ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్ | E. Sreedharan Selected Chief Advisor to AP Metro Train Project | Sakshi
Sakshi News home page

ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్

Published Mon, Sep 1 2014 12:20 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్ - Sakshi

ఏపీ మెట్రో రైలు సలహాదారుగా శ్రీధరన్

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ లో చేపట్టనున్న విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా 'మెట్రోమాన్' ఇ. శ్రీధరన్ ను ఏపీ ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన జీవో త్వరలో విడుదలకానుంది. తిరుపతిలో కూడా మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని శ్రీధరన్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించినట్టు సమాచారం.

కాగా విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్) తయారీ బాధ్యతలను వీజీటీఎం ఉడాకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ క్రమంలో ఉడా అధికారులు టెండర్లు ఆహ్వానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement