ఎంసెట్-2 లీకేజీ ప్రభుత్వ వైఫల్యమే
►సీఎల్పీ నేత కె.జానారెడ్డి
నాగార్జునసాగర్: ప్రభుత్వం వైఫల్యంతోనే ఎంసెట్-2 పేపర్ లీకైందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి ఆరోపించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రభుత్వం క్షోభకు గురిచేస్తోందన్నారు. లీకేజీలో పాత్రధారులు, సూత్రధారులందరినీ కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.