E Sreedharan
-
కేరళలో బీజేపీకి భారీ షాక్.. మెట్రోమ్యాన్ ఓటమి
కేరళలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో కేరళలో ఒక సీటు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఖాతా కూడా తెరవదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కేరళ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడినప్పటికీ విజయం సాధించడంలో కేంద్ర పాలక పార్టీ విఫలమైంది. 2016 అసెంబ్లీ ఎన్నికలలో ప్రముఖ బిజెపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఓ.రాజగోపాల్ తిరువనంతపురం జిల్లాలోని నెమోమ్ అసెంబ్లీ నియోజకవర్గంలో గెలుపొందారు. కేరళ రాష్ట్రంలో బిజెపీకి ఇక్కడ నుంచే తొలి స్థానం లభించింది. నేడు ఆదివారం లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నెమోమ్, పాలక్కాడ్, త్రిస్సూర్ అనే మూడు స్థానాల్లో బిజెపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ తన సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ సహా నటుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధరన్ కూడా ఓటమి పాలయ్యారు. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. ఇదిలా ఉంటే కేరళలో ఎల్డీఫ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో అడుగులు వేస్తోంది. చదవండి: 44 ఏళ్ల చరిత్రను తిరగ రాసిన పినరయి విజయన్ -
కేరళ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్నికల్లో భాగంగా బీజేపీ 112 మంది అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. కేరళ లో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరణ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ మంజేశ్వర్, కోన్నీ ఇరు నియోజకవర్గాలనుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇ. శ్రీధరణ్ పాలక్కాడ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయనున్నారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా, అందులో 115 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. దీనిలో భాగంగా 112 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ జాబితాను బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.కేరళలో కేవలం అధికార పార్టీ ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న, ఈ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదకడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. గత వారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి సి చాకో పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్ థామస్ బిజెపిలో చేరారు. మాజీ రాష్ట్ర బిజెపి చీఫ్ కుమ్మనం రాజశేఖరఖ్ నెమోమ్ నుంచి, మాజీ కేంద్రమంత్రి కేజె ఆల్ఫోన్స్ కంజీరప్పల్లి నుంచి, సురేష్ గోపి త్రిస్సూర్ నుంచి, డాక్టర్ అబ్దుల్ సలామ్ తిరూర్ నుంచి, మాజీ డిజీపీ జాకబ్ థామస్ ఇరింజలకుడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఏప్రిల్ 6న మొత్తం 14 జిల్లాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగనుండగా మే2వ తేదీన ఫలితాలు రానున్నాయి. (చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?) -
అలా అయితే మెట్రో దివాళా..
సాక్షి, న్యూఢిల్లీ : మెట్రో రైలులో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తామన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని మెట్రో మేన్‌గా గుర్తింపు పొంది పదవీవిరమణ చేసిన ఢిల్లీ మెట్రో మాజీ చీఫ్ ఈ శ్రీధరన్ స్పష్టం చేశారు. మెట్రోలో మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేందుకు వెసులుబాటు కల్పిస్తే రవాణా వ్యవస్ధ కుప్పకూలి దివాలా తీస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రతిపాదనకు అంగీకరించవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో శ్రీధరన్ విజ్ఞప్తి చేశారు. మహిళలకు ఢిల్లీ మెట్రోలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇచ్చే ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపరాదని మోదీకి రాసిన లేఖలో ఆయన తేల్చిచెప్పారు. 2002లో ఢిల్లీ మెట్రో ప్రారంభించే సమయంలో ప్రతి ఒక్కరూ టికెట్ కొనుగోలు చేసి మెట్రో రైలులో ప్రయాణించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఇందుకు ఎవరికీ మినహాయింపు లేదని గుర్తుచేశారు. ఈ నిర్ణయాన్ని స్వాగతించిన అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి సైతం 2002 డిసెంబర్లో షహ్‌దర నుంచి కశ్మీరీ గేట్ వరకూ టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించారని చెప్పుకొచ్చారు. ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్‌గా ఏర్పడిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ)లో కేవలం ఓ భాగస్వామి ఢిల్లీ మెట్రోలో ఓ వర్గానికి ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సంస్థను దివాలా తీయించలేరని శ్రీధరన్ తేల్చిచెప్పారు. ఢిల్లీమెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ఇతర మెట్రోలూ ఇదే ఒరవడి అనుసరించే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఉచిత ప్రయాణంతో తలెత్తే ఆదాయ నష్టాన్ని తాము పూడ్చుతామన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదన పసలేని వాదనగా కొట్టిపారేశారు. -
ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో చేపట్టనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా 'మెట్రోమాన్' ఇ. శ్రీధరన్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదలకానుంది. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శ్రీధరన్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం. కాగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో ఉడా అధికారులు టెండర్లు ఆహ్వానించారు.