తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఎన్నికల్లో భాగంగా బీజేపీ 112 మంది అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. కేరళ లో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా కేరళ సీఎం అభ్యర్థిగా మెట్రోమ్యాన్ ఇ. శ్రీధరణ్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్ర బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ మంజేశ్వర్, కోన్నీ ఇరు నియోజకవర్గాలనుంచి పోటీ చేయబోతున్నారు. మరోవైపు ఇ. శ్రీధరణ్ పాలక్కాడ్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేయనున్నారు.
కేరళలో మొత్తం 140 అసెంబ్లీ సీట్లు ఉండగా, అందులో 115 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. దీనిలో భాగంగా 112 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మిగతా 25 స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. ఈ జాబితాను బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.కేరళలో కేవలం అధికార పార్టీ ఎల్డీఎఫ్, కాంగ్రెస్ కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న, ఈ ఎన్నికల్లో బీజేపీ బలమైన శక్తిగా ఎదకడం కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. గత వారం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి సి చాకో పార్టీకి రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి విజయన్ థామస్ బిజెపిలో చేరారు.
మాజీ రాష్ట్ర బిజెపి చీఫ్ కుమ్మనం రాజశేఖరఖ్ నెమోమ్ నుంచి, మాజీ కేంద్రమంత్రి కేజె ఆల్ఫోన్స్ కంజీరప్పల్లి నుంచి, సురేష్ గోపి త్రిస్సూర్ నుంచి, డాక్టర్ అబ్దుల్ సలామ్ తిరూర్ నుంచి, మాజీ డిజీపీ జాకబ్ థామస్ ఇరింజలకుడ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. ఏప్రిల్ 6న మొత్తం 14 జిల్లాల్లో ఒకే దశలో పోలింగ్ జరుగనుండగా మే2వ తేదీన ఫలితాలు రానున్నాయి.
(చదవండి: మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?)
Comments
Please login to add a commentAdd a comment