తెల్ల మచ్చలు తగ్గేదెలా? | Limited white spots? | Sakshi
Sakshi News home page

తెల్ల మచ్చలు తగ్గేదెలా?

Published Wed, Jul 27 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

తెల్ల మచ్చలు తగ్గేదెలా?

తెల్ల మచ్చలు తగ్గేదెలా?

హోమియో కౌన్సెలింగ్
 
నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన  మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి.  - మహేశ్‌కుమార్, వరంగల్

బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల కలుగుతుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇది 2 నుంచి 3 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు.

చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం... టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల క్షీణించడం జరుగుతుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు.

దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి: బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు.  డిప్రైషన్, యాంగ్జైటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. కొన్నిసార్లు కాలిన గాయాలు, ప్రమాదాల వల్ల వచ్చే గాయాలు సరిగా మానకపోవచ్చు. దాంతో ఈ ప్రాంతంలో మచ్చపడి ఇలా తెల్లమచ్చలు రావచ్చు. పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు.  జన్యుపరమైన కారణాలు : వీటివల్ల వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు.   దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు ప్రస్ఫుటం అయ్యే వీలుంది.

మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
     కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది.
 
లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు.
 
రకాలు:  శరీరం అంతటా ఏర్పడే తెల్లమచ్చలు  కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో ఏర్పడే ప్యాచెస్  శరీరం అంతటా వ్యాపించే తెల్లమచ్చలు  జననాంగాలను ప్రభావితం చేసేవి  పెదవులు, వేళ్లు, బొటనవేళ్లను ప్రభావితం చేసే మచ్చలు.
 
చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.
 
డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి
విజయవాడ, వైజాగ్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement