‘అచ్చు’ వ్యాధి!
మెడిక్షనరీ
చర్మంపై అరచేత్తో మెచ్చుకోలుగా చరిస్తే... ఐదు వేళ్లూ అచ్చులు తేలుతాయి. కొద్దిగా గీరినా చాలు... ఎర్రబారి వాతలు కనిపిస్తాయి. గోముగా అలా నిమిరినా చాలు... మేనుపై మార్కింగ్ వచ్చేస్తుంది. కొంతమందిలో కనిపించే ఈ చర్మ సమస్యను ‘డర్మటోగ్రాఫియా’ అనీ, డర్మటోగ్రాఫిజమ్ అని కూడా అంటారు. ఇలాంటి సమస్య ఉన్నవారి చర్మంపై ఏదైనా రాస్తే... పచ్చబొట్టు తరహాలో అది చాలాసేపు ఉండిపోతుంది. కాకపోతే పచ్చబొట్టు కాస్త ఆకుపచ్చ రంగులో ఉంటే అది చర్మం ఎర్రబారినప్పుడు ఉండే రంగుకు మారుతుంది.
ఈ సమస్య ఎందుకు వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే మైక్రోఒవెన్ దగ్గర చాలా సేపు ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువని పరిశోధకులు తెలుసుకున్నారు. అయితే దీనివల్ల ప్రాణాపాయం ఉండదు. ఇదేమీ అంటువ్యాధి కాదు. యాంగ్జైటీ, తీవ్రమైన ఒత్తిడి, చర్మంపై బిగుతుగా దుస్తులు ధరించడం వంటివి దీన్ని మరింత పెంచుతాయని కూడా తేలింది. ఈ సమస్యకు యాంటీహిస్టమైన్స్‌తో చికిత్స చేస్తారు.