వాల్తేర్ రైల్వే డివిజన్ను ప్రత్యేక జోన్గా కేటాయించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పట్టనుంది.
విశాఖ : వాల్తేర్ రైల్వే డివిజన్ను ప్రత్యేక జోన్గా కేటాయించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన పట్టనుంది. ఈనెల 24న డీఆర్ఎం కార్యాలయం వద్ద వైఎఆస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు వైఎస్ఆర్ సీపీ నేత గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ వాల్తేర్ జోన్కు రావాల్సిన చాలా రైళ్లు ఒడిశాకు తరలిపోతున్నాయన్నారు. గోదావరి ఎక్స్ప్రెస్ను కూడా విజయనగరం తరలించే యోచనలో కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయినా విశాఖ రైల్వేవైపు దృష్టి పెట్టకపోవడం సర్కారు వైఫల్యమేనన్నారు. ప్రత్యేక జోన్ ఏర్పాటుకు కావలసిన 750 ఎకరాల భూములు కూడా ఉన్నాయని, జోన్ ఏర్పాటుకు, ఉద్యోగుల భర్తీ, తెలుగు ప్రజల పట్ల కేంద్రం వివపక్ష చూపిస్తోందన్నారు. విశాఖ ప్లాట్ఫారంపై ప్రయాణికులకు కావల్సిన కనీస సదుపాయాలు కూడా లేవని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Waltair Division, railway zone, ysrcp, gudiwada amarnath, వాల్తేర్ డివిజన్, ప్రత్యేక రైల్వేజోన్, వైఎస్ఆర్ సీపీ, గుడివాడ అమర్నాథ్