వంటిల్లు అంటే నూనె జిడ్డు, మాడు వాసన కాదు. వంటిల్లు అంటే.. సమతూకంలో ఉడికే దినుసుల కమ్మదనం, ఆరోగ్యాన్ని వడ్డించే నైపుణ్యం! మనసుండాలే కానీ కిచెన్‌కూ కళాత్మకతతో పోపు పెట్టొచ్చు ఇలా..
ఇండిపెండెంట్ ఇంట్లో సరే.. అపార్ట్‌మెంట్లలోనూ కిచెన్‌కి బాల్కనీ ఉంటుంది చిన్నదో పెద్దదో! ఇందులో తులసి సరే.. కొత్తిమీర, మెంతి, పుదీనా, పాలకూర, బచ్చలి వంటివి వేసి.. దీన్ని హెర్బల్ గార్డెన్‌గా మలచుకోవచ్చు. తాజా ఆకు కూరలతో ఆరోగ్యమే కాదు.. పచ్చదనంతో మనసూ మురుస్తుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్‌తో వంటిల్లూ మెరుస్తుంది. కాస్తోకూస్తో ఖర్చూ కలిసొస్తుంది.
అందమైన పాత్రలు
ఇప్పుడు మళ్లీ రాగి, ఇత్తడి పాత్రలకు డిమాండ్ పెరుగుతోంది. యాంటిక్ డిజైన్‌లో దొరికే ఆ పాత్రలతో అరలను సర్దితే.. రాజసం ఉట్టిపడుతుంది వంటిల్లు. పింగాణీ పాత్రలతో దీనికి టచప్ ఇవ్వొచ్చు.
ఫుడ్ థీమ్ ఆర్ట్
కిచెన్ వాల్స్‌ని షెల్‌వ్స్‌తో నింపేయకుండా.. ఒక్క చోటనైనా ఖాళీగా ఉంచాలి. దాన్ని నచ్చిన వంటకాలు లేదా నట్స్.. లేదా ఫ్రూట్స్.. వెజిటబుల్స్ పెయింటింగ్స్‌తో అలంకరించాలి.
కుక్ బుక్స్
వంటింట్లో వంట సామాగ్రికే కాదు వంటకు సంబంధించిన పుస్తకాలకూ స్పేస్ ఇవ్వొచ్చు. స్థానిక సంప్రదాయ వంటల పుస్తకాల నుంచి వరల్డ్ ఫేమస్ షెఫ్‌లు రాసిన కుక్ బుక్స్ దాకా అన్నిటినీ ర్యాక్స్‌లో పేర్చుకుంటే.. కిచెన్‌కి ఇంటలెక్చువల్ లుక్ వస్తుంది. వెరైటీ వంటకాల పట్ల మనకు ఇంట్రెస్టూ పెరుగుతుంది. తెలుసు కదా.. కుకింగ్ అనేది ఆర్టే కాదు.. స్ట్రెస్ బస్టర్ కూడా! వంటలకు రుచెంతో.. అలంకరణకు అభిరుచీ అంతే! సో.. టేస్ట్‌కి తగ్గట్టు సర్దుకోండిక!.
(చదవండి: 'లంగ్స్ ఆఫ్ చత్తీస్‌గఢ్'ని కాపాడిన యోధుడు!ఏకంగా గోల్డ్‌మ్యాన్..)
Comments
Please login to add a commentAdd a comment