=గుండెల్లో రైళ్లు
=భారీ వర్షాలతో అధికారుల్లో భయంభయం
=శనివారం మూడు రైళ్లు రద్దు, ఏడు దారిమళ్లింపు
=రూ.5కోట్లకుపైగా నష్టం
సాక్షి, విశాఖపట్నం: తూర్పుకోస్తా రైల్వేకు వరుస వర్షాలతో దడపట్టుకుంది. పలాస-ఖుర్దా మార్గంలో పట్టాలపై నీళ్లు ప్రవహిస్తుండడంతో ఏంచేయాలో పాలుపోక కంగారుపడుతోంది. విశాఖ నుంచి ఒడిషా, కోల్‌కతా మార్గంలో రాకపోకలు సాగించే రైళ్లలో అసలు ఏవి రద్దుచేయాలి? వేటిని నడపాలనేదానిపై స్పష్టత లేక తలబాదుకుంటోంది. శుక్రవారం మొత్తం 11 రైళ్లు రద్దుచేసిన అధికారులు శనివారం తాత్కాలికంగా మరో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేశారు. పరిస్థితినిబట్టీ ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
విశాఖ నుంచి సికింద్రాబాద్, చైన్నై ఇతర మార్గాల్లో వెళ్లే రైళ్లను కూడా రద్దుచేశారు. పూరి-తిరుపతి మధ్య పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోపక్క శనివారం వాతావరణ పరిస్థితులు అనుకూలించినా, లేకపోయినా పట్టాలపై నీటిఉధృతి తగ్గని నేపథ్యంలో మరికొన్ని రైళ్లు రద్దుచేయాలని అధికారులు భావిస్తున్నారు. మరో మూడురోజుల వరకు విశాఖ నుంచి ఒడిషా-కోల్‌కతా వైపు, విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వైపు వెళ్లే బళ్లలో కొన్ని రద్దు, మరికొన్ని దారి మళ్లించే యోచన చేస్తున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి అర్థరాత్రి సమయం వరకు రద్దైన రైళ్లు ఇవే..
17479 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్, 58526 విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ ,184 96 భువనేశ్వర్-రామేశ్వరం ఎక్స్‌ప్రెస్,22883 పూరీ-యశ్వంత్‌పూర్ వీక్లీ గరీభ్ రథ్ ఎక్స్‌ప్రెస్,22817 హౌరా-మైసూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, 02728 సికింద్రాబాద్-విశాఖపట్నం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలు ,18447,18437 భువనేశ్వర్-జగదల్‌పూర్/భవానీపట్న ఎక్స్‌ప్రెస్, 18448,18438 జగదల్‌పూర్/భవానీపట్న-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, 11020 భువనేశ్వర్-ముంబాయి సీఎస్‌టీ కోణార్క్ ఎక్స్‌ప్రెస్,12839 హౌరా-చెన్నై సెంట్రల్‌మెయిల్,58301 సంబల్‌పూర్-కోరాపుట్ ప్యాసింజర్, 58302 కోరాపుట్-సంబల్‌పూర్ ప్యాసింజర్. ఇవికాకుండా 18402 ఓఖా-పూరీ ఎక్స్‌ప్రెస్ ఖల్లికోట్‌కు 17016 సికిందరాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ పలాసకు శుక్రవారం వరకు కుదించారు.17015 విశాఖ ఎక్స్‌ప్రెస్ పలాస నుంచి సికిందరాబాద్ వెళుతుంది.
రైళ్ల రీషెడ్యూల్
12842 చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్ చెన్నైలో శుక్రవారం రాత్రి 10.20కి బయలుదేరగా, 13 గంటల 35నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది.12703 హౌరా-సికిందరాబాద్ ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్ హౌరాలో శుక్రవారం ఉదయం 7.25 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది. 17016 సికిందరాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బదులుగా రాత్రి 9 గంటలకు, 22850 సికిందరాబాద్-షాలిమర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఉదయం 5.30 గంటలకు బదులు సాయంత్రం 4.50 గంటలకు బయలుదేరింది. ఈ రైళ్లన్నీ బల్‌హర్షా,నాగ్‌పూర్,జార్సుగుడ,కాగజ్‌పూర్‌ల మీదుగా పంపారు.
15902 దిబ్రుఘర్-యశ్వంత్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు బదులు శనివారం ఉదయం 7.30 గంటలకు బయలు దేరనుంది. ఇవికాకుండా 22881 పూనే-భువనేశ్వర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ , 22603 ఖరగ్‌పూర్-విల్లుపురం ఎక్స్‌ప్రెస్ ,12704 సికింద్రాబాద్ -హౌరా ఫలక్‌నామా -హౌరా ఎక్స్‌ప్రెస్, 12509 బెంగుళూర్-గువహతి ఎక్స్‌ప్రెస్,12863 హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ని జార్సుగుడ, ,12508 గువహతి-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్ ,16310 పాట్నా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌లను పలుమార్గాలద్వారా మళ్లించారు.