సాక్షి, హైదరాబాద్ : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం నగరాలకు చేరుకోనున్నాయి.
అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment