Preliminary exam
-
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఫలితాల కోసం క్లిక్ చేయండిఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం. -
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 74% హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌సర్విస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 3.02లక్షల మంది మాత్రమే హాజరైనట్టు టీజీపీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే లెక్కల తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష కీ అతి త్వరలో కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.సులభతరంగా ప్రశ్నలు... ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సులభతరంగా ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ మొదటిసారిగా చేపడుతోంది. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాల వల్ల వాటిని కమిషన్ రద్దు చేసింది. గత ప్రశ్నపత్రంతో పోలిస్తే తాజాగా వచ్చిన ప్రశ్నలు సులభంగా, కొన్ని అత్యంత సులభంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం లేకపోలేదు. మధ్యలో బయోమెట్రిక్ హాజరు స్వీకరణ పరీక్ష ఉదయం 10.30గంల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. పరీక్షకు హాజరయ్యే అభర్థులు కనీసం గంట ముందు రావాలని, బయోమెట్రిక్ హాజరు స్వీకరణ ఉంటుందని కమిషన్ తెలిపింది. పరీక్షకు ముందు లేదా పరీక్ష తర్వాత హాజరు స్వీకరణ చేపట్టాల్సి ఉండగా, చాలాచోట్ల అధికారులు పరీక్షకు మధ్యలో బయోమెట్రిక్ హాజరు స్వీకరించారు.సరిగ్గా ప్రశ్నలు చదివి జవాబులు ఇచ్చే సమయంలో బయోమెట్రిక్ హాజరు స్వీకరణ ప్రక్రియ చిర్రెత్తించిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరీక్షకేంద్రాలకు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లోని చాలా పరీక్ష కేంద్రాలు ప్రధానరహదారికి లోపలికి ఉండడం..ఆదివారం కావడంతో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు సైతం దొరక్క అవస్థలు పడినట్టు వాపోయారు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలన టీజీపీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ యూనిట్(సీసీకెమెరా) ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించినట్టు నవీన్ నికోలస్ తెలిపారు. పరీక్ష పక్కాగా నిర్వహించామని, నిర్వహణలో కీలకపాత్ర పోషించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషన్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మద్యంమత్తులో గ్రూప్–1 విధులకు..- కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగి నిర్వాకం తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించే అన్వర్ మీర్జా పర్వేజ్‌బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల బీ–వింగ్‌లో గ్రూప్–1 పరీక్ష విధులు కేటాయించారు. మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది ఎల్ఎండీ ఎస్సైకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చేరాలు పరీక్షకేంద్రం వద్దకు వెళ్లి అన్వర్ మీర్జాను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. రీడింగ్ 173 వచ్చింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. -
ముగిసిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి 1గం. దాకా పరీక్ష జరిగింది. ఒక్క నిమిషం నిబంధనతో చాలామంది పరీక్ష రాలేకపోయారు. పది గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా.. ఆ అభ్యర్థుల్ని నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. దీంతో చాలామంది నిరాశతో వెనుదిరిగారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. గతంలో రెండు సార్లు రద్దు అయిన ఈ పరీక్షను ఎట్టకేలకు ఇవాళ నిర్వహించారు. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉండగా.. ఎంతమంది హాజరయ్యానే దానిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. జగిత్యాలలో అభ్యర్థుల ఆందోళనజగిత్యాల పట్టణంలో గ్రూప్-1 పరీక్షా కేంద్రం ముందు అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అరగంట టైం ఉన్నా కూడా 5 నిమిషాలు మాత్రమే ఉందని ఇన్విజిలేటర్ చెప్పారని, టైం అయిపోయిందని చెప్పడంతో తొందరలో ఆన్సర్ చేశామని ఆవేదన చెందారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు అభ్యర్థులకు సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఆర్టీసీ ప్రత్యేక బస్సులు గ్రూప్–1 ప్రిలిమ్స్ అభ్యర్థుల సౌకర్యార్థం ఆర్టీసీ ఆదివారం ప్రత్యేక బస్సులు నడిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 897 పరీక్ష కేంద్రాలకు బస్సులను నడపాల ని అధికారులను యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నుంచి జిల్లాలకు శనివారం సాయంత్రం నుంచే ఎంజీబీఎస్, జేబీ ఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్లనుంచి బస్సు సర్వీసులు నడిపింది. రెండుసార్లు రద్దు.. కమిషన్ తొలిసారిగా 2022 ఏప్రిల్‌లో గూప్–1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్ పరీక్షలకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ పరీక్షను కమిషన్ రద్దు చేసింది. ఆ తర్వాత గతేడాది జూన్ 11న రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా నిర్వహణ ప్రక్రియలో లోపాలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో ఆ పరీక్షను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కమిషన్‌ను ప్రక్షాళన చేపట్టడంతోపాటు కొత్తగా 60 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. దీంతో కమిషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. -
ఏపీలో రేపే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపు గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. రాష్డ్ర వ్యాప్తంగా 89 పోస్టులకి గ్రూప్-1 నోటిఫికేషన్ ఇవ్వగా, ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్ధుల దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లగా గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ విధానంలో గ్రూప్-1 ప్రిలిమనరీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా కేంద్రాల్లో 301 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ -1 జనరల్ స్టడీస్ పరీక్ష, ఉదయం 9.45 గంటల వరకు అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్ -2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్షకి 18 జిల్లాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమారాలతో పర్యవేక్షించనున్నారు. గ్రూప్ వన్ ప్రిలిమనరీ పరీక్ష పర్యవేక్షణకు 18 మంది ఐఏఎస్‌లను నియమించారు. జిల్లా కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలని అభ్యర్ధులకు ఎపీపీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమనరీ నిర్వహణకు 301 మంది లైజనింగ్ అధికార్లు, 6612 మంది ఇన్విజలేటర్లు నియమించారు. ఏపీపీఎస్సీ నుంచి 39 మందికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇదీ చదవండి: ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే.. -
ఒక్కడు చేసిన పాపం.. ఎందరికో శాపం
పరీక్షల రద్దు ప్రకటన వేలాది మందికి అశనిపాతమే అయింది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్ధులకు కేరాఫ్‌గా మారిన ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, అశోక్‌నగర్, తదితర ప్రాంతాలు పరీక్షల రద్దు ప్రకటనతో ఉలిక్కిపడ్డాయి. అశోక్‌నగర్‌లోని నగర కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న వేలాది మందిలో గందరగోళం నెలకొంది. ఒక్క సిటీసెంట్రల్ లైబ్రరీలోనే కాదు..అశోక్‌నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అద్దె గదుల్లో, స్టడీరూమ్లలో, కోచింగ్ కేంద్రాల్లోనూ చదువుకుంటున్న లక్షలాది మంది అభ్యర్ధులు కొద్ది రోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అశోక్‌నగర్ ప్రాంతంలోనే చిన్నవి, పెద్దవి సుమారు 30కి పైగా కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వయోపరిమితిలో చివరకు చేరుకొన్న అభ్యర్ధులు మొదలుకొని, ఈ ఏడాదే డిగ్రీ పూర్తయిన విద్యార్థుల వరకు ఒక్కో అభ్యర్థి కోచింగ్‌కు, మెటీరియల్‌కు, ఇళ్ల అద్దె, భోజనం తదితర సదుపాయాల కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే మకాంవేసి ఉంటున్నారు.‘పరీక్షల రద్దుతో చదవడం మానేసి ఇంటికి వెళ్లాలా లేకపోతే మరో ప్రకటన కోసం ఎదురు చూస్తూ చదువుకోవాలా’ తేల్చుకోలేకపోతున్నట్లు పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం అమ్ముకున్నాడు బోధన్ సమీపంలోని కోటగిరి ప్రాంతానికి చెందిన శంకర్ కుటుంబానికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఉన్న కొద్దిపాటి భూమిలో అరఎకరం భూమిని తన చదువుల కోసమే అమ్మేశారు. మరో రూ.6 లక్షలు అప్పు చేయవలసి వచ్చింది. రెండేళ్లుగా కష్టపడి చదువుతున్నాడు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించాడు. మెయిన్స్‌లోనూ విజయం సాధిస్తాననే గట్టి నమ్మకంతో ఉన్నాడు.‘ఐదు రూపాయల భోజనం తిని చదువుకుంటున్నాను. స్టడీమెటీరియల్, కోచింగ్, పరీక్షల కోసమే ఎక్కువ ఖర్చు చేస్తున్నా. ఇటీవల ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. అయినా సరే ఉద్యోగం వస్తే అంతా బాగుంటుందనే ఆశతో ఉన్నాను. కానీ ఇప్పుడు ఇలా అయింది.’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లో ఉండాలా, వద్దా తేల్చుకోలేకపోతున్నట్లు చెప్పాడు. ఏం సమాధానం చెప్పాలి సంగారెడ్డికి చెందిన పద్మావతి ఏడాదిన్నర కాలంగా పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నారు. ఇంటికి, కుటుంబానికి దూరంగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఈసారి ఎలాగైనా జాబ్ గ్యారెంటీ అనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు ఆమె నమ్మకాన్ని వమ్ము చేశాయి. ‘ఎప్పటి వరకు ప్రిపరేషన్ పూర్తవుతుంది. పరీక్షలు ఎప్పుడు రాస్తావు, మళ్లీ ఇంటికి ఎప్పుడొస్తావు అని నాన్న అడుగుతున్నారు. కానీ ఏం సమాధానం చెప్పాలి?’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రద్దు మంచిదే ‘ఒకవిధంగా రద్దు చేయడం మంచిదే. లీకేజీ వల్ల నిజాయితీగా కష్టపడే వాళ్లకు అన్యాయం జరుగుతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలో ఒక ప్రభుత్వ సంస్థ ఇంత బలహీనంగా ఉండడమే ఆందోళన కలిగిస్తోంది’ అని మరో అభ్యర్థిని విజయలక్ష్మి పేర్కొన్నారు. సగటున ఒక అభ్యర్థి ఖర్చులు అంచనా.. నలుగురితో కలిసి ప్రతి నెలా చెల్లించే ఇంటి అద్దె : రూ.3500 నెల భోజనం ఖర్చు : రూ.2900 స్టడీరూమ్ (ఏసీ) రూ.1700 స్టడీరూమ్ (నాన్ ఏసీ) రూ.900 గ్రూప్–1 కోచింగ్ ఫీజు రూ. 75,000 గ్రూప్–2, కోచింగ్ ఫీజు రూ.28,000 స్టడీ మెటీరియల్ రూ.15000 ఒక అభ్యర్ధికి ఏడాదికి అయ్యే ఖర్చు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు. మరిన్ని అదనపు సదుపాయాలతో చదువుకుంటే రూ.3 లక్షలపైనే ఖర్చవుతుంది. రద్దు అన్యాయం నేను గ్రూప్–1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్‌కు చాలా సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్న సమయంలో పేపర్ లీక్ అంటూ రద్దు చేశారు. ఇది చాలా అన్యాయం. ఎవడో తప్పు చేస్తే నిజాయితీగా రాసిన వేలాదిమంది అభ్యర్థులను పరిగణనలోనికి తీసుకోకుండా పరీక్ష పూర్తిగా రద్దు చేయడం అన్యాయం. తప్పు చేసిన వారిని గుర్తించి శిక్షించాలి కానీ అందరికి శిక్ష వేడం సరికాదు. ఈ విషయంలో పునరాలోచించి మాలాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నా. – పిట్ల సరిత, డిచ్పల్లి, గ్రూప్–1 అభ్యర్థి -
ఏపీలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 95, 208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య 4, 59, 182గా ఉంది. 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్మెంట్ బోర్డు.. 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది. కాగా, ఈరోజు (ఆదివారం) ఫలితాల్ని విడుదల చేశారు. -
AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. అలాగే కీని సైతం రిలీజ్ చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆదివారం ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ అప్ లోడ్ చేశారు అధికారులు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు id mail-slprb@ap.gov.in మెయిల్ ఐడీ కేటాయించింది రిక్రూట్మెంట్ బోర్డు. పూర్తి సమాచారం కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ క్లిక్ చేయండి -
AP Police Constable Exam : ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష .. (ఫొటోలు)
-
AP: ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్ష కేంద్రాలు వద్ద పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆఖరు నిమిషంలో పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు పరుగులు తీశారు. తిరుపతి: జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులు చివరి నిమిషము కొందరు తడబాటుకు గురయ్యారు. పరీక్ష కేంద్రాలు మారిపోవడంతో కానిస్టేబుల్స్ దగ్గరుండి ద్విచక్ర వాహనం పై తీసుకు వెళ్లి దించి సహకారం అందించారు. ఉరుకులు, పరుగులతో చివరి నిమిషం నిర్ణీత సమయము లోపు పరీక్ష కేంద్రాలకు హజరయ్యారు. ఉదయం 8.30 గంటలు నుంచే పరీక్ష కేంద్రాలకు అనుమతించడంతో 10 గంటలు లోపు చేరుకుని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు. -
AP Police Constable Exam: ఒక్క నిముషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
ఒంగోలు టౌన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు ఈనెల 22 ఆదివారం నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షలకు అన్నీ రకాల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 22,281 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని, వీరిలో పురుషులు 17,833 మంది, మహిళలు 4448 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 17, మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో 21 మొత్తం 38 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను అనుమతిస్తారని, 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యం అయినా అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. హాల్ టికెట్లలో పేర్కొన్న నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి మొబైల్ ఫోన్లు, డిజిటల్ వాచీలు, బ్లూ టూత్, కాలిక్యులేటర్ లాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను అనుమతించేది లేదన్నారు. అమలులో 144 సెక్షన్: పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 144 విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే సంబంధిత పోలీసు అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించారని, స్ట్రాంగ్ రూంలు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారని వివరించారు. పోలీసు శాఖ అధికారులు, రీజినల్ కో ఆర్డినేటర్, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లు సమన్వయంగా విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఒంగోలులోని పరీక్ష కేంద్రాల వద్ద అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, మార్కాపురానికి అడిషనల్ ఎస్పీ (క్రైమ్) ఎస్వీ శ్రీధరరావులను నియమించినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల చుట్టు పక్కల జిరాక్స్ షాపులను మూసి వేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్: అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరడానికి మార్గమధ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండుల వద్ద ప్రత్యేక హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సబ్ ఇన్స్పెక్టర్ని, మూడు నాలుగు కేంద్రాలకు క్లస్టర్ చేసి ఒక ఇన్స్పెక్టరును ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేలా ఫ్లయంగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. -
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి.. కీలక సూచనలివే!
సాక్షి, అమరావతి: పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన ప్రిలిమినరీ పరీక్షకు సమయపాలనను కచ్చితంగా పాటించాలని పోలీసు నియామక మండలి నిర్ణయించింది. నిర్ణీత సమయానికి కంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకేంద్రంలోకి అనుమతించరనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు మొత్తం 5.03 లక్షలమంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టుల భర్తీకి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు పోలీసు నియామక మండలి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పరీక్ష సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థులకు కొన్ని కీలక సూచనలు చేసింది. అవి.. ► అభ్యర్థులు ఒకరోజు ముందుగానే తమ పరీక్షకేంద్రాన్ని సందర్శించి నిర్ధారించుకోవాలి. ► అభ్యర్థులను ఆదివారం ఉదయం 9 గంటల నుంచి పరీక్షకేంద్రంలోకి అనుమతిస్తారు. ► ఉదయం 10 గంటల తరువాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. ► మొబైల్ ఫోన్/సెల్యూలార్ ఫోన్, ట్యాబ్/ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు/రికార్డింగ్ పరికరాలు, కాలిక్యులేటర్, లాగ్ టేబుళ్లు, వాలెట్, పర్సు, నోట్స్, చార్టులు, పేపర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షకేంద్రంలోకి అనుమతించరు. వాటిని పరీక్షకేంద్రం వద్దకు తీసుకురాకూడదు. వాటిని భద్రపరిచేందుకు పరీక్షకేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. ► అభ్యర్థులు ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డు వంటి ఏదైనా ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డు తీసుకురావాలి. ► హాల్‌టికెట్, బ్లూ/బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ తీసుకురావాలి. -
గ్రూప్–1 మెయిన్స్ సన్నద్ధతపై సందిగ్ధం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి మూడు నెలలు కావస్తున్నా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికీ ఆ ఫలితాలను ప్రకటించలేదు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు సన్నద్ధం కావాలా? వద్దా? అనే అంశాన్ని తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రాథమికంగా వెల్లడించింది. ఈ క్రమంలో గడువు దగ్గర పడుతుండగా.. ప్రిలిమ్స్ ఫలితాలను ఇంకా ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 కొలువులతో పాటు ఇతర కేటగిరీల్లో పోస్టుల ప్రకటనలు పెద్ద సంఖ్యలో విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్–1 మెయిన్స్ అర్హతపై స్పష్టత వస్తే ఇతర ఉద్యోగాలవైపు దృష్టిపెట్టాలా? వద్దా? అనేది తేల్చుకోవడానికి అవకాశం ఉంటుందని అభ్యర్థులు అంటున్నారు. 8.7 శాతమే మెయిన్స్‌కు అర్హులు రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్–1 కేటగిరీలో 503 ఖాళీల భర్తీకోసం గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 1,019 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజర్యారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు మెయిన్స్‌కు ఎంపికవుతారు. ఈ క్రమంలో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. మలీ్టజోన్ల వారీగా రిజర్వేషన్లుకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 50 మందిని ఎంపిక చేస్తూ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయాలి. ఈ లెక్కన 25,150 మంది అభ్యర్థుల జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేయాలి. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో కేవలం 8.7 శాతం మంది మాత్రమే మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. దీంతో మిగతా అభ్యర్థులు ఇతర కొలువులపై దృష్టి పెట్టాల్సిందే. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదలైతే మిగతా అభ్యర్థులు ఇతర కొలువులకు సన్నద్ధం కావడానికి వీలుంటుంది. కానీ ఇప్పటికీ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమినరీ కీ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈమధ్యే నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన కీ విడుదల అయ్యింది. శనివారం సాయంత్రం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కీను అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ ఉండనుంది. కీ ఓఎంఆర్ షీట్ల డౌన్ లోడ్ కోసం క్లిక్ చేయండి -
రెండ్రోజుల్లో గ్రూప్–1 హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే హాల్‌టికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఏడాది వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్‌ను నిర్ధారించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
TS: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల్లో తప్పులుదొర్లాయి. ప్రశ్నాపత్రంలో 13 తప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్డుకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తోంది. దీంతో, ఎక్కువ ఫిర్యాదులు వస్తే అభ్యర్థులకు గరిష్టంగా 8 మార్కులు కలిపే అవకాశం అందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సబ్ ఇన్పెక్టర్ పోస్టులకు ఆగష్టు 7న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 12న ప్రశ్నాపత్రం ‘కీ’ ని వెబ్ సైట్లో పెట్టారు. ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలు తొలగించారు. ఇంగ్లీష్- తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇది కూడా చదవండి: అడ్వాన్స్డ్ పేపర్ హార్డే -
ఎస్ఐ పరీక్షకు 91.32% హాజరు
సాక్షి, హైదరాబాద్/కోదాడ అర్బన్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సబ్ ఇన్స్పెక్టర్ (సివిల్), ఇతర విభాగాల్లోని ఎస్ఐ సమాన పోస్టుల ప్రాథమిక రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన 503 పరీక్ష కేంద్రాల్లో 91.32% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు. 2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది హాజరైనట్లు స్పష్టం చేశారు. ప్రతీ అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ విధానంలో వేలిము ద్రలతో పాటు డిజిటల్ ఫొటో ద్వారా రికార్డు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతా మని వెల్లడించారు. కాగా, సంగారెడ్డితో పాటు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు. గూగుల్ తప్పుగా చూపించింది.. పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యానని, అందులో కోదాడలోని ఎస్ఆర్ఎం పాఠశాల కొమరబండ వద్ద చూపించిందని పాలకవీడు మండలం కోమటికుంటకు చెందిన కృష్ణ జయదేవ్ చెప్పాడు. అక్కడికి వెళ్లి మళ్లీ పట్టణంలోకి వచ్చే సరికి 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందన్నాడు. గూగుల్‌లో పాఠశాల అడ్రస్‌ను అప్డేట్ చేయకపోవడంతో ఇలా జరిగిందన్నాడు. -
చుక్కలు చూపించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష
కడప కల్చరల్/ సాక్షి, అమరావతి: ‘సౌత్‌పోల్ అంటే యూత్ పోల్. మీడియేషన్ అంటే మెడిటేషన్. బై క్యామెరల్ అంటే రెండు కెమెరాల విధానం. క్రూడ్ బర్త్ రేట్ అంటే మూడిద పుట్టుక, మూడిద మరణం’ అంతా పిచ్చిపిచ్చిగా అనిపిస్తోంది కదూ. మనకే ఇలా ఉంటే.. ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కొని ఆదివారం గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించుకోండి. తెలుగు మాధ్యమంలో పరీక్ష రాసే అవకాశం ఉండడంతో కొంతమంది అభ్యర్థులు తెలుగులోనే పరీక్షలు రాశారు. ప్రశ్నపత్రాన్ని ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో కూడా ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇంగ్లిష్ ప్రశ్నలకు ఇచ్చిన తెలుగు అనువాదాన్ని చూసి తెలుగు మీడియం అభ్యర్థులకు కళ్లు బైర్లు కమ్మాయి. ఇంగ్లిష్ ప్రశ్నలకు అత్యంత సులువుగా తెలుగులో అనువాదం ఇచ్చే అవకాశం ఉన్నా తెలుగు పండితులు సైతం అర్థం చేసుకోలేని విధంగా ఘోరమైన అనువాదంతో ప్రశ్నలు ఇచ్చారు. ఇదంతా ప్రశ్నపత్రంలోని ‘డి’ సిరీస్‌లో జరిగిందని అభ్యర్థులు వాపోతున్నారు. తెలుగు అనువాదం అధ్వానంగా ఉండటంతో పలుమార్లు ఇంగ్లిష్ ప్రశ్నలతో పోల్చి చూసుకుంటే గానీ తెలుగు ప్రశ్న అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఏపీపీఎస్సీ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇచ్చిన సమయంలో తెలుగు ప్రశ్నలను అర్థం చేసుకునేందుకు సమయం చాల్లేదని, దీంతో తాము దాదాపు పది మార్కుల వరకు కోల్పోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ‘భారత రాజ్యాంగ ఫెడరల్ లక్షణాలు కానివి ఏవి’ అంటూ ఇచ్చిన ప్రశ్నకు బై క్యామెరల్ లెజిస్లేచర్ అన్న అర్థం రావాల్సి ఉండగా.. ‘రెండు కెమెరాల చట్టం’ అంటూ తెలుగులో సమాధానం ఇవ్వడం గమనిస్తే ప్రశ్నపత్రం రూపకల్పన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తికమక ప్రశ్నలు ‘డి’ సిరీస్ ప్రశ్నపత్రంలో పది వరకు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్–2 పరీక్షల్లో కూడా ఏపీపీఎస్సీ స్వామి భక్తిని ప్రకటించుకునేలా చంద్రబాబుపై, ఆయన ప్రభుత్వంపై ప్రశ్నలు ఇవ్వడం పలు విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనైనా గ్రూప్–1 ప్రశ్నపత్రాన్ని జాగ్రత్తగా రూపొందించి ఉండాల్సిందని అభ్యర్థులు అంటున్నారు. గ్రూప్–1 ప్రశ్నపత్రంలో తికమకగా ఉన్న తెలుగు అనువాదం (టిక్కులు వేసినవి) నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను ఇబ్బందిపెట్టిన పేపర్–2 ఈసారి గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలోని ప్రశ్నలను సివిల్ సర్వీస్‌కు సమాన స్థాయిలో ఇచ్చారని అభ్యర్థులు వాపోయారు. పేపర్–1, పేపర్–2ల్లోని ప్రశ్నలన్నీ చాలా కఠినంగా ఉన్నాయని, సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు మాత్రమే రాయగలిగే స్థాయిలో ప్రశ్నలు రూపొందించారని తెలిపారు. పేపర్–2 మ్యాథమెటిక్స్ అభ్యర్థులకు మాత్రమే అనుకూలంగా ఉందన్నారు. గ్రూప్–1 కేడర్ పోస్టులు కాబట్టి ఆ స్థాయిలో ప్రశ్నలు అడగడంతో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అర్హులయ్యే వారి సంఖ్య చాలా కుదించుకుపోనుంది. గతంలో గ్రూప్–1 స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 మార్కులకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలపై ప్రశ్నలు అడిగేవారు. ఈసారి స్క్రీనింగ్ టెస్టును పేపర్–1, పేపర్–2గా విభజించి 120 మార్కుల చొప్పున 240 మార్కులకు పెంచారు. పేపర్–2లో జనరల్ ఆప్టిట్యూడ్‌లో మ్యాథమెటిక్స్, రీజనింగ్‌కు సంబంధించి 60 ప్రశ్నలుండడంతో మ్యాథ్స్ చదవని జనరల్ డిగ్రీ అభ్యర్థులు నానా అవస్థలు ఎదుర్కొన్నారు. చాలా వరకు తాము ఆ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించలేకపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా రుణాత్మక (నెగెటివ్) మార్కులుండడంతో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించకుండా వదిలేశామని వివరించారు. మ్యాథమెటిక్స్ చదవని జనరల్ డిగ్రీ అభ్యర్థులు ఈసారి చాలా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కొత్తగా పరీక్ష విధానాన్ని మార్చిన ఏపీపీఎస్సీ డిగ్రీ (మ్యాథ్స్) లేదా ఇంజనీరింగ్ చేస్తున్నవారికి మేలు కలిగేలా పేపర్–2ను పెట్టిందని వాపోతున్నారు. పైగా ఆంగ్లం, తెలుగులో ఇచ్చిన ఈ ప్రశ్నలు చదువుకొని అర్థం చేసుకోవడానికే చాలా సమయం పట్టిందని, కొన్ని సందర్భాల్లో తెలుగు ప్రశ్నలు అర్థం కాక ఆంగ్ల ప్రశ్నలు చూసుకోవలసి వచ్చిందన్నారు. కొన్ని ప్రశ్నలకు ఆంగ్ల ప్రశ్నలు, సమాధానాల్లో ఒకటి సరైనదిగా ఉంటే తెలుగులోకి వచ్చే సరికి వేరే సమాధానం సరైనదన్న సందిగ్థం ఏర్పడిందని వివరించారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోలేక అవస్థలు గ్రూప్–1 ప్రిలిమినరీకి తక్కువ మందే హాజరవుతున్నా పరీక్ష కేంద్రాలను మాత్రం సుదూరంలో కేటాయించడంతో అభ్యర్థులు నానా అవస్థలు పడ్డారు. నగరాల్లో అనేక పరీక్ష కేంద్రాలున్నా వాటిని కాదని ఎక్కడో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులకు చుక్కలు కనిపించాయి. కొన్ని కేంద్రాలకు బస్సులు, ఆటోలు కూడా నడవని పరిస్థితి. పైగా ఆదివారం కావడంతో ఆటోలు కూడా అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలామంది ప్రత్యేకంగా అద్దె కార్లు, ఆటోలు మాట్లాడుకుని చేరాల్సి వచ్చింది. కళాశాలలకు సరైన రోడ్లు కూడా లేని ప్రాంతాల్లో వాహనాలు పోయేందుకు అవకాశం లేక కిలోమీటర్ల మేర మండుటెండల్లో నడవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులు నానా ఇక్కట్లకు గురయ్యారు. 73.76 శాతం మంది హాజరు రాష్ట్రంలో 169 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు 73.76 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం పేపర్–1 జనరల్ స్టడీస్, మధ్యాహ్నం పేపర్–2 జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1కు 59,697 మంది, పేపర్–2కు 59,200 మంది హాజరయ్యారు. 254 పరీక్ష కేంద్రాల్లో ఆఫ్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్షకు 1,14,473 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 80,250 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. -
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న సబ్ఇన్స్పెక్టర్ సివిల్, ఇతర విభాగాల ప్రిలిమినరీ రాతపరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. ఈ నెల 26న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి 24వ తేదీ అర్ధరాత్రి 12గంటల వరకు అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై గతంలో దరఖాస్తు చేసిన సమయంలో అప్‌లోడ్‌చేసిన ఫొటోనే తప్పనిసరిగా అతికించి తీసుకురావాలని సూచించారు. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్–తెలుగు/ఇంగ్లిష్–ఉర్దూ భాషల్లో ఉంటుందని తెలిపారు. పరీక్ష హాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ఫోన్లు, కాలిక్యులేటర్, రిస్ట్ వాచెస్, బ్లూటూత్ తదితరాలను అనుమతించబోమని తేల్చిచెప్పారు. బ్లాక్/బ్లూ బాల్ పాయింట్ పెన్‌తో మాత్రమే పరీక్ష రాయాలని పేర్కొన్నారు. ప్రతీ అభ్యర్థి నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు తీసుకుంటామని, అభ్యర్థులెవరు మెహందీ, తాత్కాలిక టాటూలను వేళ్లపై వేసుకోవద్దని సూచించారు. ఓఎంఆర్ సమాధానపత్రంపై ఎలాంటి అభ్యంతరకరమైన సందేశాలు, గుర్తులు రాయవద్దని స్పష్టం చేశారు. -
ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
29,455 మంది హాజరు బయోమెట్రిక్ విధానంతో ఇక్కట్లు వేలిముద్రలు పడక అభ్యర్థుల ఆందోళన కాకినాడ క్రైం : పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ముందుగానే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని కాకినాడ రీజినల్ సెంటర్ పరిధిలో 37 క్యాంపస్‌ల్లో 60 పరీక్ష కేంద్రాల్లో 33,965 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు 33,965 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 29,455 మంది హాజరుకాగా, 4,510 మంది గైర్హాజరయ్యారని జేఎ¯ŒSటీయూకే కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్‌తో ఇక్కట్లు పరీక్ష రాసే అభ్యర్థులకు తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానంలో కొంత మంది వేలిముద్రలు çపడక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్యాబ్‌ల్లో వేలిముద్రల నమోదుకు అభ్యర్థులు బారులు తీరడం, అధిక సమయం తీసుకోవడంతో పరీక్ష నిర్వహించే గదుల్లోనే వేలిముద్రలు తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొంత మంది అభ్యర్థుల వేలిముద్రలు పడకపోవడంతో తెల్ల కాగితంపై వేలిముద్రలు పడలేదని లెటర్ రాసివ్వాలని ఇన్విజిలేటర్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు తెల్లకాగితాల కోసం పరీక్ష కేంద్రం నుంచి బయటకొచ్చి సమీపంలోని షాపుల్లో కొనుక్కొని వెళ్లి, ఆదరాబాదరాగా వివరణ రాసి ఇచ్చారు. దీని కోసం తీవ్ర ఆందోళన, ఒత్తిడికి లోనయ్యామని అభ్యర్థులు ఆవేదన చెందారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచీలను అనుమతించకపోవడంతో సమయం తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. రాజమహేంద్రవరం క్రైం : కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పరిధిలో 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 9,892 వేల మంది దరఖాస్తు చేసుకోగా 8,884 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రలకు చేరుకోలేక వెనుదిరిగి సంఘటనలు ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆరŠట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని లోపలకు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు. -
నేడు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష
-
సివిల్స్‌కు దరఖాస్తులు షురూ
న్యూఢిల్లీ: ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించే ప్రక్రియ ప్రారంభమయింది. ఈ సారి అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ లేదా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లలో ఏదానికైనా లేదా రెండింటికైనా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. 2011లో జరిగిన పరీక్షతో నిర్ణీత అవకాశాలు పూర్తయిన వారికి ఈసారి మరో అవకాశం ఇస్తున్నట్లు వివరించింది. ప్రిలిమినరీ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించనున్నారు. ‘అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో www.upsconline.nic.in వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుల ప్రక్రియ మే 23న ప్రారంభమై జూన్19నాటికి ముగియనుంది.