TS: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌! | Chances Of Marks For Mistakes In Telangana Constable Preliminary Exam | Sakshi
Sakshi News home page

TS: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. తప్పుడు ప్రశ్నలకు మార్కులు!

Published Mon, Aug 29 2022 3:30 PM | Last Updated on Mon, Aug 29 2022 3:34 PM

Chances Of Marks For Mistakes In Telangana Constable Preliminary Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన తెలంగాణ కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల్లో తప్పులుదొర్లాయి. ప్రశ్నాపత్రంలో 13 తప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్డుకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తోంది. దీంతో, ఎక్కువ ఫిర్యాదులు వస్తే అభ్యర్థులకు గరిష్టంగా 8 మార్కులు కలిపే అవకాశం అందని నిపుణులు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా.. సబ్ ఇన్పెక్టర్ పోస్టులకు ఆగష్టు 7న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 12న ప్రశ్నాపత్రం ‘కీ’ ని వెబ్ సైట్‌లో పెట్టారు. ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలు తొలగించారు. ఇంగ్లీష్‌- తెలుగు వెర్షన్‌లోని ‘ఎ’ బుక్‌లెట్‌లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: అడ్వాన్స్‌డ్‌ పేపర్‌ హార్డే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement