Waltair Division
-
విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వ్ జోన్(South Coast Railway Zone) ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం పోస్ట్ ఫ్యాక్టో (అప్పటికే మొదలుపెట్టిన పనికి) అమోదం తెలిపింది. ప్రధాని మోదీ(Narendra Modi) అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌పై చర్చించి ఆమోదం తెలిపారు. వాల్తేర్ డివిజన్ పేరును విశాఖపట్నం రైల్వే డివిజన్‌గా మార్చేందుకు కూడా కేంద్ర కేబినెట్(Union Cabinet) ఆమోదం తెలిపింది. గతంలో కుదించిన వాల్తేర్ డివిజన్‌ను కొనసాగించడం ద్వారా విశాఖపట్నం(Visakhapatnam ) వద్ద ప్రతిపాదిత సౌత్ కోస్ట్ రైల్వే జోన్ డివిజనల్ అధికార పరిధిని సవరించినట్లు మంత్రివర్గ సమావేశం అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు. వాల్తేర్ డివిజన్లో భాగమైన పలాస–విశాఖపట్నం– దువ్వాడ, కూనేరు – విజయనగరం, నౌపాడ జంక్షన్ – పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్– సాలూరు, సింహాచలం నార్త్ –దువ్వాడ బైపాస్, వడ్లపూడి – దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్ – జగ్గయపాలెం (సుమారు 410 కి.మీ) విభాగాలు సౌత్ కోస్ట్ రైల్వే కింద విశాఖ డివిజన్లో కొనసాగుతాయి. ఇప్పటివరకు వాల్తేర్ డివిజన్లో భాగమైన కొత్తవలస – బచేలి, కూనేరు – తేరువలి జంక్షన్, సింగాపుర్ రోడ్– కోరాపుట్, పర్లాకిమిడి – ఘన్పూర్ (సుమారు 680 కి.మీ) విభాగాలు ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో రాయగడ ప్రధాన కేంద్రంగా ఏర్పడుతున్న రాయగడ డివిజన్లో ఉంటాయి. -
ఏం సాధించారని కూటమి నేతల సంబరాలు: సీపీఎం
సాక్షి, విశాఖపట్నం: కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు. వాల్తేర్ డివిజన్‌ను రెండు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందన్నారు. 10,500 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని.. ఆదాయం వచ్చే కేకే లైన్ అంతా ఒరిస్సా పరిధిలో కలిసిపోతుందని సీపీఎం పేర్కొంది.అరకు అభివృద్ధికి ఒరిస్సా మీద ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏం సాధించారని కూటమి నేతలు సంబరాలు జరుపుకుంటున్నారంటూ సీపీఎం నేతలు మండిపడ్డారు. జోన్ ఏర్పాటులో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సీపీఎం తెలిపింది.కాగా, కేకే లైన్‌ను విశాఖ డివిజన్‌లోనే కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజరాణి వినతి పత్రం అందజేశారు. పార్లమెంట్ భవన్లో కేంద్ర మంత్రిని ఎంపీ మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలను వివరించారు.విశాఖ పర్యాటక భూభాగంలో అరకులోయ ఉందని.. కేకే లైన్‌ను విశాఖ రైల్వే డివిజన్లో ఉంచడం వల్ల అరకులోయ, కిరండూల్ రైల్వే లైన్లు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. తల్లిలాంటి వాల్తేరు డివిజన్ నుంచి కేకే లైన్‌ను వేరే చేయడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని వాపోయారు. రాయగడ డివిజన్లో కేకే లైన్‌ను విలీనం చేసే చర్యలను పునఃపరిశీలించాలని కేంద్ర మంత్రికి ఎంపీ విన్నవించారు. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
-
మరో ఘనత సాధించిన వాల్తేర్ డివిజన్
