బ్యూటిప్స్
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే చిటికెడు వెన్నలో అయిదారు చుక్కల తేనె కలిపి, రాత్రి పడుకోబోయే ముందు రాసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే పెదవులు మృదువుగా ఉంటాయి.వేడినీళ్లలో వేపాకులు వేసి స్నానం చేస్తే దురద తగ్గుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
టీ స్పూన్ కీరదోసకాయ రసంలో చిటికెడుచందనం కలిపి ముఖానికి పట్టించి, 20 నిమిషాల తరువాత కడిగితే చర్మం నునుపు తేలుతుంది.టీ స్పూన్ తేనెలో కోడిగుడ్డులోని తెల్ల సొన కలిపి, ముఖానికి, మెడకి పట్టించి 20 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగితే... జిడ్డు తగ్గి చర్మం అందంగా ఉంటుంది.