బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టుకొని, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. దూది ఉండను ఈ నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలకూ తొలగిస్తాయి. దురద, దద్దుర్లు లాంటివాటినీ, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె టీ స్పూన్ చొప్పున తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ముఖాన్ని చల్లని నీటితో శుభ్రపరుచుకొని, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత పాల మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని, ముఖానికి రాసుకుంటూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత ఆరేంత వరకు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మకాంతి పెరుగుతుంది.