
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో భూములను కాపాడేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వెల్లడించారు.
ఇప్పటివరకు సుమారు రూ. 4 వేల కోట్ల విలువైన భూములు స్వాధీనం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. భూకబ్జాదారుల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని గుర్తు చేశారు. విశాఖ నడిబొడ్డున సైతం భూములను ఆక్రమించారని మండిపడ్డారు. ఈ భూకబ్జాలన్నీ చంద్రబాబు కనుసన్నల్లోనే టీడీపీ నేతల చేశారన్నారన్నారు. తప్పు చేసిన ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment