
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): వాల్తేర్ డివిజన్ రికార్డు సమయంలో మరో లిమిటెడ్ హైట్ సబ్‌వే (ఎల్‌హెచ్‌ఎస్) నిర్మాణం పూర్తి చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి చెప్పారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విజయనగరం–శ్రీకాకుళం రోడ్డు మెయిన్ లైన్‌లో సింగిల్ బ్లాక్, పవర్ బ్లాక్ తీసుకుని, పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికే ఎల్‌హెచ్‌ఎస్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు.
కోరుకొండ–విజయనగరం, దూసి–పొందూరు సెక్షన్ల మధ్య కట్ అండ్ కవర్ పద్ధతిలో ఈ లిమిటెడ్ హైట్ సబ్‌వేల నిర్మాణం 5 గంటల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. వాల్తేర్ డివిజన్ డీఆర్‌ఎం అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కో ఆర్డినేషన్) ప్రదీప్‌యాదవ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (ఈస్ట్) రాజీవ్‌కుమార్‌లు ఈ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment