Vitiligo disease
-
శరీరంపై మచ్చలు పోవాలంటే ఇలా చేయండి..
శరీరంపై మచ్చలు ఏర్పడటం చాలా సాధారణమైన సమస్యే అయినా... చూడ్డానికి ఇవి చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. వీటినే శోభిమచ్చలు అంటుంటారు. కొద్దిమందిలో ఇవి తెల్లమచ్చల్లా, మరికొందరిలో కాస్తంత నల్లమచ్చలా కూడా కనిపిస్తుంటాయి. చాలామందిలో ఇవి ఎందుకు వస్తాయో ఇదమిత్థంగా తెలియకపోయినా... కొందరిలో ఫంగల్ ఇన్ఫెక్షన్గా ఇది కనిపిస్తుంది. వైద్యపరిభాషలో దీన్ని ‘టీనియా వెర్సికలర్’ అంటారు. ఇది పెద్ద వయసు వారిలోను, మధ్య వయస్సు వారిలోను ఎక్కువగా కనిపిస్తుంటుంది. స్త్రీ, పురుష భేధం లేకుండా వచ్చి ఇబ్బందిపెట్టే ఈ సమస్య ఎందుకొస్తుంది, అధిగమించడం ఎలాగో తెలుసుకుందాం. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం సహజరంగును కోల్పోతుంది. ముదురు ఎరుపువర్ణంలో, లేత గోధుమవర్ణంలో, తెలుపు వర్ణంలో ఈ మచ్చలు వస్తుంటాయి. వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఇలాంటి శోభి లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. కొన్నిసందర్భాల్లో ఈ మచ్చలకు చుట్టూ ఓ అంచులాంటిది ఏర్పడుతుంది. ఈ మచ్చలున్న చోట ఒక్కోసారి విపరీతమైన దురద ఉండవచ్చు. అయితే శోభిమచ్చలు అంటువ్యాధి కాదు. వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీరూ, తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. చదవండి: Health Tips: ప్రతి రోజూ గంజి తాగారో.. కారణాలు స్పష్టమైన కారణాలు తెలియకపోయినా... చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఈ ఫంగస్ చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. దాదాపు మనందరి చర్మంలోనూ ఈ ఫంగస్ ఉన్నప్పటికీ కొంతమందిని మాత్రమే ఇబ్బందులకు గురి చేస్తుంది. చదవండి: Health Tips: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. ఎవరిలో ఎక్కువ...! ►పౌష్టికాహార లోపం ఉన్నవారిలో ►వ్యాధినిరోధకతశక్తి బాగా తక్కువగా ఉన్నవారిలో ►స్టెరాయిడ్ మందులు తీసుకునేవారిలో ►గర్భవతులలో ►హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ►బాగా ఎక్కువగా చెమటలు పట్టడం, అధికవేడి కారణంగా; (ఇలాంటివారిలో ఈ మచ్చలున్నచోట దురదలూ రావచ్చు). ►జిడ్డు చర్మం ఉన్న వారిలో ►తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ►కొందరిలో ఇది వంశపారంపర్యంగా కూడా వస్తుంది. ►తామరగా/ఇతర సమస్యలుగా పొరబడటం సాధారణం... కొందరు శోభిని చూసి తామర (రింగ్వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు కెఓహెచ్ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనే విషయాన్ని నిర్ధారణ చేసి, తగిన చికిత్స సూచిస్తారు. నివారణ / జాగ్రత్తలు ►ఇది తేలిగ్గా నివారతమయ్యే సమస్య. ►చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచుకోవాలి. ►మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిన్నచిన్న చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ►చర్మం బాగా జిడ్డుగా ఉన్నప్పుడు... ఎప్పటికప్పుడు చర్మాన్ని శుభ్రం చేసుకుంటూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. అయితే మరీ పొడిగానూ ఉంచకూడదు. ►రీరం మీద నూనెగానీ, లేదా నూనెకు సంబంధించిన జిడ్డు పదార్థాలను కాని పూయకూడదు. ►బాగా బిగుతుగానూ, గాలిచొరకుండా ఉండే దుస్తులు ధరించకూడదు. ►ఇది మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉండటానికి ఎక్కువ చెమట పట్టకుండా చూసుకుంటూ,S కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడటం మంచిది. చికిత్స ఈ సమస్య ఉన్నవారిందరకీ ఒకేలాంటి చికిత్స ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్మవ్యాధి నిపుణులు చికిత్స సూచిస్తారు. వారి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తి తాలూకు మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. లూలిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకెనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటే, నోటితో తీసుకునే మందులను డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది. -
వైద్యంతో తెల్ల మచ్చలు మాయం
నెల్లూరు(అర్బన్): శరీరంపై తెల్లటి మచ్చలు కలిగి ఉన్న వారిని అక్కడక్కడా చూస్తుంటాం. ఇలాంటి వారు నలుగురిలో కలుపుగోలుగా ఉండేందుకు ఇబ్బంది పడతారు. మచ్చలు కలిగిన వారు ఆత్మన్యూనతకు గురై మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి మచ్చలను వైద్యభాషలో విటిలిగో (బొల్లి) అంటారు. తన నృత్య సంగీతంతో ప్రపంచ ఖ్యాతిని సంపాదించిన మైకేల్ జాక్సన్ తన శరీరంపై మచ్చలు కనిపించకుండా ఉండేందుకు ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నారు. ఆయన 2011, జూన్ 25న మృతి చెందారు. ఆయన మృతి చెందిన రోజును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ విటిలిగో నివారణ దినోత్సవంగా ప్రకటించింది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం, నివారించే దిశగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. దేశంలో సైతం ఈ వ్యాధిపై ప్రభుత్వం ప్రజలను అప్రమత్తం చేస్తూ నివారించేందుకు కృషి చేస్తోంది. 48 వేల మంది బాధితులు శరీరానికి మంచి ఆకృతి, అందాన్ని కల్పించేది చర్మమే. అలాంటి చర్మం బొల్లికి గురైతే ఆ వ్యక్తి నలుగురిలో తిరగలేక మానసికంగా కుంగిపోతుంటారు. లక్ష జనాభాలో 1500 మంది వరకు మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో సుమారు 32 లక్షల జనాభా ఉండగా, దాదాపు 48 వేల మంది వ్యాధికి గురయ్యారు. అయితే ఈ మచ్చలు కొందరికి చేతికి, గడ్డం లాంటి వాటికే పరిమితం కాగా, మరి కొందరికి శరీరమంతా ఉంటున్నాయి. నిత్యం జిల్లాలో సుమారు వెయ్యి మంది వరకు వివిధ చర్మ వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. మచ్చలకు అనేక కారణాలు ♦ అనువంశికత ద్వారా జన్యువుల్లో తేడాలు వచ్చి చర్మంలో ఉండే మెలనోసైట్స్ §ð దెబ్బతింటాయి. రంగు ఉత్పత్తి చేసే కణాలు నశిస్తాయి. ఫలితంగా తెల్ల మచ్చలు వస్తుంటాయి. ♦ నిత్యం మానసిక ఒత్తిడి, పేగుల్లో ఇన్ఫెక్షన్ రావడం, లివర్ విధుల్లో తేడాలు, టైట్‌గా ఉండే వస్త్రాలను రోజూ ధరించడమూ కారణమే. ♦ పొగతాగడం, కాలిన గాయాలు, ప్రమాదాలు జరిగినప్పుడు, అందం కోసం విపరీతంగా వాడే రసాయన మందులు కూడా వ్యాధికి కారణంగా నిలుస్తున్నాయి. ♦ జన్యు సంబంధిత పరిణామాలతో మెలనిన్ హార్మోన్లో తేడాతో శరీరంపై మచ్చలు రావడం, త్వరగా వెంట్రుకలు తెల్లబడిపోతాయి. ♦ థైరాయిడ్, షుగర్ వ్యాధి, అమీబియాసిస్ లాంటి వాటితో వాటు రోగనిరోధక శక్తి బలహీనపడటంతో మచ్చలు రావచ్చు. ప్రాథమిక దశలో వైద్యం అవసరం చర్మంపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడుతున్నప్పుడు ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యం పొందాలి. మచ్చలను నిర్లక్ష్యం చేయకూడదు. పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత మందులతో పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. తొలి దశలోనే చర్మ వైద్యులను సంప్రదించి మందులు వాడితే మచ్చలు మాయమవుతాయి. అందుబాటులో వైద్యం ఆధునిక సాంకేతికత వచ్చిన నేపథ్యంలో బొల్లిపై కంగారు పడాల్సిన అవసరం లేదు. వైద్యం అందుబాటులో ఉంది. మహానగరాలకే పరిమితమైన స్కిన్ గ్రాఫ్టింగ్, ఎక్సైమర్ లైట్ థెరపీ లాంటి ఆ«ధునిక చికిత్స నెల్లూరులోనూ అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కువ కాలం వైద్యం పొందితే వ్యాధి నయమవుతుంది. – హర్షవర్ధన్, స్కిన్ స్పెషలిస్ట్, నెల్లూరు -
తెల్ల మచ్చలు తగ్గేదెలా?
హోమియో కౌన్సెలింగ్ నా శరీరమంతా తెల్లమచ్చలు వచ్చాయి. నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఫలితంగా తీవ్రమైన మానసిక వేదన కలుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. నాకు హోమియోలో పరిష్కారం చెప్పండి. - మహేశ్‌కుమార్, వరంగల్ బొల్లి వ్యాధి చర్మంపై మెలనిన్ కణాలు తగ్గడం వల్ల కలుగుతుంది. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇది 2 నుంచి 3 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం... టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల క్షీణించడం జరుగుతుంది. ఫలితంగా మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ఈ టైరోసినేజ్ అనే ఎంజైమ్ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి: బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగ్జైటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. కొన్నిసార్లు కాలిన గాయాలు, ప్రమాదాల వల్ల వచ్చే గాయాలు సరిగా మానకపోవచ్చు. దాంతో ఈ ప్రాంతంలో మచ్చపడి ఇలా తెల్లమచ్చలు రావచ్చు. పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. జన్యుపరమైన కారణాలు : వీటివల్ల వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు ప్రస్ఫుటం అయ్యే వీలుంది. మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. రకాలు: శరీరం అంతటా ఏర్పడే తెల్లమచ్చలు కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాల్లో ఏర్పడే ప్యాచెస్ శరీరం అంతటా వ్యాపించే తెల్లమచ్చలు జననాంగాలను ప్రభావితం చేసేవి పెదవులు, వేళ్లు, బొటనవేళ్లను ప్రభావితం చేసే మచ్చలు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్