పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయండి
Published Sat, Sep 17 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM
రాజమహేంద్రవరం సిటీ :
పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేయాలని సికింద్రాబాద్ చీఫ్ ఇంజనీర్ (నిర్మాణం)బ్రహ్మానందరెడ్డి పిలుపు నిచ్చారు. స్వచ్చత సప్తాహ్ కార్యక్రమాన్ని రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో శనివారం ప్రారంభించారు. మొదటి రోజు స్టేషన్ ఆవరణ, రైల్వే ఉద్యోగుల కాలనీల్లో మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఉన్న వాటిని ట్రిమ్మింగ్ చేసే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛత సప్తాహ్‌లో స్వచ్ఛ స్టేషన్, స్వచ్ఛ రైలు, స్వచ్ఛ నీరు, స్వచ్ఛ పరిశర్, స్వచ్ఛ సహయోగ్, స్వచ్ఛ సంవాద్ కార్యాక్రమాలను రోజుకు ఒకటి చొప్పున నిర్వహిస్తామని స్టేషన్ మేనేజర్ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి తెలిపారు. స్టేషన్ చీఫ్ టికెట్ ఇన్‌స్పెక్టర్ కేశవభట్ల శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ జాన్ విజయ్, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.
Advertisement