మలయాళ స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఎంపురన్ (లూసిఫర్-2). 2019లో విడుదలైన లూసిఫర్‌కు సీక్వెల్‌గా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు మోహన్‌లాల్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.
మోహన్ లాల్ తన ట్వీట్‌లో రాస్తూ..' ఎంపురాన్ 14 నెలల అద్భుతమైన ప్రయాణం. ఎనిమిది రాష్ట్రాలతో పాటు యూఎస్, యూకే, యూఏఈ సహా దాదాపు నాలుగు దేశాల్లో పర్యటించాం. ప్రతి ఫ్రేమ్‌ని ఎలివేట్ చేసే సృజనాత్మకత, అద్భుతమైన దర్శకత్వం పృథ్వీరాజ్ సుకుమారన్ సొంతం. స్క్రీన్ ప్లేతో కథకు ప్రాణం పోసిన మురళీ గోపీకి ధన్యవాదాలు. మాపై నమ్మకం ఉంచి ఎంతోగానో సపోర్ట్ చేసిన సుభాస్కరన్, లైకా ప్రొడక్షన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక నటుడిగా నా ప్రయాణంలో ఎంపురాన్ ఒక గొప్ప అధ్యాయం. ఈ కథకు పనిచేసిన తారాగణం, సిబ్బంది లేకుండా ఇవేవీ సాధ్యం కాదు. మీ ప్రేమ, మద్దతు మాకు అడుగడుగునా స్ఫూర్తినిస్తాయి.' అని రాసుకొచ్చారు.
కాగా.. లూసిఫర్ సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్, మంజు వారియర్, టొవినో థామస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూట్ ప్రారంభించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
That’s a wrap for L2: Empuraan!
What an incredible 14-month journey across 8 states and 4 countries, including the UK, USA, and UAE.
This film owes its magic to the brilliant direction of Prithviraj Sukumaran whose creativity elevates every frame. A big thank you to Murali Gopy… pic.twitter.com/6bnuItDlxd— Mohanlal (@Mohanlal) December 1, 2024
Comments
Please login to add a commentAdd a comment