ప్రత్యేక రైళ్ల పొడిగింపు | Special trains services extended in visakhapatnam and secunderabad | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

Published Tue, Jan 19 2016 11:13 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

ప్రత్యేక రైళ్ల పొడిగింపు

విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైళ్లు అదనపు ట్రిప్పులను పొడిగిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్  ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 
విశాఖపట్నం-తిరుపతి వీక్లీ ప్రత్యేక రైలు (08573) : ఫిబ్రవరి 1 నుంచి మార్చి 28 (సోమవారాలు) రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
 
తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక వీక్లీ రైలు(08574) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో  తిరుపతిలో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, రెండు థర్డ్ ఎ.సి కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్‌లు, ఆరు సెకండ్‌క్లాస్ సిట్టింగ్, రెండు సెకండ్ క్లాస్ కం లగే జ్ కోచ్‌లున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి.
 
విశాఖ నుంచి సికిందరాబాద్‌కు
విశాఖపట్నం-సికిందరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్(08501) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో విశాఖపట్నం నుంచి  రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది.

సికిందరాబాద్- విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08502) : ఫిబ్రవరి 3 మొదలు మార్చి 30వ తేదీల్లో (బుధవారాలు) సాయంత్రం 04.30 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, మూడు థర్డ్ ఎ.సి, పది స్లీపర్, ఆరు సెంకడ్‌క్లాస్ సిట్టింగ్ కోచ్, రెండు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కం లగేజ్ కోచ్‌లుండే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, కాజీపేట్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement