Government Failure
-
అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు..
ఇంఫాల్: మణిపూర్‌లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో దారుణంగా విఫలమయ్యారంటూ ప్రతిపక్షాలు మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి. ఎప్పుడో జరిగిన సంఘటనకు ఇప్పుడు రాజీనామా చెయ్యమంటే ఎలా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మే 4న జరిగిన మణిపూర్ అల్లర్లలో ఒక చీకటి అధ్యాయం వెలుగు రావడానికి చాలా ఆలస్యమైంది. సరిగ్గా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న రోజునే ఆనాటి వీడియో బయటకి రావడంతో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. అందులోని అమానవీయ సంఘటన చూసి దేశమంతా నివ్వెరపోయింది. పార్లమెంటు సమావేశాలు మొదటిరోజే అట్టుడికింది. ఇది కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యమేనని వేలెత్తి చూపుతూ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అల్లర్లను నియంత్రించడంలో విఫలమైన కారణంగా నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేస్తున్నట్లు ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈ ఊహాగానాలన్నిటినీ ప్రభుత్వ వర్గాలు కొట్టి పారేశాయి. ప్రభుత్వ వర్గాలు ఈ డిమాండ్లపై స్పందిస్తూ అది ఒకప్పటి వీడియో అని ఇప్పుడు మణిపూర్‌లో పరిస్థితి చాలా వరకు సర్దుకుంది శాంతి భద్రతలు పూర్తి అదుపులో ఉన్నాయని చెప్పుకొచ్చాయి. మణిపూర్ హోమ్ మంత్రి కుకీ తెగ వారితో చర్చించారని వారికి సత్వర న్యాయం చేకూరేలా చేస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి పదవి నుండి తప్పుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మెయిటీ వర్గం వారు నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసిన ఘటన రెండు నెలల క్రితమే జరిగి ఉండవచ్చు. కానీ ఇప్పటివరకు నిందితులను అదుపులోకి తీసుకోకపోవడాన్ని ప్రతిపక్షాలు వేలెత్తి చూపుతున్నాయి. బుధవారం ఈ ఉదంతం వెలుగులోకి రాగానే మణిపూర్ ప్రభుత్వం, పోలీసు వర్గాలు అప్రమత్తమై వీడియో ఆధారంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇది కూడా చదవండి: భారీ వర్షాలు.. పసిబిడ్డను ఎత్తుకొని రైలు దిగిన తండ్రి, పట్టుతప్పడంతో -
ప్రభుత్వ వైఫల్యంతోనే సంక్షోభంలో రైతాంగం
ఒంగోలు: నాలుగేళ్లుగా రాష్ట్రంలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ప్రకృతి వైపరీత్యాలతోపాటు ప్రభుత్వ వైఫల్యం వల్ల రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. స్థానిక తన నివాసంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ఒక వైపు ప్రకృతి కన్నెర్ర చేస్తే మరో వైపు అధికార పార్టీ నాయకుల ఆగడాలతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. పాతికేళ్లలో లేని సంక్షోభాన్ని పొగాకు రైతులు 2015–16లో చవిచూశారన్నారు. పండించిన పంటకు సైతం గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ప్రకాశం జిల్లాలో అధికంగా చోటుచేసుకున్నాయన్నారు. చివరకు వైఎస్సార్ సీపీ జోక్యంతో కేంద్రం సైతం దిగి వచ్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ముందుకు రావడంతో కొంతమేర రైతులు నిలదొక్కుకోగలిగారన్నారు. మూడు నెలల క్రితం కర్నాటకలో కిలో పొగాకుకు రూ.175 సరాసరి ధర లభిస్తే నేడు మన రాష్ట్రంలో రూ.130 నుంచి రూ.140లు మాత్రమే పలుకుతోందన్నారు. రెండు రోజుల క్రితమే టంగుటూరు మండలంలో కూడా ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం కలచివేస్తోందన్నారు. పొగాకు బోర్డు ఈ ఏడాది 63 మిలియన్ టన్నుల పొగాకు కొనుగోళ్లు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు కేవలం 30 మిలియన్ టన్నుల పొగాకును మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో గిట్టుబాటు ధర రాకపోతుండడంతో టంగుటూరులో రైతులు వేలం కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని, ఇది రైతుల్లో చోటు చేసుకుంటున్న అభద్రతా భావానికి చిహ్నంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పొగాకుతో బాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. పొగాకు బోర్డుపై కూడా ఒత్తిడి తెచ్చి వ్యాపారులు ధర పెంచి కొనుగోలు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. మరో వైపు అధికార పార్టీ ఆగడాలు, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలేవీ.. జిల్లాలో తాగునీటి ఎద్దడికి సంబంధించి 1800 ట్యాంకర్లను ఏర్పాటు చేసి నీటి ఎద్దడిని అధిగమించాలంటూ ముందస్తు ప్రతిపాదనలు చేసినా నేటి వరకు వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని ఎంపీ అన్నారు. మార్కాపురం ప్రాంతంలో రోజుకు 1.8 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం కాగా ప్రస్తుతం సరఫరా చేస్తుంది కేవలం ఒక మిలియన్ లీటర్ల నీరు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో 80 వేల లీటర్ల నీటి ఎద్దడిని ప్రజానీకం ఏ విధంగా అధిగమించాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బోర్లు 800 అడుగుల లోతుకు వేసినా నీరు లభ్యంకాని పరిస్థితులు పశ్చిమ ప్రకాశంలో నెలకొన్నాయన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు బేస్తవారిపేట, కంభం మండలాల్లో అరటి, బత్తాయి, బొప్పాయితోపాటు పలు మండలాల్లో మామిడి తదితర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని, నష్టపోయిన రైతుకు పూర్తిస్థాయి పరిహారం అందించేలా పంట నష్టం అంచనాలను సకాలంలో తయారు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని కేంద్రం పరిధిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తే పార్టీలకు అతీతంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. బీజేపీతో వైఎస్సార్ సీపీ కుమ్మక్కు అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుని భార్యకు టీటీడీ బోర్డు మెంబర్‌గా పదవి కట్టబెట్టడం, కేంద్ర మహిళా మంత్రి భర్త చంద్రబాబుకు గౌరవ సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తమకు ప్రజల మద్దతు ఉందని, 2019 ఎన్నికల్లో గెలుపు ఖాయం అని, చంద్రబాబుకు ఆ నమ్మకం లేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు వేమూరి సూర్యనారాయణ, కెవి రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, గొర్రెపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అధికార పార్టీకి ఓటేస్తేనే పంట కొంటారా..? జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు కేవలం 33 వేల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేశారని, ఇంకా జిల్లాలో 30 వేల క్వింటాళ్ల కందులు మిగిలి ఉన్నాయని ఎంపీ వైవీ అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయంగా కంది పంట వేస్తే కేవలం ఒక్కో రైతుకు రెండు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పడం పచ్చ కండువా కప్పుకున్న దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమే అన్నారు. రైతు తాను పండించిన 5 క్వింటాళ్లలో రెండు మాత్రమే మద్దతు ధరకు అమ్ముకుంటే మిగిలిన మూడు క్వింటాళ్లు దళారీలకు అతి తక్కువకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నాడన్నారు. శనగలకు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేశాడా లేదా అని పరిశీలించి మరీ కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారని ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అన్నారు. మరో నెలరోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కాబోతున్న దృష్ట్యా పదివేల ఎకరాలకు సబ్సిడీ విత్తనాలు కాకుండా కనీసంగా 20 వేల ఎకరాల్లో పంటలకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే జగన్‌పై విమర్శలు
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ధ్వజం కాకినాడ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ జగన్మోహన్రెడ్డిపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైనా నిందలు మోపడం సరైన పద్ధతి కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలోని తన నివాస గృహంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా చంద్రబాబు మాట్లాడే భాష, ఆరోపణలు ఉండాలన్నారు. పట్టిసీమ కాలువకు గండి పడితే దానికి వైఎస్సార్ సీపీ కారణం మన్నట్టు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తుని రైలు కాల్చివేత ఘటనలో రాయలసీమకు చెందిన వారి హస్తం ఉందని చెప్పిన చంద్రబాబు ఆ తరువాత ఈ జిల్లా వారిపైనే కేసులు బనాయించార ని గుర్తుచేశారు. ఏదైనా ఘటన జరిగినపుడు సీఎం ప్రభుత్వ యంత్రాంగంతో విచారణ జరిపించాక అందుకు కారకులెవరో తేల్చాలని అన్నారు. అలాంటిదేమీ లేకుండా ఎక్కడ ఏది జరిగినా అది జగన్మోహన్రెడ్డే కారణమంటూ ఎంతకాలం విపక్షం మీద విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ సమర్థతపై నమ్మకం లేకే.. కృష్ణా పుష్కరాలకు జనం రాకపోతే ఆ తప్పు జగన్‌దే అన్నట్టు సీఎం చంద్రబాబు మాట్లాడడాన్ని కన్నబాబు తప్పుపట్టారు. గోదావరి పుష్కరాల తొలిరోజు 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటతో యాత్రికులు భయభ్రాంతులయ్యారన్నారు. పుష్కరాల నిర్వహణపై ప్రభుత్వ సమర్థతపై ప్రజలకు నమ్మకం లేకపోవడం వల్లే కృష్ణా పుష్కరాలకు జనం రావడం లేదని గమనించాలని కన్నబాబు స్పష్టం చేశారు. అమరావతిపై ప్రముఖ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్ సుప్రీం కోర్టులో కేసు వేసినందున ఆయనను ఉన్మాదిగా చంద్రబాబు మాట్లాడడం అభ్యంతరకరమన్నారు. గతంలో పలు అంశాలపై టీడీపీ కోర్టులకు వెళ్లిన సంఘటనలు లేవా? అని ప్రశ్నించారు. -
ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే
►సీఎల్పీ నేత కె.జానారెడ్డి నాగార్జునసాగర్: ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోందన్నారు. లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
వీళ్ల ప్రాణాలకు ఏదీ హామీ?
♦ విద్యుదాఘాతాలతో మృతి చెందుతున్న యువకులు ♦ వికలాంగులవుతున్న మరికొందరు ♦ మునిపల్లి మండలంలో తరచూ సంఘటనలు ♦ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం ♦ తమకు సంబంధం లేదంటున్న విద్యుత్ అధికారులు మునిపల్లి: నిరుద్యోగుల అవసరం వాళ్ల ప్రాణాల మీదకు వస్తోది. రోజు కూలీలుగా విద్యుత్ తీగల మరమ్మతులకు వెళ్తూ ప్రాణాలు కోల్పోవడమో లేక వికలాంగులుగా మారడమో జరుగుతున్న ఆ శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మునిపల్లి మండలం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదైనా దుర్గటన జరిగినప్పుడు మాత్రం.. ఉద్యోగం ఇప్పిస్తామని నాయకులు కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారు తప్ప.. బాధితులను ఆదుకోవడం లేదు. నాలుగేళ్లుగా ఎదురుచూపులు మునిపల్లి మండలం బుదేరా చౌరస్తా సమీపంలో నివాసం ఉంటున్న హోళియ దాసరి శ్రీనివాస్(26)ను 2012లో విద్యుత్తు మరమ్మతుల కోసం ప్రజలు రోజువారీ కూలీగా నియమించుకున్నారు. ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని చెప్పి అధికారులు సైతం రోజూ పనులు చేయించుకునేవారు. ఈక్రమంలో 2014 ఏప్రిల్ 11న పెద్దగోపులారం శివారులో విద్యుత్ వైర్లను సరిచేస్తుండగా షాక్ తగిలి కుడిచేయి కాలిపోయింది. వికలాంగుడిగా మారడంతో ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఆపై ముఖం చాటేశారు. శ్రీనివాస్ తండ్రి బాగయ్య తన కొడుకు ఆరోగ్యం బాగుచేయించడం కోసం రూ.3 లక్షల వరకు అప్పులు చేశారు. కోలుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా సంగారెడ్డిలోని విద్యుత్ అధికారుల చుట్టూ తిరి గినా ఫలితం లేదు. దీంతో అతని కు టుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మరమ్మతులకు వెళ్లి మృతి పెద్దలోడి గ్రామానికి చెందిన సాలే అంబదాస్ ఐదేళ్ల క్రితం రోజు కూలీగా విద్యుత్తు పనులకు వెళ్లేవాడు. అంబదాస్కు తండ్రి సంగయ్య, తల్లి రాములమ్మ, భార్య లక్ష్మి, కుమార్తె శిరీష(5) ఉన్నారు. ఈనెల 6న ఎప్పటిలాగే గ్రామంలో ఇంటింటికీ మీటర్ రీడింగ్ చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం పిల్లోడి గ్రామంలో బోరుమోటార్ పనిచేయడం కోసం వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చేతులు దులుపుకున్నారు. ఉద్యోగం వచ్చే వరకు పోరాటం ప్రభుత్వం వచ్చే వరకు పోరాడతా. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వల్లే నా కుడి చేయి కాలిపోయింది. కానీ, వాళ్లు మాకు సంబంధం లేదంటున్నారు. ప్రభుత్వం స్పందించి నా కుటుంబానికి న్యాయం చేయాలి. - శ్రీనివాస్, బాధితుడు మాకు సంబంధం లేదు విద్యుత్ వైర్ల మరమ్మతులు చేస్తున్న రోజువారి కూలీలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వం నియమించిన వారికి మాత్రమే ఏదైనా జరిగితే వారి కుటుంబానికి ఉపాధి కలుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. - రాజ్‌కుమార్, ఏఈ -
మృత్యుతీరం
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి : ఒక వైఫల్యం పెను విషాదాన్ని సృష్టించింది. ఒక జాప్యం ఎన్నో జీవితాలను చిదిమేసింది. వేచివేచి ఉన్న వేలమంది భక్తుల ఆరాటం, అసహనం కొద్దిమంది తోటిభక్తులకు మరణశాసనమయ్యాయి. పుష్కరఘాట్ వాకిట కాలయముని దున్నగిట్టల చప్పుడు కఠోరంగా మార్మోగింది. రాజమండ్రిలోని ఆ రేవు వద్ద పుష్కరాల తొలినాడే జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాత పడ్డారు. వందలాది మంది గాయపడ్డారు. ఈ సంఘటన జాతి యావత్తునూ కలచివేసింది. ఎన్నడు మొదలయ్యాయో తెలియని గోదావరి పుష్కరాల చరిత్రలో ఎన్నడూ లేని కన్నీటి ఘట్టం నమోదయ్యింది.గడచిన పుష్కరాల్లో గోదావరిలో నీటమునిగి కొందరు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నా అవన్నీ మానవతప్పిదాలే. కానీ అందుకు పూర్తి భిన్నమైన ఘటన రాజమండ్రిలో మంగళవారం జరిగింది. ఈ ఘోరంతో పుష్కర భక్తుల్లో అభద్రతాభావం పెచ్చరిల్లింది. జిల్లాలో రాజమండ్రి సహా గ్రామీణప్రాంతాల్లో ఘాట్లకు వెళ్లాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది. చర్యలన్నీ దుర్బలమే.. జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలో అనేక ఘాట్లు ఉన్నా రాజమండ్రిలోని ఘాట్లకు చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. ఆధ్యాత్మిక శోభ, సాంస్కృతిక సౌరభాలతో దేశం నలుమూల నుంచి తరలివచ్చే లక్షలాది మంది భక్తులను అలరిస్తాయంటూ గొప్పలకు పోయింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో పలు ఘాట్లలో చేసిన ఏర్పాట్లపై రాష్ట్రవ్యాప్తంగా విస్తృతమైన ప్రచారాన్ని కల్పించింది. ముఖ్యమంత్రితో పాటు పుష్కర కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, చంద్రబాబు కేబినెట్లో కీలక మంత్రి నారాయణ, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కూడా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తవంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు పలు పర్యాయాలు రాజమండ్రికి వచ్చి ఇక్కడే మకాం చేసి సమీక్షలపై సమీక్షలు నిర్వహించి తీరా సాధించిందేమిటని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల నిర్వాకం ఇలా ఉంటే జిల్లా అధికార యంత్రాంగంలో జడత్వం కూడా ఇందుకు తోడైంది. ఏర్పాట్లలో రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్‌కు సంబంధించి పోలీసులు గడచిన నెల రోజులుగా తీసుకున్న చర్యలు ఎంత దుర్బలమైనవో ఈ ఘోర దుర్ఘటనతో తేటతెల్లమైందని విజ్ఞులు అంటున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులను అంచనా వేయడంలోను, ఒకేసారి లక్షలాదిగా వచ్చే భక్తులను ఘాట్ల వద్దకు ఒక క్రమపద్ధతిలో అనుమతించడంలో వైఫల్యంచెందడంతోనే అమాయకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్వాకంతో గోదావరి పుష్కరాల పుణ్యఘట్టం కాస్తా తొలిరోజే విషాదఘట్టాన్ని సృష్టించింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అపచారమా? కాగా, ఈ ప్రమాద ఘటనపై ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులు మాత్రం సెంటిమెంట్‌తో కూడిన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర స్థలమైన పుష్కరాల రేవులో కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్లే ఈ అపశృతి జరిగిందంటున్నారు. వాస్తవానికి ఈ విగ్రహం ఏర్పాటు విషయం మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉంది. రాజమండ్రిలో అఖిలపక్షం విగ్రహం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. చివరకు ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉండగానే సీఎం చంద్రబాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణకు ముందు రోజు మూడువేల మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ స్థాయి బందోబస్తు మంగళవారం ఉదయం పుష్కరఘాట్ వద్ద చేసి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనే వాదన వినిపిస్తోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న సామెత చందంగా 27 మంది భక్తులు ప్రాణాలు గాలిలో కలిసిపోయాక రాష్ట్ర పోలీసు బాస్ రాముడు మంగళవారం అర్థరాత్రి రాజమండ్రిలోని పలు ఘాట్లను సందర్శించారు. ఇక బందోబస్తుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి నొక్కి చెప్పారు. ఎన్ని చెపితే వరదలో కొట్టుకుపోయిన గడ్డిపరకల్లా.. గాలిలో కలిసిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి? వృుతుల ఆత్మీయుల కన్నీటి వెల్లువకు అడ్డుక ట్ట పడుతుంది? -
బాబే బాధ్యత వహించాలి: కిషన్‌రెడ్డి
సూర్యాపేట: గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యంతో తొలిరోజునే రాజమండ్రి ఘటన జరిగిందని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడారు. పుష్కరాలకు ఎన్నడూలేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు ప్రచార ఆర్భాటం చేశారేకానీ ఏర్పాట్లు మాత్రం చేయలేదన్నారు. ఉత్సవాల ప్రారంభం రోజునే పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడం అక్కడ ఏర్పాట్ల వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. -
పుష్కర విలాపం
అవధుల్లేని భక్తితో బయల్దేరిన వారి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. అచంచల విశ్వాసంతో పయనమైన వారిని అనుకోని ఆపద కబళించింది. పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల కోసం ప్రయాస పడి వెళ్లిన వారి జీవితం అత్యంత విషాదకర పరిస్థితుల్లో కడతేరిపోయింది. గోదావరి నదిలో, పుణ్య ఘడియల్లో స్నానం చేసి తరిద్దామనుకుని విశాఖనగర పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సాహంగా బయల్దేరిన వారిని చివరికి మృత్యువు క్రూరంగా నులిమేసింది. దారుణ నిర్లక్ష్యమో, ఘోరమైన బాధ్యతా రాహిత్యమో.. ఏదైతేనేం.. వేరొకరి పొరపాటు కారణంగా ఈ అమాయకుల బతుకు అనూహ్యంగా ముగిసిపోయింది. పుష్కరం వీరి సన్నిహితులకు చివరికి మహా విషాదాన్ని మిగిల్చింది. అది పన్నెండేళ్లకే కాదు.. బతుకు చివరి వరకు పీడకలలా వెంటాడుతూనే ఉంటుంది. - పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట - జిల్లావాసులు ఐదుగురి దుర్మరణం - మృతులందరూ మహిళలే - మరో ముగ్గురికి గాయాలు - విషాదాన్ని మిగిల్చిన ప్రభుత్వ వైఫ్యల్యం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పుష్కర గోదావరి కోలాహలాన్ని విషాద కెరటం ముంచెత్తింది. శోభాయమానం వేడుకగా సాగాల్సిన గోదావరి పుష్కరాల ఏర్పాట్లల్లో ప్రభుత్వ వైఫల్యం జిల్లాకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా పుష్కర యాత్రకు తీరని శోకాన్ని మిగిల్చింది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో జిల్లకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారి సంఖ్యకు అంతకుమించే ఉంటుందని తెలుస్తోంది. పుష్కరాలకు వెళ్లిన తమ వారి ఆచూకీ కోసం జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందారు. అందరూ మహిళలే : తొక్కిసలాటలో జిల్లాకు చెందిన ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందరూ మహిళలే కావడం గమనార్హం. సాధారణంగా పుష్కరాలంటే మహిళలే అత్యధికంగాభక్తిశ్రద్ధలు కనబరుస్తారు. ప్రభుత్వ వైఫల్యం వారి పాలిటశాపంగా పరిణమించింది. ఈ దుర్ఘటనలో నగర శివారులోని మారికవలసకు చెందని అవ్వ బంగారమ్మ(34), ఆమెకుమార్తె (16), సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి(68), పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ(61), గాజువాకకు చెందిన పాండవుల మహాలక్ష్మి( 61) ప్రాణాలు కోల్పోయారు. పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం : మధురవాడలోని మారికవలసకు చెందిన పేద ఆటోడ్రైవర్ అవ్వ కృష్ణ కుటుంబాన్ని విషాదం ఆవహించింది. భోగాపురానికి చెందిన అవ్వ కృష్ణ ఏడాదిన్నరగా మారికవలస రాజీవ్‌గృహకల్ప కాలనీలో నివాసిస్తున్నారు. ఆయన భార్య బంగారమ్మ ఆ కాలనీలో కొబ్బరి బొండాలు విక్రయిస్తారు. ఆయన కుమార్తె గౌరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. కుమారుడు రాంబాబు పాలిటెక్నిక్ విద్యార్థి. పుష్కరాల కోసం కృష్ణ తన కుటుంబ సమేతంగా మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరఘాట్‌కు చేరుకుని ఎప్పుడు గేటు తీస్తారా అని నిరీక్షిసున్నారు. అధికారులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో అవ్వ కృష్ణ భార్య బంగారమ్మ(35), ఆమె కుమార్తె గౌరి(16) దుర్మరణం చెందారు. వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అవ్వ కృష్ణ, ఆయన కుమారుడు రాంబాబు తీవ్రంగా గాయపడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్య, కుమార్తె కోసం అవ్వ కృష్ణ చాలాసేపు వెతుకసాగారు. ఇంతలోనే విశాఖపట్నంలోని ఆయన సమీప బంధువులు బంగారమ్మ, గౌరీల మృతదేహాలను టీవీలో చూసి కృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పారు. దాంతో కృష్ణ హుటాహుటిన ఆసుపత్రికి పరుగులు తీశారు. విగతజీవులై పడి ఉన్న తన భార్య, కుమార్తెలను చూసి హతాశుడయ్యారు. ఒక్క ఆధారం తెగిపోయింది: సీతమ్మధారకు చెందిన కోటిన మహాలక్ష్మి( 68) రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్త పింఛనే ఆమె కుటుంబానికి ఆధారం. ఆమెకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మహాలక్ష్మి తమ బంధువులతో కలసి సోమవారం రాత్రి విశాఖపట్నంలో బయలుదేరి వెళ్లారు. తొక్కిసలాటలో ఆమె కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. దాంతో ఆ కుటుంబానికి ఉన్న ఒక్క ఆదరవూ లేకుండాపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆ కుటుంబాని నిండాముంచేసింది. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాలు : కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న వారిని రాజ మండ్రి దుర్ఘటన కబళించేసింది. పెందుర్తికి చెందిన గొర్లె మంగమ్మ (61) అసువులు బాశారు.ఆమె తమ బంధువులతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. పుష్కరస్నానం కోసం నీరిక్షిస్తున్న ఆమె తొక్కిసలాటలో కిందపడిపోయి ప్రాణాలు విడిచారు. మంగమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమెతోపాటు పుష్కరాలకు వెళ్లిన పెందుర్తికి చెందిన గొర్లె అచ్చియమ్మ, చీపురుపల్లి సాదమ్మ, నరవ అచ్చియమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకకు చెందిన అగనంపూడికి చెందిన పాండవుల విజయలక్ష్మి( 61) రాజమండ్రి పుష్కరఘాట్‌లో జరిగిన తొక్కిసలాటలో దుర్మరణం చెందారు. అగనంపూడికి చెందిన ఆమె కొంతకాలంగా గాజువాకలో తన కుమారుల వద్ద ఉంటున్నారు. విజయలక్ష్మి తమ బంధువలతో కలసి మంగళవారం ఉదయం రాజమండ్రి చేరుకున్నారు. సాయంత్రానికి వచ్చేస్తానని తన కుమారులకు ఫోన్ చేసి చెప్పారు కూడా. కానీ అంతలోనే పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు విడిచారు. జిల్లా నుంచి వెళ్లిన వేలాదిమందిలో పలువురి ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రసవ వేదన
♦ పెద్దాస్పత్రికి కాన్పు కష్టాలు ♦ చాలీచాలని పడకలు, సరిపోని వైద్యులు ♦ సీఎం చూసి వెళ్లినా ఫలితం శూన్యం ♦ సర్కారు వైఫల్యంపై జనం మండిపాటు లబ్బీపేట : రెండు దశాబ్దాల కిందట నగర పరిసర ప్రాంతాల జనాభా సుమారు ఆరున్నర లక్షలుంటే.. ప్రస్తుతం 12 లక్షలకు చేరింది. అంటే నగరీకరణ నేపథ్యంలో దాదాపు రెట్టింపయింది. అదే ప్రభుత్వాస్పత్రి ప్రసూతి విభాగంలో రెండు దశాబ్దాల కిందట 60 పడకలు, పది మంది వైద్యులు ఉంటే.. నేటికీ అదే పరిస్థితి నెల కొంది. జనాభా పెరిగినప్పుడు ఆస్పత్రిలో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా, ప్రభుత్వాలు ఆ దిశగా కృషిచేయడం లేదు. ఫలితంగా నిండు గర్భిణులకు ప్రసూతి కష్టాలు తప్పడం లేదు. నగరం, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, భీమవరం నుంచి కూడా నిత్యం గర్భిణులు ప్రసూతి కోసం ప్రభుత్వాస్పత్రికి వస్తుం టారు. ఒక్కో సమయంలో సాధారణ కేసులను కూడా ఇక్కడికి రిఫర్ చేస్తుండడంతో ఈ విభాగంలో ఉన్న పడకలు చాలక కారిడార్, వరండాల్లో వేసిన పడకలపై ఉంచాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించినా, వైద్య శాఖ మంత్రి దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినా ప్రయోజనం లేదు. చాలని పడకలు.. పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి నిత్యం 150 మంది అవుట్ పేషెంట్స్ వస్తుంటారు. 110 నుంచి 115 మంది వరకు గర్భిణులు, గర్భకోశ వ్యాధులతో బాధపడే వారు చికిత్స పొందుతుంటారు. ఈ విభాగంలో అధికారికంగా రెండు యూనిట్లు ఉండగా 60 పడకలు ఉన్నాయి. అనధికారికంగా నిర్వహిస్తున్న మరో యూనిట్‌తో (30 పడకలతో) కలిపితే 90 పడకలున్నాయి. మరి 115 మంది ఇన్ పేషెంట్స్ ఉంటే మిగిలిన 25 మందిని ఎక్కడ ఉంచాలనే విషయమై వైద్యులు, వైద్య నిఫుణులు తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయం తెలియని మంత్రులు ఒకే బెడ్‌పై ఇద్దరిని ఎందుకుంచుతున్నారంటూ హడావుడి చేస్తున్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం చూసినా ఆరు యూనిట్లు ఉంటే కాని సరైన వైద్యం అందించలేమని గతంలోనే వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రభుత్వానికి రాసిన లేఖను బుట్టదాఖలు చేశారు. ప్రిన్సిపాల్ సూచన మేరకు యూనిట్లు పెంచి ఉంటే 180 పడకలు, 30 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చే అవకాశముండేది. వచ్చారు.. చూశారు.. వెళ్లారు.. గత ఏడాది నవంబరులో ముఖ్యమంత్రి నగర పర్యటనలో భాగంగా పాత ఆస్పత్రి ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. అక్కడ చికిత్స పొందుతున్న గర్భిణుల కష్టాల్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో చికిత్స పొందుతున్న వారికి ప్రోత్సాహక నగదు అందించి చేతులు దులుపుకొన్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దీంతో సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ అన్న చందంగా మారాయి. లక్ష్యం ఘనం..సౌకర్యాలు శూన్యం.. ఒకవైపు మాతాశిశు మరణాల రేటును వంద శాతం నివారించాలంటూ వాడవాడలా సమావేశాలు పెడుతూ ఊదరగొడుతున్న ప్రభుత్వం ప్రసూతి ఆస్పత్రుల్లో కనీస వసతులు కల్పించడంలో మాత్రం విఫలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం ఆస్పత్రికి వచ్చిన గర్భిణికి రక్తపరీక్షలు సైతం అందుబాటులో ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సకాలంలో వైద్యం ఎలా అందించగలుగుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రసూతి ఆస్పత్రుల్లో సరైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వైద్యుల నియామకాలు చేపట్టాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని నిపుణులు అంటున్నారు. -
తప్పుల తడక
కడప: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన హెల్త్‌కార్డుల పథకం తప్పుల తడకగా మారింది. ఉద్యోగులకు ఉచితంగా కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేందుకు సంబంధించి చాలారోజులుగా ప్రభుత్వం నాన బెడుతూ 2014 చివరిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే హెల్త్‌కార్డులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే హెల్త్‌కార్డుల వ్యవహారంలో మొత్తం అంతా తప్పులు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. పథకానికి సంబంధించిన కార్డులతోపాటు ఇతరత్రా తప్పులు దొర్లడంతో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా నేరుగా పెన్షనర్స్, ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం ఆర్థికశాఖ పరిధిలో వెబ్సైట్ నడుస్తుండడం, హెల్త్‌కార్డులకు ప్రత్యేకంగా సైట్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏపీ వారికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో కార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతో హెల్త్‌కార్డులు రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోని కడపలో పనిచేస్తున్న తమకు తెలంగాణ ముద్ర ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చాలామందికి తెలంగాణ ప్రభుత్వం పేరుతోనే కార్డులు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కార్డు ఒకరి పేరుతో ఉంటే ఫోటో మరొకరిది ఉండడం లాంటి తప్పులున్నాయి. ఇలా ఎందుకు జరుగుతున్నాయో చెప్పేవారు లేకపోగా, ఏదైనా విపత్కరపరిస్థితులు ఎదురైనప్పుడు ఆస్ప్రత్రికి వెళితే తెలంగాణ ప్రభుత్వం పేరుతో ఉన్న కార్డులు చెల్లకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వెబ్సైట్లో ఆప్షన్లు లేక ఇబ్బందులు హెల్త్‌కార్డులకు సంబంధించి ప్రత్యేకంగా వెబ్సైట్ లేకపోవడంతో ఆప్షన్ల విషయంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన వెబ్సైట్లలో ఎడిట్, డిలీట్ లాంటి ఆప్షన్లు లేకపోవడంతో ఏదైనా ఒక అక్షరం తప్పు జరిగినా సరిదిద్దుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఉద్యోగి పేరు వెంకట రమణ అయితే ఒక అక్షరం తేడా వచ్చినా నిలిచిపోతున్నాయి. తేడాలున్న కార్డులను నిలిపేస్తుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. పైగా నో రికార్డు ఫౌండ్ అని చూపిస్తుండటంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారికి ఎగనామం రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగస్తుల వివరాలను అప్పట్లో ప్రభుత్వం సేకరించింది. దాని ఆధారంగానే ప్రభుత్వం హెల్త్‌కార్డులను మంజూరు చేస్తోంది. అయితే, విభజన అనంతరం కొద్దిరోజుల తర్వాత ఉద్యోగంలో కొత్తగా చేరిన వారి వివరాలను ప్రభుత్వం తీసుకోలేదు. ఎంటర్ చేయడానికి అవకాశం లేకపోవడంతో కొత్తగా చేరిన ఉద్యోగులకు హెల్త్‌కార్డులు మంజూరు దాదాపు లేనట్లేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇప్పటికీ కూడా చాలా శాఖల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి హెల్త్‌కార్డులు రాకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఎవరిని అడగాలో తెలీక అవస్థలు జిల్లాలో వేలాది మంది ఉద్యోగులు వివిధ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే హెల్త్‌కార్డులకు సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు ఇప్పటికే ట్రెజరీ అధికారులను, ఆరోగ్యశ్రీ, 108, కలెక్టరేట్, ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. చివరికి హెల్త్‌కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరిని అడిగి తెలుసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. అలాగే టోల్‌ఫ్రీ నెంబరు కూడా లేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వారు విన్నవిస్తున్నారు. -
నిఘా నీడలో తూర్పు..!
సాక్షి, మంచిర్యాల : రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని నిరసనగా మావోయిస్టులు నేడు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతు వ్యతిరేక విధానాలు.. వారి ఆత్మహత్యలకు సీఎం కేసీఆరే కారణమవుతున్నారని వారు ఈ బంద్ చేపడుతున్నారు. దీంతో జిల్లాలో పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. బంద్‌ను విఫలయత్నం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న పోలీసులు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై నిఘా పెట్టారు. గ్రామాల్లో తిరుగుతూ.. మావోయిస్టుల బంద్‌కు సహకరించొద్దంటూ ప్రజలను కోరుతున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఇరు రాష్ట్రాల పోలీసులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కోటపల్లి, బెజ్జూరు, వేమనపల్లి, కౌటాల మండలాలు.. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన గడ్చిరోలి, పేట, పోటుగూడెం సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్ చేశారు. గతంలో ‘మావో’ల పిలుపు మేరకు అనేక గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అయితే.. ఈసారి బంద్ విఫలయత్నం చేసేందుకు ‘మేమున్నాం’ అంటూ పోలీసులు ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ఆర్టీసీ అధికారులు రాత్రి గ్రామాల్లో నిలిపే బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. కదలికల నేపథ్యంలో.. పొరుగు రాష్ట్రంలో పోలీసుల కూంబిం గ్ ఎక్కువ కావడంతో మావోయిస్టులు ప్రాణహిత నది పరివాహక ప్రాంతాల నుంచి జిల్లాలో ప్రవేశించి స్థానిక అటవీ ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారనే సమాచారంతో పోలీసు లు ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఇప్పటికీ మావోయిస్టుల కదలికలు జిల్లాలో ఉండొచ్చనే ఉద్దేశంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం గ్రామాల్లో గట్టి బందోబస్తు నిర్వహించింది. -
‘ఉపాధి’ ఎండమావే!
తీవ్ర దుర్భిక్షంతో 57 మండలాల్లో ఖరీఫ్ పంటలకు నష్టం సేద్యం పడకేయడంతో గ్రామాల్లో ఉపాధి దొరకని దుస్థితి ఉపాధిహామీ కింద పని కల్పించడంలో సర్కారు వైఫల్యం పొట్టచేత పట్టుకుని నగరాలకు వలస వెళ్తున్న గ్రామీణులు వరుసగా ఐదో ఏటా జిల్లాను కరవు కాటేసింది. దుర్భిక్షంతో సేద్యం పడకేసింది. రైతులే కూలీలుగా మారిపోవడంతో పల్లెల్లో పని దొరకని దుస్థితి నెలకొంది. ఉన్న ఊళ్లో చేతినిండా ఉపాధి కల్పించి.. వలసల నివారణకు చేసిన ఉపాధి చట్టాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఉపాధిహామీ పథకం కింద పని కల్పించకపోవడంతో రెక్కాడితేగానీ డొక్కాడని రైతులు, రైతు కూలీలు పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. ఇదీ మన జిల్లా గ్రామీణ చిత్రం..! సాక్షి ప్రతినిధి, తిరుపతి/బి.కొత్తకోట: జిల్లా లో పశ్చిమ మండలాలపై నైరుతి రుతుపవనాల ప్రభావం.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఏడాదికి జిల్లాలో 918.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ.. గత నాలుగేళ్లుగా వ్యవసాయాన్ని దుర్భిక్షం కాటేసింది. ఈ ఏడాది కోటి ఆశలతో ఖరీఫ్ పంటలను సాగుచేసిన రైతులను వరుణుడు చిన్నచూపు చూశాడు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 439.4 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 217.4 మీమీల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 38 శాతం తక్కువ నమోదైనట్లు స్పష్టమవుతోంది. నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఖరీఫ్‌లో 1.38 లక్షల హెక్టార్లలో సాగుచేసిన వేరుశెనగ పంట ఎండిపోయింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భజలమట్టం 17.68 మీటర్లకు పడిపోయింది. భూగర్భజలమట్టం పడిపోవడంతో 60 వేలకుపైగా బోరుబావులు ఎండిపోయాయి. అటు మెట్ట భూముల్లోనూ.. ఇటు బోరు బావుల కింద సాగుచేసిన ఆరు తడి పంటలు ఎండిపోవడంతో ఖరీఫ్ రైతులను నట్టేట ముంచింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల జిల్లాలో 395.4 మీమీల వర్షపాతం నమోదవ్వాలి. ఇప్పటికి 105.7 మిమీ. కురిసింది. నైరుతి, ఈశాన్య రుతపవనాల ప్రభావం వల్ల ఇప్పటికి 545.1 మిమీల వర్షం కురవాల్సి ఉండగా.. 317.5 మిమీలు కురిసింది. అంటే.. సాధారణ వర్షపాతం కన్నా 42 శాతం తక్కువ కురిసినట్లు స్పష్టమవుతోంది. వర్షపాతం.. పంటల పరిస్థితిని ఆధారంగా తీసుకుంటే జిల్లాలో 57 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్న ట్లు అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. ఖరీఫ్ పంట లు నష్టాల దిగుబడులను మిగల్చడంతో రబీ సాగు పై రైతులు ఆసక్తి చూపడం లేదు. రబీలో జిల్లాలో 59,970 హెక్టార్లలో పంటలు సాగుచేయాల్సి ఉండ గా.. ఇప్పటికి కేవలం 883 హెక్టార్లలోనే పంటలు సాగుచేయడమే అందుకు తార్కాణం. ఊళ్లకు ఊళ్లు ఖాళీ.. వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయం పడకేయడంతో పల్లెల్లో చేయడానికి పని దొరకని దుస్థితి నెలకొంది. రైతులే కూలీలుగా మారడంతో రైతు కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలతోపాటూ రైతులూ వలసబాట పట్టారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగ్‌పూర్ వంటి పట్టణాలకు వలస వెళ్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో రైతులు, రైతు కూలీలు వలస వెళ్లారు. కొందరైతే ముసలివాళ్లను, పిల్లలను ఇళ్లల్లో ఉంచి.. భార్యాభర్తలు ఇద్దరూ వలస వెళ్లారు. మరి కొందరైతే ఇంటికి తాళం వేసి.. కుటుంబం మొత్తం వలస వెళ్లారు. వలసలతో గ్రామాలన్నీ బోసిపోయాయి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఆలనాపాలనా లేక వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదీ ఉపాధి హామీ..? ఉన్న ఊళ్లో చేతినిండా పని కల్పించడం కోసం 2005లో కేంద్రం ఉపాధి చట్టాన్ని చేసింది. ఆ చట్టం అమల్లో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 2, 2006న ఉపాధిహామీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద 66 మండలాల్లోని 1,380 పంచాయతీల్లో 11,580 గ్రామాల్లోని 6.38 లక్షల మందికి జాబ్‌కార్డులు జారీ చేశారు. ఇందులో 5.07 లక్షల మంది సభ్యులతో శ్రమ శక్తి సంఘాలను ఏర్పాటుచేశారు. ఏడాదికి గరిష్టంగా వంద పని దినాలు కల్పించాలని నిర్ణయించారు. పని కల్పించమని అడిగిన వారంలోగా పని కల్పించకపోతే సంబంధిత జాబ్‌కార్డ్ లబ్ధిదారునికి పరిహారం చెల్లించేలా నిబంధన పెట్టారు. కానీ.. ఈ పథకాన్ని ప్రభుత్వం నిర్యీర్యం చేస్తోంది. అడిగిన తక్షణమే పని కల్పించకుండా.. వేతనాలు చెల్లించకుండా ఉపాధిహామీ పథకాన్ని నీరుగార్చుతున్నారు. ఉపాధిహామీ పథకం కింద పని చేసిన కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలు రూ.13 కోట్లకు చేరుకోవడమే అందుకు తార్కాణం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఒక్కో కుటుంబానికి సగటున 48.95 పని దినాలు కల్పించారు. వంద రోజులు పని దినాలు కేవలం 22,492 మందికి మాత్రమే కల్పించడం గమనార్హం. ఉపాధిహామీ కింద పని కల్పించకపోవడంతో రైతులు, రైతు కూలీలు కన్నతల్లి వంటి ఉన్న ఊళ్లను వదిలి వలస వెళ్తోండటం గమనార్హం. వంద రోజులు పని కల్పించలేని ప్రభుత్వం.. కరవు నేపథ్యంలో ఉపాధిహామీ పని దినాలను 150కి పెంచాలని ఇటీవల లేఖరాయడం కొసమెరుపు. పనిలేక ఖాళీగా ఉన్నాం మా ఊళ్లో వీరాంజనేయ, అమరేశ్వర గ్రూపుల్లో 27 మంది కూలీలు కరువు పనులకు వెళ్లేవాళ్లము. జూన్ నెల లో చెరువులో మట్టి పనులు చేసినాం. అప్పటి నుంచి పనుల్లేక ఇళ్లకాడ ఖాళీ గా ఉండాము. కరువు పనికి పోదామని ఉన్నా పనులు చేయమని చెప్పే వాళ్లే లేరు. ఆఫీసర్లు గూడా వచ్చి కరువు పనులు చేసుకోమని ఎవ రూ చెప్పలే. ఈసారి పంటలు పండకపోయా. ఇట్లే ఉంటే బెంగళూరుకు వెళ్లిపోవాల్సిందే. -వేమనారాయణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లి ఇంతవరకు బిల్లులేదు ఈ ఏడాది జూన్‌లో మా గ్రూపులోని 12 మంది కూలీలు కలసి కొత్తచెరువులో మట్టి తవ్వే పనికిపోయాం. పొలాలకు తోలిన 300 ట్రాక్టర్ల మట్టిని చల్లాం. సగం బిల్లులు మాత్రం ఇచ్చారు. ఇంకా రూ.20 వేలు ఇవ్వాలి. పోస్టాఫీసుకు పోతే మా అకౌంట్లో బిల్లులు పడలేదంటున్నారు. -రమణ, ఉపాధి కూలీ, గజ్జెలవారిపల్లె