
అమరావతి: ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 95, 208 మంది అభ్యర్తులు ఉత్తీర్ణత సాధించారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్థుల సంఖ్య 4, 59, 182గా ఉంది.
6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత నెల 22వ తేదీన ఈ పరీక్ష నిర్వహించారు. ఇందుకు గాను 997 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదే రోజు పరీక్షా కీ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ బోర్డు.. 25వ తేదీ వరకూ కీపై అభ్యంతరాలకు సమయం ఇచ్చింది. కాగా, ఈరోజు (ఆదివారం) ఫలితాల్ని విడుదల చేశారు.