
కేరళలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో ఒక సీటు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కేరళ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడినప్పటికీ విజయం సాధించడంలో కేంద్ర పాలక పార్టీ విఫలమైంది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ బిజెపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఓ.రాజగోపాల్ తిరువనంతపురం జిల్లాలోని నెమోమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందారు. కేరళ రాష్ట్రంలో బిజెపీకి ఇక్కడ నుంచే తొలి స్థానం లభించింది.
నేడు ఆదివారం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నెమోమ్, పాలక్కాడ్, త్రిస్సూర్ అనే మూడు స్థానాల్లో బిజెపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ తన సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా నటుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటమి పాలయ్యారు. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. ఇదిలా ఉంటే కేరళలో ఎల్డీఫ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తోంది.
చదవండి: