
దులపరా... డింగరీ...
మగవాళ్లు ఇంటిపని ఎందుకు చెయ్యరు? పోనీ, ఎందుకు చెయ్యలేదు? వాళ్లు చెప్పే మొదటి కారణం జాబ్. బయటికెళ్లి జాబ్ చేసి వచ్చి మళ్లీ ఇంట్లో పని చెయ్యడం కష్టం కదా అంటారు. ‘‘ఏం? ఆడవాళ్లు జాబ్ చేస్తూ కూడా ఇంటిని చక్కబెట్టుకోవడం లేదా?’’ అంటే నిజమే కానీ ఇంటి పనులు చెయ్యడం తమకు చేతకాదని రెండో కారణంగా చెబుతారు. ఎందుకు చేతకాదూ అంటే, ‘‘అలవాటు లేక’’ అనేది అందరికీ సమాధానం.
రోజంతా ఇంట్లో కష్టపడుతున్న గృహిణికి చేయూత అందించడం కోసం మగవాళ్లు ఇంటి పనులు అలవాటు చేసుకుంటే తప్పేముంది? కనీసం చిన్న చిన్న పనులైనా మగవాళ్లు చేస్తుంటే ఇంట్లో ఆడవాళ్లకు ఎంతో సమయం మిగులుతుంది. పెద్ద సహాయం ఏదో చేసినట్లుగానూ ఉంటుంది. సో, ఇవాళ్టి నుంచే దుమ్మును అన్వేషించి, దులిపే ప్రయత్నం చెయ్యండి.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. అలాగే ఇంట్లోని కొన్ని ప్రదేశాల్లో పేరుకుపోయే దుమ్మును ఇరవై నాలుగు చేతులున్న గృహిణి కూడా కనిపెట్టలేదు. అదేదో మీరు కనిపెట్టి క్లీన్ చెయ్యండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మీరో దుమ్ము స్పెషలిస్ట్ అవండి.
దుమ్ము, జిడ్డు పేరుకుపోయే రహస్య ప్రదేశాలు కిచెన్‌లోని అరల మూలలు, పై అంచులు. స్విచ్‌లు, స్విచ్‌బోర్డులు గీజర్ కాయిల్ పైభాగం.
పెయింటింగుల వెనుకభాగం. మంచాలు, సోఫాల కింది భాగం. ఐదు పనులే కదా చేసేయ్ బాస్.