- 29,455 మంది హాజరు
- బయోమెట్రిక్ విధానంతో ఇక్కట్లు
- వేలిముద్రలు పడక అభ్యర్థుల ఆందోళన
ప్రశాంతంగా కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష
Published Sun, Nov 6 2016 9:37 PM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
కాకినాడ క్రైం :
పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించబోమని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ ముందుగానే స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని కాకినాడ రీజినల్ సెంటర్ పరిధిలో 37 క్యాంపస్‌ల్లో 60 పరీక్ష కేంద్రాల్లో 33,965 మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు వీలుగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షకు 33,965 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 29,455 మంది హాజరుకాగా, 4,510 మంది గైర్హాజరయ్యారని జేఎ¯ŒSటీయూకే కన్వీనర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బయోమెట్రిక్‌తో ఇక్కట్లు
పరీక్ష రాసే అభ్యర్థులకు తొలిసారిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేశారు. ఈ విధానంలో కొంత మంది వేలిముద్రలు çపడక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్యాబ్‌ల్లో వేలిముద్రల నమోదుకు అభ్యర్థులు బారులు తీరడం, అధిక సమయం తీసుకోవడంతో పరీక్ష నిర్వహించే గదుల్లోనే వేలిముద్రలు తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొంత మంది అభ్యర్థుల వేలిముద్రలు పడకపోవడంతో తెల్ల కాగితంపై వేలిముద్రలు పడలేదని లెటర్ రాసివ్వాలని ఇన్విజిలేటర్లు చెప్పారు. దీంతో అభ్యర్థులు తెల్లకాగితాల కోసం పరీక్ష కేంద్రం నుంచి బయటకొచ్చి సమీపంలోని షాపుల్లో కొనుక్కొని వెళ్లి, ఆదరాబాదరాగా వివరణ రాసి ఇచ్చారు. దీని కోసం తీవ్ర ఆందోళన, ఒత్తిడికి లోనయ్యామని అభ్యర్థులు ఆవేదన చెందారు. పరీక్ష కేంద్రాల్లోకి వాచీలను అనుమతించకపోవడంతో సమయం తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు.
రాజమహేంద్రవరం క్రైం : కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా పరిధిలో 20 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 9,892 వేల మంది దరఖాస్తు చేసుకోగా 8,884 మంది హాజరయ్యారు. కొన్ని చోట్ల దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రలకు చేరుకోలేక వెనుదిరిగి సంఘటనలు ఉన్నాయి. రాజమహేంద్రవరం ఆరŠట్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని లోపలకు అనుమతించలేదు. దీంతో వారు వెనుదిరిగారు.
Advertisement