జ్వరం కారణంగా సమయానికి చేరుకోలేకపోయానని పరీక్షకు అనుమతించాలని డీఎస్పీని వేడుకుంటున్న ఆదిలాబాద్‌కు చెందిన అభ్యర్థిని. అయినప్పటికీ ఆమెను అనుమతించలేదు.
సాక్షి, హైదరాబాద్/కోదాడ అర్బన్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్), ఇతర విభాగాల్లోని ఎస్‌ఐ సమాన పోస్టుల ప్రాథమిక రాతపరీక్ష ప్రశాంతంగా జరిగింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన 503 పరీక్ష కేంద్రాల్లో 91.32% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరై నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు వెల్లడించారు.
2,47,217 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 మంది హాజరైనట్లు స్పష్టం చేశారు. ప్రతీ అభ్యర్థి హాజరును బయోమెట్రిక్ విధానంలో వేలిము ద్రలతో పాటు డిజిటల్ ఫొటో ద్వారా రికార్డు చేసినట్టు తెలిపారు. త్వరలోనే ఈ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతా మని వెల్లడించారు. కాగా, సంగారెడ్డితో పాటు వరంగల్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న అభ్యర్థులను సిబ్బంది లోనికి అనుమతించలేదు.
గూగుల్ తప్పుగా చూపించింది..
పరీక్షా కేంద్రానికి వచ్చేందుకు గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యానని, అందులో కోదాడలోని ఎస్‌ఆర్‌ఎం పాఠశాల కొమరబండ వద్ద చూపించిందని పాలకవీడు మండలం కోమటికుంటకు చెందిన కృష్ణ జయదేవ్ చెప్పాడు. అక్కడికి వెళ్లి మళ్లీ పట్టణంలోకి వచ్చే సరికి 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందన్నాడు. గూగుల్‌లో పాఠశాల అడ్రస్‌ను అప్‌డేట్ చేయకపోవడంతో ఇలా జరిగిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment