హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది. కానిస్టేబుల్ నియామకంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో.. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది.
కానిస్టేబుల్ ప్రశ్న పత్రం లో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో.. సెలక్ట్ అయిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పు ను సవాలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. గత తీర్పును కొట్టేసింది. సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూనే.. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలనీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment