![Teachers Made To Clean In Sattupalli Govt School - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/5/Sattupalli-Teachers.jpg.webp?itok=foCuf1jv)
సత్తుపల్లి టౌన్:పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో సత్తుపల్లి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. గురువారం ఉదయం వచ్చిన ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు అది చూసి మాకెందుకులే అనుకోలేదు.. చీపుర్లు పట్టి పాఠశాల ప్రాంగణాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. దీనిపై పీఆర్టీయూ రాష్ట్ర నేత చిత్తలూరి ప్రసాద్ మాట్లాడుతూ.. చాలా పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులు లేకపోవటంతో పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయన్నారు. దీంతో ఉపాధ్యాయులే చీపుర్లు పట్టి శుభ్రం చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment