ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలి
Published Tue, Aug 23 2016 12:26 AM | Last Updated on Tue, Sep 18 2018 6:38 PM
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : అన్ని మున్సిపాలిటీలను ప్లాస్టిక్, ఫ్లెక్సీ రహిత పట్టణాలుగా తీర్చిదిద్దాలని సీడీఎంఏ దాన కిశోర్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ చెత్త సేకరణను వందశాతం అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం ప్రకారం హరితహారం కార్యక్రమంలో విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. ప్రతీ మున్సిపాలిటీలో రెండుకు తగ్గకుండా మహిళా మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ హాజరును తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి మహబూబ్‌నగర్, ఐజ మున్సిపల్ కమిషనర్లు భూక్యాదేవ్‌సింగ్, వెంకన్న, ఇంజనీరింగ్ విభాగం అధికారులు హాజరయ్యారు.
Advertisement
Advertisement