సివిల్స్‌కు దరఖాస్తులు షురూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ప్రారంభమయింది. ఈ సారి అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లలో ఏదానికైనా లేదా రెండింటికైనా ఆప్షన్‌లు ఇచ్చుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 2011లో జరిగిన పరీక్షతో నిర్ణీత అవకాశాలు పూర్తయిన వారికి ఈసారి మరో అవకాశం ఇస్తున్నట్లు వివరించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించనున్నారు.
‘అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో www.upsconline.nic.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ మే 23న ప్రారంభమై జూన్19నాటికి ముగియనుంది.