పరిసరాల పరిశుభ్రత పాటించాలి
కట్టంగూర్
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి పైలం సంతోష్ అన్నారు. బుధవారం మండలకేంద్రంలో ఆరోగ్యశాఖ, పౌరసంబంధాల శాఖల ఆధ్వర్యంలో సారథి కళాకారులు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కల్గిఉండి అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో కళాకారులు వెంకట్, సంధ్యారాణి, తాటిపాముల శంకర్, వెంకట్ తదితరులున్నారు.