ్బులు సంపాదించేవాడిని. అలా అని ఎప్పుడూ డబ్బు కోసం సినిమాలు చేయలేదు. కానీ యాడ్స్ మాత్రం చేశాను. రెండు గంటల యాడ్ షూటింగ్ లో పాల్గొంటే చాలా డబ్బులిచ్చేవారు. కానీ నేను ప్రమోట్ చేసే ఉత్పత్తుల విషయంలో మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడిని' అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.
మోహన్ లాల్ ని హీరోగా పెట్టి ‘ఎల్-2: ఎంపురాన్’ సినిమా తీసిన పృథ్వీరాజ్.. గతంలో సలార్ మూవీలో చేశాడు. ప్రస్తుతం రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్ లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరిన్ని సినిమాలు చేసేందుకు ఇతడికి ఆఫర్స్ వస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం లాంబోర్గిని అనే ఖరీదైన కారు కొన్నాడు. దానికే ఈఎంఐ కడుతున్నానని ఇప్పుడు చెప్పాడు.
(ఇదీ చదవండి: 'కన్నప్ప' మూవీని ట్రోల్ చేస్తే శాపానికి గురవుతారు: రఘుబాబు)
Comments
Please login to add a commentAdd a comment