శస్త్ర చికిత్స కోసం వెళ్లిన ఓ బాలిక శరీరంలో ఏకంగా అవయవాలనే తొలగించేశారు వైద్యులు. దీంతో సదరు బాలిక డిశ్చార్జ్ అయ్యి వెళ్లిన రెండు రోజులకే చనిపోయింది. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలిక పేగు సంబంధిత వ్యాధితో జనవరి 21న అడ్మిట్ అయ్యింది. దీంతో ఆమెకు జనవరి 24న శస్త్ర చికిత్స చేశారు. చికిత్స చేసిన అనంతరం రెండు రోజుల తర్వాత అంటే జనవరి 26న ఆమె చనిపోయింది.
తొలుత బాలిక కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రిపై ఎలాంటి ఫిర్యాదు చేయకుండానే మృతదేహాన్ని ఇంటికి తీసుకుపోయారు. అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. ఆమె మృతదేహంపై చిల్లులు చిల్లులుగా ఉండి ఏవో సంచులుగా కనిపించాయి. అప్పుడే అనుమానం వచ్చింది మృతదేహం నుంచి అవయవాలు తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ సంచులు ఉంచినట్లు అనిపించి వెంటనే వారు ఆ కార్యక్రమాలను నిలిపేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మెడికల్‌కి సంబంధించిన కేసుగా నమోదు చేశారు. ఆ బాలికకు శస్త్ర చికిత్స చేసిన హిందూ రావు ఆస్పత్రిపై కూడా కేసు నమోదు చేశారు. ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురుతేగ్ బహుదూర్ ఆస్పత్రి వద్ద ఉంచారు. ఆ బాలికకు పోస్ట్‌మార్టం చేసేందుకు ప్రత్యేక మెడికల్ బోర్డును నియమించాలని పోలీసులు ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు డీసీపీ కల్సి ఈ కేసును పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
(చదవండి: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు)
Comments
Please login to add a commentAdd a comment