East Coast Railways
-
వందేభారత్ రైలుపై రాళ్ల దాడి
భువనేశ్వర్: రూర్కెలా–పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మెరామండలి, బుద్ధపంక్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ రాళ్ల తాకిడికి దెబ్బతిందని తెలిపింది. -
హాట్సీట్లో రైల్వే ఉద్యోగి.. 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి..
భువనేశ్వర్: విశేష ప్రేక్షక ఆదరణ పొందుతున్న కౌన్ బేనాగా కరోడ్‌పతి రియాల్టీ షో కార్యక్రమంలో తూర్పుకోస్తా రైల్వే ఖుర్దారోడ్ మండలం సిబ్బంది కృష్ణదాస్ పాల్గొన్నారు. ఆయన ఖుర్దారోడ్ మండలంలో చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎదురుగా హాట్ సీట్లో కూర్చుని, 12 ప్రశ్నల వరకు చురుగ్గా సమాధానం చెప్పి, రూ.12 లక్షల 50 వేలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా విశ్వవిఖ్యాత జగన్నాథుని ప్రసాదం అమితాబ్ బచ్చన్‌కు అందజేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణదాస్ గెలుపు పట్ల తోటి సిబ్బంది ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. చదవండి: (పగ తీర్చుకున్నాడు.. కాటేసి చంపేసిన పామును.. మెడలో వేసుకుని..) -
5 గంటల్లోనే సబ్వే నిర్మాణం
తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): వాల్తేర్ డివిజన్ రికార్డు సమయంలో మరో లిమిటెడ్ హైట్ సబ్వే (ఎల్హెచ్ఎస్) నిర్మాణం పూర్తి చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి చెప్పారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ విజయనగరం–శ్రీకాకుళం రోడ్డు మెయిన్ లైన్లో సింగిల్ బ్లాక్, పవర్ బ్లాక్ తీసుకుని, పక్కా ప్రణాళికతో అనుకున్న సమయానికే ఎల్హెచ్ఎస్ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కోరుకొండ–విజయనగరం, దూసి–పొందూరు సెక్షన్ల మధ్య కట్ అండ్ కవర్ పద్ధతిలో ఈ లిమిటెడ్ హైట్ సబ్‌వేల నిర్మాణం 5 గంటల్లోనే పూర్తి చేసినట్లు వివరించారు. వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం అనూప్‌కుమార్ సత్పతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కో ఆర్డినేషన్) ప్రదీప్‌యాదవ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (ఈస్ట్) రాజీవ్‌కుమార్‌లు ఈ ప్రాంతాల్లో పనులను పూర్తి చేయించినట్లు తెలిపారు. -
వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు: ఈస్ట్ కోస్ట్ రైల్వే
పైలిన్ తుపాన్‌తో ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా రాష్ట్రంలోని కోస్తా తీరంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ- ఒడిశాల మధ్య పలు రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అలాగే వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రైలు నెంబర్ 18517 కోర్బా ఎక్స్‌ప్రెస్, 22879: విశాఖ ఎక్స్‌ప్రెస్, 08637: భువనేశ్వర్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్, 18448: సంత్రగచ్చి - చెన్నై ఎక్స్‌ప్రెస్, 12375:జగదల్పూర్ - భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. -
పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు:ఈస్ట్ కోస్ట్ రైల్వే
ఫై-లిన్ తుఫాన్ కారణంగా ఈ రోజు పలు ప్యాసీంజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శుక్రవారం విశాఖపట్నంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. రైల్ నెం: 78532 విశాఖపట్నం - పలాస, 67292 విశాఖపట్నం - విజయనగరం ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు తెలిపింది. అలాగే రేపు 78531 పలాస-విశాఖపట్నం, 58418 /58417 గున్పూర్-పూరీ-గున్పూర్, 58419పలాస-గుణ్‌పూర్, 58526 / 58525 విశాఖపట్నం - పలాస -విశాఖపట్నం, 67291 విజయనగరం-పలాస, 67294 / 67293 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది.