బ్లూజే ఏరో లాజిస్టిక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆవిష్కరణ | Inauguration of Bluej Aero Logistics Aircraft | Sakshi
Sakshi News home page

బ్లూజే ఏరో లాజిస్టిక్స్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆవిష్కరణ

Oct 26 2024 4:37 AM | Updated on Oct 26 2024 8:11 AM

Inauguration of Bluej Aero Logistics Aircraft

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: క్లీన్‌ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్‌ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్‌ (వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌ ’రీచ్‌’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్‌–ఎలక్ట్రిక్‌ వీటీవోఎల్‌ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్‌ కుమార్‌ తెలిపారు. 100 కేజీల పేలోడ్‌ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్‌ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. 

అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్‌పోర్ట్‌ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్‌–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్‌ కుమార్‌ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్‌ క్యాపిటల్, ఎండియా పార్ట్‌నర్స్‌ తదితర సంస్థలు ఇన్వెస్ట్‌ చేశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement