పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్య సమాజం
Published Sun, Sep 18 2016 10:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:01 PM
– దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం : రైల్వేస్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యవంతమైన రైలు ప్రయాణం ప్రయాణికులు చేయవచ్చని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. భారతీయ రైల్వేలో చేపట్టిన స్వచ్ఛ్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక రైల్వేస్టేషన్‌లో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రయాణికులు ఆహ్లాదకర వాతావరణంలో ప్రయాణించాలంటే పరిశుభ్ర వాతావరణం అవసరమన్నారు. 2019 అక్టోబర్ నాటికి భారతదేశం స్వచ్ఛ భారత్‌గా ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, దానిలో భాగంగా నియోజకవర్గంలో వారానికి ఒక రోజు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. రైల్వేస్టేషన్‌లో బూజులు దులిపి పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆయన వెంట పార్టీ నాయకులు కర్రి ప్రభాకర బాలాజీ. యెగ్గిన నాగబాబు, సీఎ ఎంఆర్‌ఎల్‌ఎస్.మూర్తి, కంచుమర్తి నాగేశ్వరరావు, కర్రి సీతారామయ్య పాల్గొన్నారు.
వసతుల కోసం రైల్వే అధికారికి వినతి
తాడేపల్లిగూడెం రైల్వేస్టేషన్‌లో వసతులు, రైల్వే హాల్టులు, ఇతరాల కోసం మంత్రి మాణిక్యాలరావు రైల్వే డెప్యూటీ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ బి.వెంకట్రావుకు వినతిపత్రం అందచేశారు. గూడ్సు షెడ్‌ను నవాబుపాలెంకు మార్చాలని కోరారు. ఇక్కడ గూడ్సు షెడ్ ప్రాంతంలో రెండో రిజర్వేషన్ టికెట్ కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు రోడ్డు వరకు రైల్వేపుట్ బ్రిడ్జిని విస్తరించాలని కోరారు.
Advertisement
Advertisement