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): ఈస్ట్‌కోస్ట్‌రైల్వే, వాల్తేర్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ అనూప్‌కుమార్ సత్పతి నేతృత్వంలో నాన్ ఫేర్ రెవెన్యూ (ఎన్ఎఫ్ఆర్)ప్రాజెక్టులలో డివిజన్ మరో ఘనత సాధించింది. ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరుస్తూనే, నిర్వహణ, హౌస్ కీపింగ్ వ్యయాలను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో ఎన్ఎఫ్ఆర్ ద్వారా సరికొత్త పద్ధతులలో డివిజన్‌కు ఆదాయాన్ని ఆర్జించిపెట్టే పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా ముందుకు వెళుతోంది. దీనిలో భాగంగా మరో విభాగంలో ఈ ఎన్ఎఫ్ఆర్ ప్రాజెక్టును అమలు చేయనుంది. వాల్తేర్ డివిజన్, కమర్షియల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో వ్యాగన్ క్లీనింగ్‌ను పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెడుతోంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తిగల వ్యవస్థాపక సంస్థల నుంచి ఓపెన్ టెండర్లను ఇప్పటికే ఆహ్వానించింది. దీనికి మంచి స్పందన వచ్చింది. విశాఖపట్నం కాంప్లెక్స్‌లో గల గ్యారేజ్ అండ్ వ్యాగన్ పాయింట్స్ వద్ద వ్యాగన్స్ స్వీపింగ్, క్లీనింగ్ కు సంబంధించిన విభాగాలలో ఓపెన్ టెండర్ విధానాలను ఎన్ఎఫ్ఆర్ పద్ధతిలో ఖరారు చేయడం వాల్తేర్ డివిజన్ పరిధిలోమాత్రమే కాదు, ఈస్ట్‌కోస్ట్‌రైల్వే జోన్ పరిధిలో సైతం మొదటిదని సీనియర్ డీసీఎం తెలిపారు. దీని ద్వారా మూడేళ్లకు డివిజన్‌కు సుమారు ఆరుకోట్ల ఎన్ఎఫ్ఆర్ ఆదాయం లైసెన్స్ ఫీజు కింద సమకూరనుందని తెలిపారు. ఈ పనులకు గాను సుమారు ఏటా రూ.30లక్షలు ఖర్చు చేసినట్లు అయితే ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేకు ఏటా సుమారు రూ.2కోట్లు ఆదాయం రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇటువంటి ప్రాజెక్టు ద్వారా డివిజన్‌కు ఆదాయం సమకూరడం మాత్రమే గాక, హౌస్‌కీపింగ్, క్లీనింగ్ ఖర్చులను బాగా ఆదా చేస్తుందని ఈ సందర్భంగా డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి తెలిపారు. -
5 గంటల్లోనే సబ్వే నిర్మాణం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): వాల్తేర్ డివిజన్ రికార్డు సమయంలో మరో లిమిటెడ్ హైట్ సబ్వే (ఎల్హెచ్ఎస్) నిర్మాణం పూర్తి చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి చెప్పారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విజయనగరం–శ్రీకాకుళం రోడ్డు మెయిన్ లైన్లో సింగిల్ బ్లాక్, పవర్ బ్లాక్ తీసుకుని, పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికే ఎల్హెచ్ఎస్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కోరుకొండ–విజయనగరం, దూసి–పొందూరు సెక్షన్ల మధ్య కట్ అండ్ కవర్ పద్ధతిలో ఈ లిమిటెడ్ హైట్ సబ్‌వేల నిర్మాణం 5 గంటల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కో ఆర్డినేషన్) ప్రదీప్‌యాదవ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (ఈస్ట్) రాజీవ్‌కుమార్‌లు ఈ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయించినట్లు తెలిపారు. -
వాల్తేరు డివిజన్ రద్దు యోచన తగదు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో భాగమైన వాల్తేరు డివిజన్‌ను యాథావిధిగా కొనసాగించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో బుధవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న వాల్తేరు డివిజన్ భారతీయ రైల్వేలో అత్యధిక ఆదాయం ఆర్జిస్తున్న డివిజన్లలో అయిదో స్థానంలో ఉందన్నారు. ఈస్టుకోస్టు రైల్వేలో వాల్తేరు డివిజన్ ఆదాయం తూర్పు తీర రైల్వేలోనే మూడో అత్యధిక ఆదాయ వనరుగా మారిందని చెప్పారు. గణనీయంగా ఎదుగుతున్న వాల్తేరు డివిజన్‌ను మరింత ప్రోత్సహించాల్సింది పోయి.. వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి దక్షిణ కోస్తా రైల్వేజోన్‌లోని విజయవాడ డివిజన్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదన్నారు. ఈ తప్పిదం అనేక సమస్యలకు, అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. ఎక్కడో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ డివిజన్లో వాల్తేరు డివిజన్‌ను విలీనం చేయాలన్న ఆలోచన రైల్వే నిర్వహణ, విపత్తు యాజమాన్యానికి సంబంధించి అనేక సమస్యలకు దారి తీస్తుంది.. ప్రమాదాల సమయంలో త్వరగా స్పందించే సామర్థ ్యం తగ్గిపోయే అవకాశం ఉంది.. ప్రయాణికుల భద్రత, రైల్వే నిర్వహణ వంటి సున్నితమైన అంశాల నుంచి దృష్టి మరలే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విశాఖలో ఇప్పటికే పూర్తి స్థాయి డివిజన్ వ్యవస్థ పనిచేస్తోంది.. కార్గో టెర్మినల్స్, లోకో షెడ్, వ్యాగన్ వర్కుషాపుతోపాటు 2300 మంది సిబ్బందికి సరిపడా స్టాఫ్ క్వార్టర్లు ఉన్నాయి.. వాల్తేరు డివిజన్‌ను కొనసాగించడం వల్ల రైల్వేలపై అదనపు భారం ఏదీ ఉండదని వివరించారు. కాని వాల్తేరు డివిజన్‌ను తరలించడం వల్ల మౌలిక వసతుల ఏర్పాటు కోసం అదనపు ఖర్చులు భరించాల్సి వస్తుందన్నారు. ఒక డివిజన్‌ను రద్దు చేయడం రైల్వే చరిత్రలోనే లేదని, అలాంటిది 125 సంవత్సరాల చర్రిత కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేయాలని రైల్వే యాజమాన్యం భావిస్తే అది పెద్ద తప్పిందం అవుతుందని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను దెబ్బతిసినట్టు అవుతుందన్నారు. ఈ అంశాలను దృష్టికి ఉంచుకొని వాల్తేరు డివిజన్‌ను యాథావిధిగా కొనసాగించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఙప్తి చేశారు. -
పార్లమెంటు చట్టాన్ని గౌరవించండి: కొణతాల
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రం రెండుగా చీలిపోయాక ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామన్న రైల్వే జోన్, ప్రత్యేక హోదా హామీలను బీజేపీ నెరవేర్చాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్, మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ శుక్రవారం రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్‌ను కోరారు. ఆయన రైల్వే మంత్రికి రాసిన సుదీర్ఘ లేఖలో ప్రస్తుత బడ్జెట్లోనైనా విశాఖరైల్వే జోన్‌ను ప్రకటించాలని విన్నవించారు. పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత కూడా విశాఖ రైల్వే జోన్ అంశం కాగితాలకే పరిమితం కావడం బాధాకరమన్నారు. ఈ విషయమై మాజీ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకి రెండు సార్లు అర్జీ పెట్టుకున్నా.. ఫలితం లేకుంగా పోయిందని తెలిపారు. ‘ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లు, 2014 లోని షెడ్యూల్ 3 అవశేష ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులను కల్సిస్తామని తెలిపింది. దాంట్లో భాగంగానే ఆరు నెలల్లోగా కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న దక్షిణమధ్య రైల్వే జోన్ తెలంగాణకు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు రైల్వే జోన్ ఏర్పాటు అనివార్యం అయినందున వెంటనే స్పందించండి’ అని లేఖలో రామకృష్ణ పేర్కొన్నారు. హామీల అమలుకు దిక్కు లేదు.. రైల్వే జోన్ ఏర్పాటుకు అవసరమైన అన్ని మౌలికాంశాలు విశాఖపట్నం కలిగివుందని కొణతాల అన్నారు. 1052 కి.మీ. రైల్వే లైన్ వున్న ఆంధ్రప్రదేశ్‌కు దక్కాల్సిన రైల్వేజోన్ ఏర్పాటు కొన్ని రాజకీయ కారణాలతోనే జాప్యం అవుతోందని ఆయన విమర్శించారు. ఆదాయార్జనలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న వాల్తేర్ డివిజన్ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటం మరో విశేషమని అన్నారు. ఆర్థికాభివృద్ధి దిశగా సాగుతున్న దేశంలో న్యాయమైన తమ వంతు వాటాకోసం ఉత్తరాంధ్ర ప్రజానీకం కోరుకుంటోందని.. విశాఖ పట్నం హెడ్ క్వార్టర్స్‌గా రైల్వే జోన్ ఏర్పాటుతో వారి కలలను నిజం చేయాలని విఙ్ఞప్తి చేశారు. ఏపీ రీ-ఆర్గనైజేషన్ బిల్లులో రాష్ట్రం విడిపోయాక ఆరు నెలల కాలంలోనే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయమన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేజీ తన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా రైల్వే జోన్‌ను చేర్చారని గుర్తు చేశారు. పార్లమెంటు హామీలు కూడా అమలుకు నోచుకోకుంటే ప్రజాస్వామ్యంపై మాకు నమ్మకం పోతుందని నిరసన వెళ్లగక్కారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో చివరి ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఇంకా ఆలస్యం చేసి ప్రజల్లో ఉన్న అసహనాన్ని పెంచొద్దని హెచ్చరించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
విశాఖపట్నం : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే విశాఖ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ స్టేషన్లకు నడుస్తున్న ప్రత్యేక వీక్లీ రైళ్లు అదనపు ట్రిప్పులను పొడిగిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎల్వేందర్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం-తిరుపతి వీక్లీ ప్రత్యేక రైలు (08573) : ఫిబ్రవరి 1 నుంచి మార్చి 28 (సోమవారాలు) రాత్రి 10.55 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 01.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-విశాఖపట్నం ప్రత్యేక వీక్లీ రైలు(08574) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో తిరుపతిలో మధ్యాహ్నం 03.30 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, రెండు థర్డ్ ఎ.సి కోచ్‌లు, తొమ్మిది స్లీపర్ క్లాస్‌లు, ఆరు సెకండ్‌క్లాస్ సిట్టింగ్, రెండు సెకండ్ క్లాస్ కం లగే జ్ కోచ్‌లున్న ఈ జతరైళ్లు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లమీదుగా రాకపోకలు సాగిస్తాయి. విశాఖ నుంచి సికిందరాబాద్‌కు విశాఖపట్నం-సికిందరాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్(08501) : ఫిబ్రవరి 2 మొదలు మార్చి 29 (మంగళవారాలు) తేదీల్లో విశాఖపట్నం నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి ఆ మర్నాడు మధ్యాహ్నం 12 గంటలకు సికిందరాబాద్ చేరుకుంటుంది. సికిందరాబాద్- విశాఖ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (08502) : ఫిబ్రవరి 3 మొదలు మార్చి 30వ తేదీల్లో (బుధవారాలు) సాయంత్రం 04.30 గంటలకు సికిందరాబాద్‌లో బయలుదేరి ఆ మర్నాడు ఉదయం 06.50 గంటలకు విశాఖ చేరుకుంటుంది. ఒక సెకండ్‌క్లాస్ ఎ.సి, మూడు థర్డ్ ఎ.సి, పది స్లీపర్, ఆరు సెంకడ్క్లాస్ సిట్టింగ్ కోచ్, రెండు సెకండ్‌క్లాస్ సిట్టింగ్ కం లగేజ్ కోచ్‌లుండే ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, ఖమ్మం, వరంగ ల్, కాజీపేట్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి. -
'విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి'
-
'విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి'
విశాఖ : వాల్తేర్ రైల్వే డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా కేటాయించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పట్టనుంది. ఈనెల 24న డీఆర్ఎం కార్యాలయం వద్ద వైఎఆస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ వాల్తేర్ జోన్‌కు రావాల్సిన చాలా రైళ్లు ఒడిశాకు తరలిపోతున్నాయన్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కూడా విజయనగరం తరలించే యోచనలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా విశాఖ రైల్వేవైపు దృష్టి పెట్టకపోవడం సర్కారు వైఫల్యమేనన్నారు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు కావలసిన 750 ఎకరాల భూములు కూడా ఉన్నాయని, జోన్ ఏర్పాటుకు, ఉద్యోగుల భర్తీ, తెలుగు ప్రజల పట్ల కేంద్రం వివపక్ష చూపిస్తోందన్నారు. విశాఖ ప్లాట్‌ఫారంపై ప్రయాణికులకు కావల్సిన కనీస సదుపాయాలు కూడా లేవని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. Waltair Division, railway zone, ysrcp, gudiwada amarnath, వాల్తేర్ డివిజన్, ప్రత్యేక రైల్వేజోన్, వైఎస్ఆర్ సీపీ, గుడివాడ అమర్నాథ్