పళ్లు శుభ్రం చేసే చేసే పద్ధతితో డేంజర్‌! | In the process of cleaning the fruit   Flushing one | Sakshi
Sakshi News home page

పళ్లు శుభ్రం చేసే చేసే పద్ధతితో డేంజర్‌!

Published Thu, Jan 17 2019 11:46 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

In the process of cleaning the fruit   Flushing one - Sakshi

మనకు పెద్దగా అలవాటు లేదుగానీ.. ఇతర దేశాల్లో పళ్లను శుభ్రం చేసుకునే పద్ధతిలో ఫ్లాసింగ్‌ ఒకటి. బ్రష్‌ చేసిన తరువాత పళ్ల మధ్య చిక్కుకున్న ఆహారాన్ని ఒక దారం సాయంతో తొలగించుకోవడాన్ని ఫ్లాసింగ్‌ అంటారు. బాగుందిగానీ.. ఈ ఫ్లాసింగ్‌ కోసం వాడుతున్న ప్రత్యేకమైన దారం కారణంగా పళ్ల మధ్య పాలిఫ్లూరోర అల్కైల్‌ (పీఎఫ్‌ఏ) రసాయన పదార్థాలు పోగుపడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. కాలిఫోర్నియా పబ్లిక్‌ హెల్త్‌ ఇన్‌స్టిట్యూట్‌ కొంతమంది కార్యకర్తల రక్తనమూనాలను పరీక్షించడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. ఫర్నిచర్‌ మొదలుకొని అనేక ఇతర వస్తువుల్లో నీటిని దూరంగా ఉంచేందుకు ఈ పీఎప్‌ఏలను వాడుతున్నారు.

పైగా అంత తేలికగా నాశనమయ్యే రసాయనమూ కాదిది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 18 కంపెనీలు ఈ పీఎఫ్‌ఏను ఫ్లాసింగ్‌ దారాల పై పూతగా వాడుతున్నట్లు తెలిసింది. పళ్లమధ్య ఈ దారాన్ని ఉంచి కదిలించినప్పుడు పూతలోని రసాయనాలు అక్కడే పోగుపడుతున్నాయని.. తరువాత కండరాల్లోకి కూడా చేరిపోతున్నాయని తాము గుర్తించినట్లు కేటీ బోరోనౌ అనే శాస్త్రవేత్త తెలిపారు. పీఎఫ్‌ఏలతో కేన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నది తెలిసిందే.  అనేక ఇతర పదార్థాల నుంచి కూడా ఈ పీఎఫ్‌ఏ శరీరంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement