రహమత్‌నగర్: ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య విభాగంలో కామాటీగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం కామాటీ పని పక్కన పెట్టి రహదారులపై చెత్త వేయకుండా ఇలా కాపలా కాస్తున్నాడు. వాహనాలపై వచ్చి రోడ్లమీద, ఫుట్‌పాత్‌లపై చెత్త పడవేయకుండా అడ్డుకుంటున్నాడు. ప్రజల నిర్లక్ష్యం మూలంగా సిబ్బంది ఇలా రోజు కాపలా ఉండాల్సి వస్తోంది.
సర్కిల్–19లోని రహమత్‌నగర్ డివిజన్ హెచ్‌ఎఫ్‌నగర్, కార్మికనగర్, శ్రీరాంనగర్ డంపింగ్ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది చాలా మంది ఇలాగే కాపలా కాయాల్సి వస్తోంది. ప్రజలు ఇప్పటికైనా మేల్కొని..సామాజిక బాధ్యతతో వ్యవహరించి రోడ్లపై చెత్త వేయకుండా ఉండాలని, లేకుంటే మాకు రోజూ ఇలా కాపలా కాసే డ్యూటీ తప్పదని దుర్గయ్య వాపోయారు. రోగాలు వ్యాపిస్తున్న ఈ తరుణంలో అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
( చదవండి: అతి తెలివి అంటే ఇదే.. ఇళ్లంతా ఐరన్‌తోనే నిర్మాణం )
Comments
Please login to add a commentAdd a comment