సాక్షి, మంచిర్యాల : రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనగా మావోయిస్టులు నేడు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలు.. వారి ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమవుతున్నారని వారు ఈ బంద్ చేపడుతున్నారు.
దీంతో జిల్లాలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బంద్‌ను విఫలయత్నం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెట్టారు. గ్రామాల్లో తిరుగుతూ.. మావోయిస్టుల బంద్‌కు సహకరించొద్దంటూ ప్రజలను కోరుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల పోలీసులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కోటపల్లి, బెజ్జూరు, వేమనపల్లి, కౌటాల మండలాలు.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గడ్చిరోలి, పేట, పోటుగూడెం సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేశారు.
గతంలో ‘మావో’ల పిలుపు మేరకు అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. ఈసారి బంద్ విఫలయత్నం చేసేందుకు ‘మేమున్నాం’ అంటూ పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు రాత్రి గ్రామాల్లో నిలిపే బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.
కదలికల నేపథ్యంలో..
పొరుగు రాష్ట్రంలో పోలీసుల కూంబిం గ్ ఎక్కువ కావడంతో మావోయిస్టులు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల నుంచి జిల్లాలో ప్రవేశించి స్థానిక అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసు లు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పటికీ మావోయిస్టుల కదలికలు జిల్లాలో ఉండొచ్చనే ఉద్దేశంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గ్రామాల్లో గట్టి బందోబస్తు నిర్వహించింది.
నిఘా నీడలో తూర్పు..!
Published Sat, Nov 8 2014 3:15 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement