విశాఖపట్నం సిటీ : మావోయిస్టుల బంద్ పిలుపు మేరకు తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. కొత్తవలస-కిరండూల్ మార్గంలో విశాఖ నుంచి బయల్దేరే పలు రైళ్లను కుదిం చినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో రాత్రి వేళ నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ-కిరర డూల్(58501) పాసింజర్ 19, 20 తేదీల్లో రాత్రి వేళ జగదల్‌పూర్ స్టేషన్‌లో ఆగిపోతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో 20, 21 తేదీ ల్లో జగదల్‌పూర్ నుంచి విశాఖ మధ్య మాత్రమే కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ నడుస్తుందని ప్రకటిం చారు. గూడ్సు రైళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నారు.
కిరండూల్ మార్గంలో రైళ్లు రద్దు
Published Tue, Feb 17 2015 12:06 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement