బార్లీ బ్యూటీ | Barley Beauty | Sakshi
Sakshi News home page

బార్లీ బ్యూటీ

Published Wed, Mar 9 2016 10:37 PM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM

బార్లీ బ్యూటీ

బార్లీ బ్యూటీ

బ్యూటిప్స్

క్లెన్సర్: బార్లీ పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసుకొని, 15 నిమిషాలు వదిలేసి తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది స్వేదరంధ్రాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు.
 
ప్యాక్: బార్లీ గింజలను పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. చర్మం కాంతిమంతం కూడా అవుతుంది.

వాటర్ థెరపీ: బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది.
 
తేనెతో: టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి ఇది జీవకళ తీసుకువస్తుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement