Blue Air company
-
బ్లూజే ఏరో లాజిస్టిక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్లీన్ టెక్నాలజీ సంస్థ బ్లూజే ఏరో తాజాగా లాజిస్టిక్స్ కోసం ఉపయోగించే మానవరహిత వీటీవోఎల్ (వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్ ’రీచ్’ను లైవ్‌లో ప్రదర్శించింది. ఇది దేశీయంగా రూపొందించిన తొలి హైడ్రోజన్–ఎలక్ట్రిక్ వీటీవోఎల్ అని సంస్థ సహ వ్యవస్థాపకుడు ఉత్తమ్ కుమార్ తెలిపారు. 100 కేజీల పేలోడ్ సామర్ధ్యంతో ఒక్కసారి చార్జ్ చేస్తే 300 కి.మీ. ప్రయాణించగలదని వివరించారు. అంతగా కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో కూడా సత్వరంగా డెలివరీ చేసేందుకు ఇది ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ టెక్నాలజీతో సంప్రదాయ ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాల అవసరం లేకుండా హైదరాబాద్–వరంగల్, ముంబై–పుణె వంటి కీలక రూట్లలో 30 నిమిషాల్లోపే వాయుమార్గంలో రవాణా సాధ్యపడుతుందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 18 కోట్లు సమీకరించామని, మరో రూ. 250 కోట్లు సమీకరించే యత్నాల్లో ఉన్నామని ఉత్తమ్ కుమార్ వివరించారు. జిరోధాకు చెందిన రెయిన్‌మ్యాటర్ క్యాపిటల్, ఎండియా పార్ట్నర్స్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేశాయి. -
బ్లూ ఎయిర్ సేల్స్ డైరెక్టర్ గా గిరీశ్ బాపట్
హైదరాబాద్: ఇండోర్ ఎయిర్ ప్యూరిఫికేషన్ టెక్నాలజీలు, ఉత్పత్తులు అందించే బ్లూ ఎయిర్ కంపెనీ వెస్ట్-సౌత్ ఏషియన్ రీజియన్ సేల్స్ డెరైక్టర్‌గా గిరీశ్ బాపట్ నియమితులయ్యారని బ్లూ ఎయిర్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బాపట్ గతంలో దేవూ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ, గోద్రేజ్, జీఈ వన్ ఇండియా, తదితర సంస్థల్లో పనిచేశారని, అపారమైన అనుభవం ఆయన సొంతమని బ్లూ ఎయిర్ సీఈఓ నికొలస్ వాకెస్ పేర్కొన్నారు. భారత్‌లో బ్లూ ఎయిర్‌కు అపారమైన అవకాశాలున్నాయని, కంపెనీ మార్కెట్‌ను మరింతగా వృద్ధి చేస్తానని, రిటైల్ అవుట్లెట్లను విస్తరిస్తామని బాపట్ వెల్లడించారు.