
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక మండలి తాజాగా నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల కీ విడుదల అయ్యింది. మంగళవారం సాయంత్రం కీని వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపిన అధికారులు.. అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలని అభ్యర్థులను కోరారు. అయితే బోర్డు రిలీజ్ చేసిన కీ ప్రకారం.. అభ్యర్థులకు ఐదు మార్కులు కచ్చితంగా జత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అభ్యంతరాలపై రేపటి నుంచి(ఆగష్టు 31) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 సాయంత్రం ఐదు గంటల వరకు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలను.. విడివిడిగా తగిన ఆధారాలతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారులు. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి గనుక తీసుకుంటే.. ఇంకొన్ని మార్కులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది!.
ఐదు మార్కులు!
పోలీస్ నియామక మండలి వెబ్‌సైట్‌లో ఉంచిన కీ ప్రకారం.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు జత చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కీ చివర్లో సదరు విషయాన్ని పరోక్షంగా పేర్కొంది రిక్రూట్‌మెంట్ బోర్డు. ఇక తెలంగాణలో ఆదివారం (ఆగస్టు 28వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలో.. 91.34 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ సహా 38 పట్టణాల్లో పరీక్ష జరగ్గా.. 6,61,198 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకుని 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment