civils preliminary exam
-
సివిల్స్– 2021 ప్రిలిమ్స్ పరీక్ష.. ఈ నాలుగు సక్సెస్‌కు కీలకం
సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష... ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ సహా 19 ఉన్నత స్థాయి సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియలో తొలిదశ! ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపితే.. సివిల్స్‌లో విజయం దిశగా మొదటి అడుగు పడినట్లే! ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది వరకూ దరఖాస్తు చేసుకున్నారని అంచనా! ఇంతటి తీవ్ర పోటీ నెలకొన్న సివిల్స్ ప్రిలిమ్స్‌లో గట్టెక్కి.. మలిదశ మెయిన్‌కు ఎంపికయ్యేందుకు అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 పరీక్ష.. అక్టోబర్ 10న జరుగనుంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులు అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు, ఫోకస్ చేయాల్సిన అంశాలపై ప్రత్యేక కథనం... సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష.. అక్టోబర్ 10వ తేదీన జరగనుంది. అంటే.. అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయం 33 రోజులు మా త్రమే. ప్రిలిమ్స్ అనే మైలురాయిని దాటేందుకు ఈ సమయం ఎంతో కీలకం. సివిల్స్ అభ్యర్థులు ఈ అమూల్యమైన సమయంలో ముఖ్యంగా నాలుగు విజయ సూత్రాలు పాటించాలి అంటున్నారు నిపు ణులు. అవి..విశ్లేషణాత్మక అధ్యయనం, పునశ్చరణ, సమయ పాలన, ప్రాక్టీస్. ఈ నాలుగు సూత్రాలు పక్కాగా అమలు చేస్తే..ప్రిలిమ్స్‌లో విజయావకా శాలు మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు. సమయ పాలన ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో అభ్యర్థులకు టైం మేనేజ్మెంట్ చాలా అవసరం. జనరల్ స్టడీస్ పేపర్లో పేర్కొన్న ఏడు విభాగాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలించి.. దానికి అనుగుణంగా ప్రతి సబ్జెక్ట్‌ను నిత్యం చదివేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతి రోజు కనీసం ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దీంతోపాటు ప్రతి వారం అధ్యయనం పూర్తిచేసిన టాపిక్స్‌పై సెల్ఫ్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాయాలి. తద్వారా ఆయా అంశాలపై తమకు లభించిన అవగాహనను విశ్లేషించుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన కూడా లాభిస్తుంది. కరెంట్ అఫైర్స్‌తో కలిపి సిలబస్‌లో పేర్కొన్న కోర్ టాపిక్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవాలి. ఎందు కంటే.. ఇటీవల కాలంలో ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు.. కరెంట్ అఫైర్స్ సమ్మిళితంగా అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు 2020 జూలై నుంచి 2021 జూలై వరకూ జరిగిన.. ముఖ్యమైన కరెంట్ ఈవెంట్స్‌పై దృష్టిపెట్టాలి. వాటిని సంబంధిత సబ్జెక్ట్ అంశాలతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. సంఘటనల నేపథ్యం, ప్రభావం, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అంచనా.. వంటి అంశాలను విశ్లేషించుకుంటూ చదవడం చాలా అవసరం. అనుసంధానం చేసుకుంటూ ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో భాగంగా అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లను ఇతర సబ్జెక్ట్లతో అనుసంధానం చేసు కుంటూ చదవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ–పాలిటీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా ఎంతో విలువైన సమయం కలిసొస్తుంది. ఇలా మిగిలిన సమయంలో తాము క్లిష్టంగా భావించే.. ఇతర ముఖ్య టాపిక్స్‌పై దృష్టిపెట్టొచ్చు. ముఖ్యాంశాల గుర్తింపు ప్రస్తుతం సమయంలో..అభ్యర్థులు సబ్జెక్ట్ వారీగా ముఖ్యాంశాలను గుర్తించాలి. అందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్న పత్రాలను పరిశీలించాలి. వాటిల్లో సబ్జెక్టుల వారీగా ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధా న్యం లభించిందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్రలో.. సాంస్కృతిక చరిత్ర, రాజ్య వంశాలు వంటి వి. అలాగే ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో గత ఏడాది కాలంలో సంభవించిన ముఖ్యమైన పరిణామాలపై దృష్టి సారించాలి. ప్రధానంగా కరోనా పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంపై చూపిన ప్రభావం, వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలు ముఖ్యమైనవిగా గుర్తించాలి. అదే విధంగా..ఆయా దేశాల మధ్య ఒప్పందాలు–వాటి ఉద్దేశం–అంతర్జాతీయంగా, జాతీయంగా వాటి ప్రభావం తదితర అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి. కొత్త అంశాలు చదవాలా విస్తృతమైన సివిల్స్ సిలబస్ ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు కొన్ని టాపిక్స్‌ను వదిలేస్తుంటారు. అలా విస్మరించిన అంశాలను ఇప్పుడు చదవడం సరైందేనా.. అనే సందేహాన్ని చాలామంది అభ్య ర్థులు వ్యక్తం చేస్తుంటారు. గతంలో చదవకుండా వదిలేసిన టాపిక్స్‌లో కొరుకుడు పడని అంశాలుం టే.. అనవసర ఆందోళనకు దారితీస్తుంది. కాబట్టి విస్మరించిన అంశాలను ఇప్పుడు కొత్తగా చదవడం సరికాదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే పట్టు బిగించిన వాటినే మరింత లోతుగా అధ్యయనం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ కొత్త అంశాలను చదవాల్సిన పరిస్థితి ఏర్పడితే.. కాన్సెప్ట్లపై అవగాహన పొందితే సరిపోతుంది. పేపర్–2కు కూడా సమయం అభ్యర్థులు పేపర్–2(సీశాట్)కు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. దీన్ని అర్హత పేపర్‌గానే పేర్కొ న్నప్పటికీ.. ఇందులో 33 శాతం మార్కులు సాధి స్తేనే.. పేపర్–1 మూల్యాంకన చేస్తారు. దాని ఆధా రంగానే మెయిన్‌కు ఎంపిక చేస్తారు. పేపర్–2లో అర్హత మార్కులు సాధించేందుకు ప్రధానంగా మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి. రెండుసార్లు రివిజన్ సిలబస్ అంశాల ప్రిపరేషన్ సెప్టెంబర్ చివరికల్లా పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి రోజూ కొంత సమయం రివిజన్‌కు కేటాయిస్తూ.. ప్రతి సబ్జెక్ట్‌ను కనీసం రెండుసార్లు పునశ్చరణ చేయాలి. రివిజన్‌కు ఉపకరించేలా ప్రిపరేషన్ సమయంలోనే ఎప్పటికప్పుడు షార్ట్‌నోట్స్ రాసుకోవాలి. మెమొరీ టిప్స్ ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు మెమొరీ టిప్స్ సాధన చేయాలి. పాయింటర్స్, ఫ్లో చార్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, అన్వయించుకోవడం వంటి వాటి ద్వారా మెమొరీ పెంచుకోవాలి. ఇలా ప్రతి విష యంలో నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే.. ప్రిలి మ్స్‌లో విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు. సబ్జెక్ట్ వారీగా ఇలా కరెంట్ అఫైర్స్: కరోనా పరిణామాలు, అభివృద్ధి కారకాలపై చూపుతున్న ప్రభావం; గత ఏడాది కాలంలో ఆర్థిక ప్రగతికి సంబంధించిన గణాం కాలు; ముఖ్యమైన నియామకాలు; అంతర్జా తీయంగా పలు సంస్థల నివేదికల్లో భారత్‌కు సంబంధించిన గణాంకాలు. చరిత్ర: ఆధునిక భారత చరిత్ర; జాతీయోద్యమం; ప్రాచీన, మధ్యయుగ భారత చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక–ఆర్థిక చారిత్రక అంశాలు. ఆధునిక చరిత్రలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన–పరిపాలన విధానాలు; బ్రిటిష్‌కు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లు–ఉద్యమాలు,సంస్కరణోద్యమాలు. ముఖ్యంగా స్వాతంత్య్ర పోరాటం. పాలిటీ: రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాం గ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు–వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు. రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్థ సమాఖ్య, రాష్ట్రపతి,గవర్నర్, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు,అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్ వంటి వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు. పంచాయతీరాజ్ వ్యవస్థ: బల్వంత్రాయ్, అశోక్‌మెహతా, హన్మంతరావ్, జి.వి.కె.రావ్, సింఘ్వీ కమిటీల సిఫార్సులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రభుత్వ విధానాలు: విధానాల రూపకల్పన జరిగే తీరు; విధానాల అమలు, వాటి సమీక్ష; ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు; కేంద్ర–రాష్ట్ర సంబంధాలు; గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత. ఎకానమీ: ఆర్థికాభివృద్ధిలో సహజ వనరులు– మూలధన వనరుల పాత్ర. ► ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి(ముఖ్యంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం వంటివి). ► ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ► పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం ► పంచవర్ష ప్రణాళికలు–ప్రణాళిక రచన–వనరుల కేటాయింపు–10, 11 పంచవర్ష ప్రణాళికలు ► బ్యాంకింగ్ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీ వల కాలంలో బ్యాంకింగ్ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం; ► తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు. సైన్స్ అండ్ టెక్నాలజీ: గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు; ఇటీవల కాలంలో సంక్రమిస్తున్న వ్యాధులు–కారకాలు; సైబర్ సెక్యూరిటీ యాక్ట్; రక్షణ రంగంలో కొత్త మిస్సైల్స్ ప్రయోగాలు; ముఖ్యమైన వన్యమృగ సంరక్షణ కేంద్రాలు–పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు; వివిధ ఐటీ పాలసీలు. జాగ్రఫీ: జనగణనకు సంబంధించిన ముఖ్యాంశాలు; అత్యధిక, అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రాలు; అత్యధిక, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాలు; స్త్రీ, పురుష నిష్పత్తి; స్త్రీ, పురుష అక్షరాస్యత శాతం; గత పదేళ్లలో జనన, మరణ రేట్లు. పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు. ► సౌర వ్యవస్థ, భూమి అంతర్ నిర్మాణం, శిలలు, జియలాజికల్ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు. ► మన దేశంలో నగరీకరణ; రుతుపవనాలు, నదులు; జలాల పంపిణీ; వివాదాలు. సివిల్స్ ప్రిలిమ్స్–2021 ముఖ్యాంశాలు ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 712 ► ప్రిలిమినరీ పరీక్ష తేది: అక్టోబర్ 10, 2021 ► రెండు పేపర్లు.. 400 మార్కులకు పరీక్ష (ఒక్కో పేపర్‌కు 200 మార్కులు). ► ప్రిలిమ్స్‌లో ప్రతిభ ఆధారంగా 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మలి దశ మెయిన్‌కు ఎంపిక ► తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు. -
కరోనా ఎఫెక్ట్: సివిల్స్ ప్రిలిమ్స్ వాయిదా
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు వాయిదా పడ్డాయి. దేశంలో కరోనా విజృంభిస్తున్న కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. యూపీఎస్సీ ప్రకటించిన విధంగా జూన్ 27న ప్రిలిమినరీ పరీక్షలు జరగాల్సి ఉండగా, కరోనా కారంణంగా ఆక్టోబర్ 10న నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్‌తో పాటు ఇతర కేంద్ర సర్వీసులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడు దశల్లో పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ( చదవండి: అగ్రి స్టార్టప్స్.. దున్నేస్తున్నాయ్! ) UPSC postpones June 27 civil services preliminary examination amid surge in COVID-19 cases; to be held on October 10 — Press Trust of India (@PTI_News) May 13, 2021 -
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
-
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం
హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష జరుగనుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తోంది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. వీటిని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. (50 రూపాయలకే ఎమ్ఆర్ఐ స్కాన్) తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మొత్తం 115 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలలో 46,171 మంది పరీక్ష రాయనున్నారని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల కో–ఆర్డినేటింగ్ సూపర్వైజర్ శ్వేతా మహంతి తెలిపారు. అలాగే వరంగల్‌లోని 16 కేంద్రాలలో 6,763 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల నిర్వహణ కోసం హైదరాబాద్‌లో వెన్యూ సూపర్ వైజర్లతో పాటు 99 లోకల్ ఇన్స్పెక్షన్ అధికారులు, 34 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. -
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్ : రేపు(ఆదివారం) జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా ఈసారి రాష్ట్రం నుంచి 46,171 మంది సివిల్స్ పరీక్షలు రాయనున్నారు. అందుకు హైదరాబాద్‌లో 99 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సివిల్స్ పరీక్ష రాయనున్న అభ్యర్థులను గంట ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. సివిల్స్ పరీక్ష రెండు సెషన్స్ లో జరగనుంది. కాగా మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 4. 30 వరకు రెండవ సెషన్లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని.. అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తెచ్చుకోవాలని అధికారులు తెలిపారు. అభ్యర్థులంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేశారు. కాగా హైదరాబాద్‌లో జరగనున్న సివిల్స్ పరీక్షా కేంద్రాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. -
రూ.50కోట్లు ఖర్చు చేశాం.. వాయిదా కుదరదు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలు వాయిదా వేయాల్సిందిగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం కోర్టు విచారణ జరిపింది. పిటిషన్‌దారు యూపీఎస్సీ నుంచి రిలాక్సేషన్ కోరినట్లయితే.. అది మర్యదపూర్వకంగా.. ఒప్పించేదిగా ఉండాలని సూచించింది. యూపీఎస్సీ బోర్టు పరీక్షలు నిర్వహించడానికే మొగ్గు చూపుతుందని కోర్టు స్పష్టం చేసింది. అభ్యర్థుల రవాణాకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని యూపీఎస్సీ ఇప్పటికే రాష్ట్రాలను కోరిందని కోర్టు తెలిపింది. కరోనా నేపథ్యంలో అసాధారణ పరిస్థితులు తలెత్తాయని.. పరీక్షలు వాయిదా వేయాలని పిటిషనర్లు వాదించారు. (చదవండి: యూపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేక రైలు) అయితే ఇప్పటికే పరీక్ష నిర్వహణ కోసం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని..సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని యూపీఎస్సీ మరోసారి స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీనే పరీక్ష జరుగుతుందని తెలిపింది. ఈమేరకు యూపీఎస్సీ అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇప్పుడు పరీక్షలు వాయిదా వేస్తే ఆ ప్రభావం వచ్చ ఏడాది జూన్ 27న జరిగే పరీక్షపై పడుతుందని పేర్కొంది. -
సివిల్స్ పరీక్షకు ప్రత్యేక రైళ్లు..
సాక్షి, హైదరాబాద్ : సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే విద్యార్థుల కోసం ఓడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అక్టోబర్ 4 తేదీన పరీక్ష నిర్వహిస్తుండటంతో ముందు రోజు ఈ రైళ్లు నడిపేందుకు శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 3 న బెర్హాంపూర్, కియోంజార్, ఖరియార్ రోడ్, ఇచ్ఛాపురం నుంచి సాయంత్రం 4 గంటలకు, కోరాపుట్ నుంచి ఉదయం 5 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరనున్నాయి. కాగా ఈ రైళ్లు అదే రోజు సాయంత్రం నగరాలకు చేరుకోనున్నాయి. అభ్యర్థులను తీసుకెళ్లేందుకు కోరాపుట్-కటక్, కోరాపుట్-విశాఖపట్నం, రూర్కెలా- కటక్, జారుసగూడ, బారిపాడ-కటక్ మరియు విజయవాడ- విశాఖపట్నం మధ్య పరీక్షా ప్రత్యేక రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే నడుపుతుంది. కాగా మే 31న జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్ష కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
సివిల్స్ నోటిఫికేషన్ జారీ
న్యూఢిల్లీ: ఈ సంవత్సరం(2020) సివిల్ సర్వీసెస్ పరీక్ష రాస్తున్న జమ్మూకశ్మీర్ యువతకు గరిష్ట వయోపరిమితి విషయంలో మినహాయింపు ఇవ్వడం లేదు. గత సంవత్సరం 1980–89 మధ్య అప్పటి జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో శాశ్వత నివాసులైన సివిల్స్ అభ్యర్థులకు ఐదేళ్ల గరిష్ట వయోపరిమితిని 32 ఏళ్ల నుంచి ఐదేళ్ల పాటు పెంచారు. తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్లో ఆ సడలింపును ఎత్తేశారు. 796 ఖాళీలతో 2020 సంవత్సర సివిల్స్ పరీక్షల నోటిఫికేషన్‌ను బుధవారం యూపీఎస్సీ జారీ చేసింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఐదేళ్లు, ఇతర వెనకబడిన వర్గాల వారికి మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి మార్చి 3 ఆఖరి తేది. పరీక్షకు మూడు వారాలు ముందు అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ చేస్తారు. మరిన్ని వివరాలకు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ https://upsconline.nic.in/ చూడొచ్చు. -
జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ ఈ ఏడాది జూన్2న నిర్వహించనుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల్లో 896 పోస్టుల భర్తీల కోసం ప్రిలిమ్స్ పరీక్షను చేపడుతున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేటాయించిన 10శాతం రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్‌కూ వర్తింపజేస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. 896 ఖాళీల్లో అంధులు, యాసిడ్ దాడి బాధితులు తదితర వికలాంగులకోసం 39 పోస్టులు రిజర్వ్‌చేశారు. మార్చి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోపు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్స్ పరీక్షను ఏటా మూడు దశల్లో( ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) కేంద్రం నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు ఆరు అటెంమ్ట్లను మాత్రమే అనుమతిస్తారు. 1987 ఆగస్ట్2లోపు, 1998 ఆగస్ట్ ఒకటికి ముందు జన్మించిన వారు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అంటే దరఖాస్తు చేయడానికి కనీస వయసు 21ఏళ్లు. అలాగే, 32 సంవత్సరాలు నిండనివారు కూడా అర్హులేనని నోటిఫికేషన్ పేర్కొంది. -
వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు
► నగరంలో 23 సెంటర్ల ఏర్పాటు ► విద్యా కేంద్రం వరంగల్‌కు అరుదైన గుర్తింపు వరంగల్ : విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను తొలిసారిగా వరంగల్‌లో నిర్వహించారు. సివిల్స్ పరీక్షకు 10, 858 మంది అప్లై చేసుకోగా 4264 మంది ఉదయం పేపర్ -1 పరీక్షకు హాజరయ్యారు. 6594 మంది గైర్హాజయ్యారు. ఉదయం హాజరు శాతం 39.27 ఉండగా మధ్యాహ్నం 38.83 శాతానికి పడిపోయింది. మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 4216 మంది హాజరుకాగా, 6642 మంది గైర్హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించగా, తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే పరీక్ష జరిగింది. వరంగల్ జిల్లాలో పరీక్ష నిర్వహణకు 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడేలా ఈ ఏడాది వరంగల్ లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
రేపు సివిల్స్ ప్రిలిమినరీ
జిల్లాలో తొలిసారి పరీక్ష నిర్వహణ 23 సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 10,585 మంది అభ్యర్థులు విద్యా కేంద్రం వరంగల్‌కు అరుదైన గుర్తింపు సాక్షిప్రతినిధి, వరంగల్ :విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఇక నుంచి వరంగల్లోనూ జరగనుంది. ఆదివారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ పరీక్ష నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుంది. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే పరీక్ష కేంద్రం ఉంది. మన జిల్లాలో పరీక్ష నిర్వహణకు 23 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 10,585 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.10 వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్–2016 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 27న యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. రైల్వే, రోడ్డు రవాణా పరంగా వరంగల్‌కు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వరంగల్ రవాణా పరంగా అనుసంధానంగా ఉంటుంది. ఈ కారణాలతో సివిల్స్ పరీక్షకు వరంగల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది. -
సివిల్స్‌కు దరఖాస్తులు షురూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ప్రారంభమయింది. ఈ సారి అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లలో ఏదానికైనా లేదా రెండింటికైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 2011లో జరిగిన పరీక్షతో నిర్ణీత అవకాశాలు పూర్తయిన వారికి ఈసారి మరో అవకాశం ఇస్తున్నట్లు వివరించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. ‘అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో www.upsconline.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ మే 23న ప్రారంభమై జూన్19నాటికి ముగియనుంది.