సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తైంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌ఎల్పీఆర్‌బీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఒకే కుటుంబంలో నలుగురికి కొలువులు వచ్చాయి. దీంతో, ఆ కుటుంబ సభ్యులు, అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడంతో విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. ఇంట్లో నలుగురికి జాబ్ రావడం సంతోషం వ్యక్తం చేశారు.
మరోవైపు.. పోలీసు నియామక ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.
వరంగల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్. ఈయన వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంజలి. వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష.
Comments
Please login to add a commentAdd a comment