Maoist bandh
-
మావోయిస్టుల బంద్‌తో అప్రమత్తం
సాక్షి, మంచిర్యాల: బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అనుమానిత ప్రాంతాల్లో విçస్తృతంగా తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో రాకపోకలు సాగించే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని రోజులుగా దళ సభ్యులు సంచరిస్తున్నట్లు అనుమానిస్తున్న అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరంలో డ్రోన్ కెమెరాలతో నిఘా వేశారు. మరోవైపు ఎన్కౌంటర్లను ఖండిస్తూ.. ప్రతీకార చర్యలు తప్పవని కుమురంభీం మంచిర్యాల జిల్లా కమిటీ కార్యదర్శి భాస్కర్ పేరుతో ప్రకటన విడుదల కావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ నెల 19న కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు పలుమార్లు దళ సభ్యులు పోలీసులకు ఎదురుపడ్డారు. ఆ సమయంలో మావోయిస్టులు వదిలిపెట్టిపోయిన సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గల ఇర్నార్–పెదపాల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు తారసపడిన మావోలు కాల్పులు జరపగా.. సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగాయి. దీంతో ఒక మావోయిస్టు మృతి చెందాడు. -
మావోయిస్టుల బంద్ ప్రశాంతం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దేవళ్లగూడెంలో ఈనెల 3న జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ఆదివారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టుల కదలికల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అలజడి వాతావరణం నెలకొంది. బంద్ సందర్భంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో పోలీసులు, ఆయా జిల్లాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని నెలలుగా తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న మావోయిస్టులు ఏజెన్సీ జిల్లాలకు ఛత్తీస్‌గఢ్ నుంచి యాక్షన్ టీమ్‌లను పంపించినట్టు తెలుస్తోంది. అలాగే జూలైలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు మరో 12 కమిటీలను మావోయిస్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఏజెన్సీ జిల్లాల్లో ఎప్పుడేం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది. గత రెండు నెలల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కరకగూడెం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోనూ ఎదురు కాల్పులు జరిగాయి. దేవళ్లగూడెం ఎన్కౌంటర్లో తమ యాక్షన్ కమిటీ సభ్యుడు, ముఖ్యనేత హరిభూషణ్ గన్‌మన్ దూది దేవాల్ అలియాస్ శంకర్ మృతితో మావోయిస్టులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. దేవళ్లగూడెం ఎన్కౌంటర్ బూటకం అంటూ మావోయిస్టు పార్టీ ఇల్లెందు–నర్సంపేట ఏరియా కమిటీ కార్యదర్శి శాంత, భద్రాద్రి కొత్తగూడెం–తూర్పుగోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ తదితరుల పేర్లతో బంద్‌పై ప్రకటనలు విడుదల చేశారు. దీంతో గోదావరి పరీవాహక జిల్లాల్లో పోలీసు యంత్రాంగం అడుగడుగునా తనిఖీలు చేసింది. చివరకు బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా ఈ జిల్లాల్లో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. కాగా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా మోటాపోల్, పునాసార్ అనే రెండు గ్రామాలకు చెందిన ఆదివాసీలను అపహరించిన మావోయిస్టులు తమ అధీనంలో ఉన్న 16 మందిని వదిలిపెట్టారు. మొత్తం 26 మందిని అపహరించగా, అందులో శనివారం ఆరుగురిని విడిచిపెట్టి నలుగురిని హతమార్చిన విషయం విదితమే. -
మావోల బంద్ ప్రశాంతం
చర్ల: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టుల బంద్ గురువారం ప్రశాంతంగా జరిగింది. ‘ఆపరేషన్ సమాధాన్’ను వ్యతిరేకిస్తూ, నిరసన వారానికి, 31న బంద్‌కు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. భద్రాచలం ఏజెన్సీలోని ఇటు వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాలతోపాటు అటు ఆంధ్రప్రదేశ్‌లోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు, ఎటపాక మండలాల్లోనూ బంద్ సాగింది. మావోయిస్టుల హెచ్చరికలు, విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో రెండు రోజుల నుంచే ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ నిలిపివేసింది. బ్యాంకులు, పెట్రోల్ బంక్‌లు, సినిమా హాళ్లు తెరుచుకోలేదు. దుకాణాలు మూతపడ్డాయి. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలు, కార్యాలయాలు పనిచేశాయి. ఏజెన్సీ గ్రామాలకు ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు తిరగలేదు. ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నిరసన వారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెలలోని అటవీ ప్రాంతంలోగల ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సును, లారీని మావోయిస్టులు దహనం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం మండలం సూరవీడు సమీపంలో జేసీబీని దహనం చేశారు. అక్కడ వాల్ పోస్టర్లు పడేశారు, బ్యానర్లు కట్టారు. చర్ల మండలంలోని కొన్ని గ్రామాలతోపాటు భద్రాచలం పట్టణ నడిబొడ్డునగల ఆర్టీసీ బస్టాండ్‌లో కూడా పోస్టర్ అతికించారు. మావోయిస్టు పార్టీ పిలుపుతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పెద్దఎత్తున ప్రత్యేక భద్రతాచర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, సుకుబా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని తూర్పుగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, కోరాఫూట్, మల్కన్‌గిరి. రాయ్‌గడ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలు, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని మంచిర్యాల, కొమరం బీం ఆసీఫాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాలలో ప్రత్యేక పోలీసు బలగాలు వారం రోజుల ముందు నుంచే భారీగా మొహరించాయి. ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. అణువణువునా గాలించాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రజానీకం భీతిల్లింది. మావోయిస్టుల బంద్ ప్రశాంతంగా ముగియడంతో పోలీసు యంత్రాంగంతోపాటు ఏజెన్సీ ప్రజానీకం హాయిగా ఊపిరి పీల్చుకుంది. -
ఏజెన్సీలో దడ దడ..
సాక్షి, కొత్తగూడెం: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా నేడు భారత్ బంద్‌కు మావోయిస్టులు పిలుపునివ్వడంతో సరిహద్దు ఏజెన్సీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25వ తేదీ నుంచి మావోయిస్టులు సరిహద్దు ఏజెన్సీతోపాటు జిల్లాలోని వివిధ మండలాల్లో బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సరిహద్దుల్లో, ఏవోబీలో మావోయిస్టులు పలుచోట్ల సభలు, ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం సరివెల గ్రామం సమీపంలో వికారాబాద్ జిల్లా తాండూరు డిపోకు చెందిన టీఎస్ ఆర్టీసీ బస్సును మంగళవారం రాత్రి మావోయిస్టులు తగులబెట్టారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం నుంచి భద్రాచలం ఏజెన్సీ పరిధిలో బస్సు సర్వీసులన్నింటినీ ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని ఏజెన్సీ వాసులు అనేక అవస్థలు పడుతున్నారు. ఇదే అవకాశంగా ప్రైవేటు వాహనాల చోదకులు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బంద్ నేపథ్యంలో ఏజెన్సీలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటైంది. చర్ల బస్టాండ్ వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు అట్ట పెట్టె వదిలి వెళ్లారు. అందులో బాంబు ఉందేమోనన్న అనుమానాలతో కలకలం బయల్దేరింది. అది ఖాళీ పెట్టె మాత్రమేనని పోలీసులు తేల్చడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. గత మే నెలలో ఇదే చర్ల బస్టాండ్‌లో ఓ బ్యాగులో ప్రెషర్ బాంబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. దానిని పోలీసులు స్వాధీనపర్చుకుని, సమీపంలోని చెరువు వద్ద నిర్వీర్యం చేశారు. అందుకే, ఇప్పుడు ఆ అట్ట పెట్టె కనిపించగానే అందరూ కలవరపడ్డారు. అదనపు బలగాల కూంబింగ్... మావోయిస్టుల బంద్ నేపథ్యంలో అదనపు బలగాలు సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టాయి. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతికరేకంగా మావోయిస్టులు పోరును ఉధృతం చేసే అవకాశం ఉండడంతో పోలీసు యంత్రాంగం మరింత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మావోయిస్టులు భద్రాచలం ఏజెన్సీ దాటి వచ్చి గోదావరికి ఇవతల వైపు ఉన్న మండలాల్లోనూ బంద్‌పై బ్యానర్లు, పోస్టర్లు వేశారు. మంగళవారం గుండాల, శంభునిగూడెం, నర్సాపురం తండ, లింగగూడెం, రోళ్లగడ్డ, సాయనపల్లి గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు పడ్డాయి. మణుగూరు మండలంలో మావోయిస్టులు సోమవారం రాత్రి సంచరించారన్న వార్తలతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీతారామ ప్రాజెక్టు, మిషన్ భగీరథ తదితర పనులు సాగుతున్నాయి. అక్కడ పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏఎస్పీ(ఆపరేషన్స్) పర్యటించి, పోలీసులకు సూచనలు చేశారు. మణుగూరు మండలంలోని ఇసుక రీచ్‌ల వద్దకు మావోయిస్టుల వచ్చే అవకాశముందని ఇంటెలిజెన్స్ సమాచారమిచ్చింది. దీంతో, ఆ ఇసుక రీచ్‌ల వద్దనున్న వాహనాలను పోలీసులు బయటకు పంపించారు. ఈ నెల 25న భద్రాచలం బస్టాండులో కరపత్రాలు, అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు–నెల్లిపాక బంజర గ్రామాల మధ్యలో బ్యానర్లు, చర్ల మండలంలోని ఆర్.కొత్తగూడెం–కుదునూరు మధ్య ప్రధాన రహదారిపై మావోయిస్టులు పోస్టర్లు వేశారు. ఇటీవలి కాలంలో గోదావరి దాటి మావోయిస్టులు ఇవతలకు రాకుండా పోలీసు యంత్రాంగం అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో గుండాల, అశ్వాపురం మండలాలతోపాటు కీలకమైన భద్రాచలం పట్టణంలోని జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే బస్టాండులోనూ మావోయిస్టులు బ్యానర్లు, పోస్టర్లు వేయడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వివిధ గిరిజన సంఘాలు కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వేశాయి. ఏజెన్సీకి బస్సులు ‘బంద్’ చర్ల: ‘ఆపరేషన్ సమాధాన్’కు వ్యతిరేకంగా మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునివ్వడంతో ఏజెన్సీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపివేశారు. మావోయిస్టు పార్టీని అంతమొందించాలన్న లక్ష్యంతో ‘ఆపరేషన్ సమాధాన్’ను కేంద్రం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. దీనిని మావోయిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగా, జనవరి 25 నుంచి 31వ తేదీ వరకు ‘సమాధాన్’ వ్యతిరేక సభలు... సమావేశాలకు, 31న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతోపాటు ఆంధ్ర–ఒడిశా, ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్, తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో వాల్ పోస్టర్లు, బ్యానర్లు పడ్డాయి. మందుపాతర్లు పేల్చడం, బస్సులు.. లారీలకు నిప్పటించడం వంటి విధ్వంసకర చర్యలకు మావోయిస్టులు తెగించారు. తూర్పుగోదావరి జిల్లాలో చింతూరు మండం సరివెల సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి మందుపాతరను పేల్చారు. ఆర్టీసీ తాండూరు డిపో బస్సులకు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లారీకి నిప్పంటించారు. వీటన్నింటి నేపథ్యంలో, ఏజెన్సీ ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఆర్టీసీ పూర్తిగా రద్దు చేసింది. -
జిల్లాలో ‘మావో’ల బంద్ ప్రభావం ఉండదు
ఇన్ చార్జి ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ ఆదిలాబాద్ :మావోయిస్టులు సోమవారం ఇ చ్చిన బంద్ పిలుపుతో ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి ప్రభావం ఉండదని ఇన్ చార్జి ఎస్పీ, కుమురం భీం ఎస్పీ సన్ ప్రీత్‌సింగ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి రెండు జిల్లాల పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి మావోయిస్టు బంద్ నేపథ్యంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగించాలన్నారు. ప్రత్యేక సమాచార నిఘా వర్గాలు సూచించిన మేరకు రెండు జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలని డీఎస్పీలను ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలీస్‌స్టేపోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. సీఐలు, ఎస్సై లు పోలీస్స్టేషన్లలో పూర్తిస్థాయి సిబ్బందితో అప్రమత్తంగా ఉం డాలన్నారు. మావోయిస్టులు జిల్లాలో చొరబాటుకు ప్రయత్నించినా, ఇతర చర్యలకు పాల్పడినా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఇరు జిల్లాల్లో గట్టి పోలీస్ సమాచార వ్యవస్థ పనిచేస్తోందన్నారు. జిల్లా ప్రజలు మావోయిస్టులను పూర్తిగా మరిచిపోయారని, వారిని దరిచేరనీయకుండా నియంత్రించాలని పేర్కొన్నారు. మావోయిస్టులను అభివృద్ధి నిరోధకులుగా ప్రజలు గుర్తించారని తెలిపారు. చిన్న జిల్లాలు ఏర్పడడంతో గ్రామాల్లో నూతనపోలీస్‌స్టేషన్ల ఆవిర్భవించడంతో పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, భరోసా కలిగిందన్నారు. ప్రస్తుతం మావోయిస్టులు ఉనికిని చాటుకోవడానికి జిల్లాలో ఎలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా లొంగి పోయి ప్రజల మధ్య ఉండి పోరాడడం మినహా మరోమార్గం లేదని స్పష్టం చేశారు. మావోయిస్టుల బంద్ కు ప్రజలు ఎలాంటి మద్దతు తెలుపవద్దని, గ్రామాలను సందర్శించే ప్రజాప్రతినిధులు ముందస్తుగా తె లియజేసి పోలీస్ రక్షణ తీసుకోవాలని సూచించారు. అదనపు ఎస్పీ టి.పనసారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, స్పె షల్ బ్రాంచ్ ఎస్సైలు అన్వర్‌ఉల్‌హఖ్, జి.రామన్న, కుమురం భీం స్పెషల్‌బ్రాంచ్ ఎస్సై శివకుమార్, పోలీ స్ టెలికాన్ఫరెన్స్ నిర్వహణాధికారి సింగజ్‌వార్ సంజీ వ్‌కుమార్, ఎస్పీ సీసీ పోతరాజు తదితరులున్నారు. -
కిరండూల్ మార్గంలో రైళ్లు రద్దు
విశాఖపట్నం సిటీ : మావోయిస్టుల బంద్ పిలుపు మేరకు తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తమైంది. కొత్తవలస-కిరండూల్ మార్గంలో విశాఖ నుంచి బయల్దేరే పలు రైళ్లను కుదిం చినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో రాత్రి వేళ నడిచే రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. విశాఖ-కిరర డూల్(58501) పాసింజర్ 19, 20 తేదీల్లో రాత్రి వేళ జగదల్పూర్ స్టేషన్లో ఆగిపోతుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో 20, 21 తేదీ ల్లో జగదల్పూర్ నుంచి విశాఖ మధ్య మాత్రమే కిరండూల్-విశాఖ(58502) పాసింజర్ నడుస్తుందని ప్రకటిం చారు. గూడ్సు రైళ్లను పూర్తిగా నిలిపివేస్తున్నారు. -
నిఘా నీడలో తూర్పు..!
సాక్షి, మంచిర్యాల : రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనగా మావోయిస్టులు నేడు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలు.. వారి ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమవుతున్నారని వారు ఈ బంద్ చేపడుతున్నారు. దీంతో జిల్లాలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బంద్‌ను విఫలయత్నం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెట్టారు. గ్రామాల్లో తిరుగుతూ.. మావోయిస్టుల బంద్‌కు సహకరించొద్దంటూ ప్రజలను కోరుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల పోలీసులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కోటపల్లి, బెజ్జూరు, వేమనపల్లి, కౌటాల మండలాలు.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గడ్చిరోలి, పేట, పోటుగూడెం సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేశారు. గతంలో ‘మావో’ల పిలుపు మేరకు అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. ఈసారి బంద్ విఫలయత్నం చేసేందుకు ‘మేమున్నాం’ అంటూ పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు రాత్రి గ్రామాల్లో నిలిపే బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. కదలికల నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రంలో పోలీసుల కూంబిం గ్ ఎక్కువ కావడంతో మావోయిస్టులు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల నుంచి జిల్లాలో ప్రవేశించి స్థానిక అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసు లు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పటికీ మావోయిస్టుల కదలికలు జిల్లాలో ఉండొచ్చనే ఉద్దేశంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గ్రామాల్లో గట్టి బందోబస్తు నిర్వహించింది. -
యుద్ధ మేఘాలు
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ నెల 8న బందుకు మావోయిస్టులు పిలుపునివ్వడంతో పోలీసు బలగాలు చింతూరు, చర్ల, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వ విధానాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్నదని పేర్కొంటూ, దీనికి నిరసనగా బందుకు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దీనిని జయప్రదం చేయాలంటూ గడిచిన పది రోజులుగా మావోయిస్టు పార్టీ పేరిట ప్రకటనలు వెలువడుతుండడం, బంద్‌ను విజయవంతం చేయాలని వెంకటాపురం మండలం కొండాపురంలో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ పేరుతో బుధవారం పోస్టర్లు కనిపించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దులో భద్రతను పెంచారు. చింతూరు మండలంలోని మల్లంపేట, చర్ల సమీపంలోని కుర్నపల్లి, బత్తినపల్లి, ఎర్రంపాడు, తిప్పాపురం, పులిగుండాల, పూసుగుప్ప, దుమ్ముగూడెం మండలంలోని ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాలైన ముల్కనపల్లి, పెద్దనల్లబెల్లి, పైడిగూడెం, కమలాపురం అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు రెండు రోజుల నుంచి ముమ్మరంగా కూంబింగ్ సాగిస్తున్నాయి. గతంలో మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చినపుడు వాహనాల రాకపోకలను అడ్డుకునేందుకు కుర్నపల్లి-పెద్దమిడిసిలేరు, ఉంటుపల్లి-చర్ల మధ్య రోడ్లపై కందకాలు తవ్వారు. ఈసారి కూడా మావోయిస్టులు అలా చేస్తారేమోనని భావించిన పోలీసులు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని గ్రామాల్లోకి రాత్రి వేళ ఏ రూట్లలో బస్సులు వెళ్తున్నాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. నిర్భంధాన్ని నిరసిస్తూ 8న బంద్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించి, నిర్బంధాన్ని కొనసాగిస్తున్నదని, దీనికి నిరసనగా ఈ నెల 8న చేపట్టిన బంద్‌ను జిల్లాలో విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి కిరణ్ పేరిట గురువారం ‘సాక్షి’ కార్యాలయానికి ప్రకటన అందింది. చంద్రబాబు మాదిరిగానే కేసీఆర్ కూడా సింగపూర్, రోడ్లు, మెట్రో రైళ్లు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. విప్లవకారులపై ఎదురు కాల్పులు, విద్యార్థులపై లాఠీచార్జీ చేయిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.