మెరుగైన చర్మకాంతికి...
బ్యూటిప్స్
వర్షాకాలంలో కొందరికి చర్మం పొడిగా అయిపోవడం, డల్‌గా అవ్వడం, నల్లబడటం, బిరుసుగా అయిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటి నుంచి బయట పడటానికే ఈ చిట్కాలు... ఓ బౌల్‌లో రెండు చెంచాల ముల్తానీ మట్టి, 1 చెంచా గంధపు పొడి, 2 చెంచాల లవంగ నూనె, కాసింత నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని నలుగు పిండి మాదిరిగా కాళ్లు, చేతులు, మెడకు రాసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి.
వానాకాలం అయ్యేవరకూ వారంలో నాలుగైదు సార్లు ఇలా చేస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తులసి ఆకుల రసం కలిపి స్నానం చేస్తే... చర్మం మృదువుగా ఉండటంతో పాటు వానాకాలం వచ్చే చర్మవ్యాధులు కూడా దరిచేరవు. సువాసన కావాలనుకునేవారు కాస్త రోజ్‌వాటర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. దీనిలో కొంచెం బియ్యప్పిండి, నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనితో ఒళ్లు తోముకుని, ఆపైన వేణ్నీళ్లతో స్నానం చేస్తే చర్మం కాంతులీనుతుంది.