ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్న వేళ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రష్యా సైనికుల ఆగడాలు పీక్ స్టేజ్ చేరుకున్నాయి. యుద్ధంలో చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల అవయవాలను రష్యా అమ్ముకుంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల కుటుంబాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
కాగా, ఫ్రీడమ్ టు డిఫెండర్స్ ఆఫ్ మారియుపోల్ గ్రూప్ అధిపతి లారీసా సలేవా తెలిపిన వివరాల ప్రకారం.. రష్యా సైన్యంలో చేతిలో బంధీలుగా ఉండి చనిపోయిన ఉక్రెయిన్ సైనికుల బాడీల్లో పలు అవయవాలు మిస్ అయినట్టు గుర్తించారు. అయితే, రష్యాకు సంబంధించిన జైళ్లలో ఉక్రెయిన్ సైనికులకు దారుణంగా హింసించి చంపేశారు. అనంతరం, వారి మృతదేహాలను ఉక్రెయిన్‌కు పంపించారు. అయితే, సైనికుల మృతదేహాలను కుటుంబ సభ్యులు పరిశీలించడంతో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
సైనికుల శరీరభాగాలు తేడాగా ఉండటంతో పరిశీలించగా.. వారి అవయవాలు దొంగిలించారని గుర్తించాం. రష్యా సైనికులు దారుణాలకు ఒడిగట్టారు. అవయవాలు దొంగతనం చేసిన బ్లాక్ మార్కెట్ వాటిని అమ్ముకున్నారు. ఉక్రెయిన్ ఖైదీలను చిత్ర హింసలకు గురి చేసి చంపి.. వారి అవయవాలతో వ్యాపారం చేస్తోంది. ప్రపంచం మొత్తం ఈ దారుణాల గురించి స్పందించాలి. వెంటనే ఈ దురగతాలను ఆపాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. రష్యా సైన్యం చేతిలో బంధీలుగా మారి విడుదలైన సైనికులు బలహీనంగా ఉన్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని ఓ సైనికుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆమె కోరారు. కాగా, ఈ ఆరోపణలను రష్యా తీవ్రంగా ఖండించింది. తమపై ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు పదివేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యా సైన్యం చేతిలో బంధీలుగా ఉన్నట్టు సమాచారం. కాగా, వారంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అని సైనికుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment